S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/10/2019 - 05:34

గద్వాల, నవంబర్ 9: ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాలకు, అక్కడి ప్రాజెక్కుల నుంచి విడుదలవుతున్న వరద నీటితో జూరాలకు స్వల్పంగా వరద ఉద్ధృతి పెరిగింది. శనివారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 318.490 మీటర్ల స్థాయిలో 9.603 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుంచి 83వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది.

11/10/2019 - 05:31

హైదరాబాద్, నవంబర్ 9: నిజమాబాద్‌లో తొందరగా పసుపుబోర్డును ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డిని టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి కోరారు. ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఆయన మెల్‌బోర్న్‌లో కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

11/10/2019 - 05:31

నాగార్జునసాగర్, నవంబర్ 9: రాష్ట్రంలో ఆర్టీసిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శాసనమండలి చైర్మన్‌గా నియమించబడ్డ తరువాత మొదటి సారిగా నాగార్జునసాగర్‌కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానం చేశారు. సర్పంచ్‌లు, పీఆర్‌టీయూ నాయకులు స్ధానిక విజయవిహార్ చేరుకున్న గుత్తా సుఖేందర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు.

11/10/2019 - 02:55

హైదరాబాద్, నవంబర్ 9: దక్షిణాఫ్రికా దేశంలో పర్యటించాలని టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావును ఆహ్వానించారు. ఎన్‌ఆర్‌ఐ విభాగం ప్రధాన కార్యదర్శి మేడసాని నరేందర్ రెడ్డి శనివారం ఇక్కడ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి కేటీఆర్‌ను కలిశారు. తమ విభాగం దక్షిణాఫ్రికాలో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు.

11/10/2019 - 02:52

హైదరాబాద్, నవంబర్ 9: తక్కువ ఖర్చుతో పోర్టబుల్ వరి కలుపును తీసే యంత్రాన్ని రూపొందించినందుకు యువ ఆవిష్కర్త అశోక్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఇది వరి పొలాల నుంచి పెద్ద కలుపు మొక్కలను సులభంగా తొలగించేందుకు సహాయపడుతుంది. ప్రగతిభవన్‌లో తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ ఫణీంద్ర సామ, యువ ఆవిష్కర్త అశోక్ మంత్రిని కలిశారు.

11/10/2019 - 02:50

హైదరాబాద్, నవంబర్ 9: అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ వద్ద డ్రైవర్‌గా పనిచేసి, అగ్నికి ఆహుతైన గురునాథానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించామని ట్రెసా (తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్) అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఈ మేరకు మీడియాకు సమాచారం అందించారు.

11/10/2019 - 02:57

హైదరాబాద్, నవంబర్ 9: తెలంగాణ ప్రజల సాగునీటి, తాగునీటి, పారిశ్రామిక నీటి అవసరాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. ఈ నెల 11 న దక్షిణాది రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.

11/09/2019 - 23:29

హైదరాబాద్, నవంబర్ 9: అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును బీజేపీ నేతలు స్వాగతించారు. అన్నివర్గాల ప్రజలు తీర్పును అంగీకరించాలని పార్టీ నేతలు వేర్వేరుగా విడుదల చేసిన ప్రకటనల్లో పేర్కొన్నారు. అయోధ్య తీర్పుపై పార్టీ నేతలు తొందరపడి ప్రకటనలు చేయవద్దని జాతీయ పార్టీ చేసిన సూచనతో రాష్ట్రాల నేతలు కొంత సంయమనం పాటించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, గౌరవిస్తున్నామని వారు చెప్పారు.

11/09/2019 - 23:29

హైదరాబాద్, నవంబర్ 9: రాష్ట్రంలో రెవెన్యూ సిబ్బందికి పూర్తిస్థాయి భద్రత కల్పించాలని, ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) డిమాండ్ చేసింది. ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.

11/09/2019 - 23:28

హైదరాబాద్, నవంబర్ 9: అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు అందరినీ సంతృప్తిపరచకున్నా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించాలని సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఆమోదించి శాంతి, సహనంతో ఉండాలని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం తన విచక్షణతో ఇచ్చిన తీర్పు అని అన్నారు.

Pages