S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/15/2019 - 13:38

హైదరాబాద్: ప్రతి రంగంలోనూ నూతన ఆవిష్కరణలు జరగాలని గవర్నర్ తమిళసై అన్నారు. విద్యార్థులు పరిశోధనలు జరపాలని సూచించారు. బయోటెక్మాలజీ రంగం ప్రస్తుత పరిస్థితి- భవిష్యత్ అవకాశాలపై ఏర్పాటుచేసిన సదస్సును గవర్నర్ ప్రారంభించారు. ఈ సదస్సు రెండురోజుల పాటు జరుగనున్నది. రోజు రోజుకీ జీవసాంకేతిక రంగంలో మార్పులు సంభవిస్తున్నాయని అన్నారు. సరికొత్త విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు.

11/15/2019 - 05:51

హైదరాబాద్, నవంబర్ 14: తెలంగాణ రాష్ట్రానికి కొత్త ప్రోటోకాల్‌ను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రోటోకాల్ చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూపొందించిందని గుర్తు చేశారు. శాసనమండలి సభా హక్కుల కమిటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అధ్యక్షతన గురువారం సమావేశమైంది.

11/15/2019 - 05:49

హైదరాబాద్, నవంబర్ 14: దేశ ప్రయోజనాలను కాంగ్రెస్ పార్టీ తాకట్టు పెట్టొద్దని , చిల్ల రాజకీయాలు చేయవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ గురువారం నాడు హితవుపలికారు. ఆదివాసీ నేతలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరిన సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు అన్నీ వాస్తవ విరుద్ధమని తేలిపోయిందని లక్ష్మణ్ అన్నారు.

11/15/2019 - 05:48

హైదరాబాద్, నవంబర్ 14: బాలల పరిరక్షణ కోసం పటిష్టమైన చర్యలు చేపడుతామని, ఇందుకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం బాలల దినోత్సవం సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాలల దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

11/15/2019 - 01:11

హైదరాబాద్, నవంబర్ 14: దేశంలో సమ న్యాయానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రాంతీయ అసమానతలు తొలగి జాతీయ ఆదాయం సమాన పంపిణీ జరుగుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సర అంతర్జాతీయ కార్యనిర్వాహక అభివృద్ధి కార్యక్రమానికి కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

11/15/2019 - 06:03

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వైదొలిగే పక్షంలో ఆ పదవిని తనకే ఇవ్వాలని, తాను అధ్యక్ష పదవి రేసులో ఉన్నానని సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తనకు పీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని కోరుతూ ఏఐసీసీకి పూర్తి వివరాలతో లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఎటువంటి షరతులు లేకుండా తనకు పదవి ఇవ్వాలన్నారు.

11/15/2019 - 06:03

హైదరాబాద్: ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలకు మధ్య చర్చలకు గుదిబండగా మారిన ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను ఆర్టీసీ జేఏసీ వదులుకుంది. దీంతోనైనా తమను చర్చలకు పిలువాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆర్టీసీ సమ్మె 41 రోజుకు చేరుకున్నప్పటికీ కార్మికులతో చర్చలకు ప్రభుత్వం ససేమిరా అంగీకరించని విషయం తెలిసిందే.

11/14/2019 - 06:46

కరీంనగర్: కరీంనగర్ శివారులోని తీగులకుంటపల్లిలో ఉన్న కేసీఆర్ ఇంటిని ముట్టడించడానికి బుధవారం వామపక్షాలు యత్నించాయ. దీంతో ముందుగానే కేసీఆర్ ఇంటి వద్ద బ్యారికేడ్లు, ప్రహరీగోడలపై కంచెలను ఏర్పాటు చేశారు.

,
11/14/2019 - 06:44

మరిపెడ, నవంబర్ 13: ఆర్టీసీ కార్మికుల పట్ల కక్షపూరిత వైఖరిని అవలంబిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన 21వ హత్య మానుకోటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ నరేష్‌ది అని ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో ఆత్మహత్య చేసుకొని మరణించిన ఆర్టీసీ కార్మికుడు నరేష్ అంత్యక్రియల్లో బుధవారం ఆయన పాల్గొన్నారు.

11/14/2019 - 06:41

వరంగల్, నవంబర్ 13: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత్య ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం మానుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా గ్రామ పంచాయతీలకు బుధవారం ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం హన్మకొండ జేఎన్‌ఎస్ గ్రౌండ్‌లో జరిగింది.

Pages