S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/11/2019 - 05:58

హైదరాబాద్, నవంబర్ 10: ఆస్ట్రేలియాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియా-ఆస్ట్రేలియా లీడర్ షిప్ సదస్సుకు తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఆహ్వానం అందింది. ఆస్ట్రేలియా మెల్బోర్న్‌లో డిసెంబర్ 8,9 తేదీలలో రెండు రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో లీడర్ షిప్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు. నిర్వహకుల నుంచి మంత్రి కేటీఆర్‌కు ఈ సమ్మిట్‌కు హాజరుకావాల్సిందిగా ఆదివారం ఆహ్వానం అందింది.

11/11/2019 - 05:57

హైదారాబాద్, నవంబర్ 10: సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవకుండా కాలాపహరణం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి ఈ సమ్మె ఉచ్చుగా మారుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ హెచ్చరించారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, తమ డిమాండ్ల కోసం శాంతి యుతంగా ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పట్ల శనివారం పోలీసులు విచక్షణ రహితంగా దాడులు చేయడం దారుణమన్నారు.

11/11/2019 - 05:55

హైదరాబాద్, నవంబర్ 10: చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో భాగంగా శనివారం హైదరాబాద్ ఆర్టీసీ కార్మికులు, వామపక్షాల కార్యకర్తలపై పోలీసులు జరిపిన దాడులను సీపీఐ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతంగా చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం నిర్వహించడానికి కదలివచ్చిన కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడం అమానుష చర్యగా ఆయన అభివర్నించారు.

11/11/2019 - 05:41

హైదరాబాద్, నవంబర్ 10: పార్లమెంట్ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ చాలెంజ్‌కు ఇతర దేశాల్లో స్పందన వస్తోంది. సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ చాలెంజ్‌ను టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ స్వీకరించి మొక్కలు నాటారు. నాగేందర్ విసిరిన గ్రీన్ చాలెంజ్‌ను ఆస్ట్రేలియా డిప్యూటీ మినిస్టర్ జాసన్ వుడ్ స్వీకరించి మొక్కలు నాటారు.

11/11/2019 - 06:03

హైదరాబాద్, నవంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు రప్పించాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఈఎ) డిమాండ్ చేసింది. టీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార స్వామి అధ్యక్షతన టీఈఏ రాష్ట్ర కార్యకర్గ సమావేశం ఆదివారం ఇక్కడ జరిగింది. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించామని సంపత్ కుమార్ తెలిపారు.

11/11/2019 - 05:32

హైదరాబాద్, నవంబర్ 10: విశ్రాంత ఐఏఎస్ పీఎస్ కృష్ణన్ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కృష్ణన్ సామాజిక సంక్షేమ విధానాల రూపకల్పనలో కృష్ణన్ ఎనలేని కృషి చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. కొత్తతరం ఐఏఎస్ అధికారులు కృష్ణన్ విధానాలపై అవగాహన పెంచుకోవాలని సీఎం సూచించారు. కృష్ణన్ కుటుంబానికి సీఎం సానుభూతిని తెలిపారు.

11/11/2019 - 04:46

సంగారెడ్డి, నవంబర్ 10: అంతరిక్షానికి చేరుకున్నామని ఆనందిస్తున్న నేటి సమాజానికి నాటి విజ్ఞానమే మిన్నగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కె.జానారెడ్డి పేర్కొన్నారు.

11/11/2019 - 04:43

కరీంనగర్, నవంబర్ 10: తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో జిల్లాకో రూ.25 కోట్లతో కొత్తగా పోలీస్ కార్యాలయ భవన నిర్మాణాలు, ట్రెజరీ ఆఫీస్‌ల ఆధునీకరణ, పోలీస్ బలోపేతానికి రూ.375 కోట్లతో కొత్త వాహనాల కొనుగోలుకు కేటాయం చామని, ప్రగతి పథంలో మరో రూ.100 కోట్ల పనులున్నాయని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు.

11/11/2019 - 05:54

మహబూబ్‌నగర్: అమెరికా అబ్బాయితో పాలమూరు అమ్మాయికి వివాహం జరిగింది. ఆదివారం హైదరాబాద్‌లోని టూరిజం హోటల్‌లో వీరిద్దరి విహహం ఘనంగా జరిగింది. ఈ వివాహాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దగ్గరుండి నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వర్షిణి, అమెరికాలోని డల్లాస్‌కు చెందిన హేన్రిహుడ్‌గ్రీన్‌తో వివాహం జరిగింది. వీరిద్దరూ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.

11/11/2019 - 02:01

నాగర్‌కర్నూల్, నవంబర్ 10: రసాయన కంపెనీల కుట్రల వల్లే ప్రజా ఆరోగ్యానికి ఆహార పదార్థాలు హానికారకంగా మారాయని ప్రముఖ ఆహార శాస్తవ్రేత్త, కృషిరత్నడాక్టర్ ఖాదర్‌వలీ అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక సాయిగార్డెన్స్‌లో రైతులోకం ఫౌండేషన్, విశ్రాంత ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆహార, ఆరోగ్య రైతు సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

Pages