S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/08/2019 - 22:52

హైదరాబాద్, నవంబర్ 8: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడలో ప్రైవేటు బస్సులకు అనుమతిపై ఇచ్చిన నిర్ణయంపై కోర్టు స్టే ఇచ్చిన అరగంటకే నాటి సీఎం నీలం సంజీవరెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని అన్నారు.

11/08/2019 - 22:50

హైదరాబాద్, నవంబర్ 8: ఆర్టీసీ కార్మికులు తమ న్యాయసమ్మతమైన డిమాండ్ల సాధనకు శనివారం తలపెట్టిన ట్యాంక్ బండ్ మార్చ్‌కి మద్దతు ఇస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. నెల రోజులకు పైగా ఆర్టీసీ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

11/08/2019 - 22:48

హైదరాబాద్, నవంబర్ 8: ఆర్టీసీ ఆస్తులపై కనే్నసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నాయకులు రాష్ట్ర రోడ్డురవాణా సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. అందులో భాగంగానే సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పిలిచి చర్చించాల్సింది పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వారి పట్ల బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు.

11/08/2019 - 22:48

హైదరాబాద్, నవంబర్ 8: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో దేవాలయాలకు 2,676 ఎకరాల భూమి ఉన్నట్టు లెక్క తేలింది. ఈ రెండు జిల్లాల్లోని ఆలయాలకు ఎంత భూమి ఉందో తేల్చడానికి దేవాదాయ శాఖ ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. మొత్తంగా 2,676 ఎకరాలు ఉన్నట్టు లెక్క తేలినప్పటికీ కొన్నిచోట్ల ఆక్రమణలకు గురైనట్టు సర్వేలో తేలింది.

11/08/2019 - 22:45

హైదరాబాద్, నవంబర్ 8: జీహెచ్‌ఎంసీ పరిధిలోని బిల్లు కలెక్టర్ ఉద్యోగాలకు అర్హులైన ప్రాధమిక అభ్యర్ధుల జాబితాను విడుదల చేసినట్టు టీఎస్‌పీఎస్‌సీ ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన నిర్వహించిన ఎంపిక పరీక్ష ఆధారంగా ఈ జాబితాను రూపొందించామని, వీరందరి సర్ట్ఫికేట్ల పరిశీలన నవంబర్ 15 నుండి మొదలవుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

11/08/2019 - 22:44

హైదరాబాద్, నవంబర్ 8: రెవెన్యూ ఉద్యోగులపై దాడులను ప్రోత్సహిస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న విద్వేషపూరిత ప్రచారాన్ని వెంటనే నియంత్రించి, ఈ ప్రచారం చేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రెవెన్యూ జేఏసీ కోరింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర పోలీస్ శాంతి భద్రతల అదనపుడీజీపీ జితేందర్‌ను కలిసి జేఏసీ నేతలు వినతిపత్రాన్ని అందజేశారు.

11/08/2019 - 05:33

జగిత్యాల, నవంబర్ 7: గోల్కొండ ఖిల్లాపై బీజేపీ జెండా ఎగురవేయడం తధ్యమని, జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణ పునాదే రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్‌ఎస్ పార్టీకి రాజకీయ సమాధి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. లక్ష్మణ్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ కెనాల్ వద్ద నూతనంగా నిర్మించనున్న బీజేపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.

11/08/2019 - 05:30

జగిత్యాల, నవంబర్ 7: రెవెన్యూ శుద్ధీకరణే భూవివాదాలకు ఆజ్యం పోసిందని, అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన సీఎం కేసీఆర్ అనాలోచిత విధానమే అని కాంగ్రెస్ సీనియర్ నేత పట్ట్భద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏదో నూతన ప్రకియ చేపట్టినట్లు రెవెన్యూశుద్ధీకరణను తెరపైకి తెచ్చిందని దీంతోనే రెవెన్యూపై వివాదాలు పెరిగాయని అన్నారు.

11/08/2019 - 05:27

మహబూబ్‌నగర్, నవంబర్ 7: ఆర్టీసీ ఆస్తులను అమ్మాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా గురువారం మహబూబ్‌నగర్‌కు విచ్చేసిన ఆయన ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు.

11/08/2019 - 05:15

విజయనగరం, నవంబర్ 7: అగ్రిగోల్డ్ బాధితులు అందరికీ న్యాయం చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. గురువారం ఇక్కడి ఆనందగజపతి ఆడిటోరియంలో అగ్రిగోల్డ్ బాధితులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం ఏం చేయడానికైనా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సామాన్యులకు ప్రభుత్వం అండగా ఉండాలనే భరోసా ఇస్తుందన్నారు. అగ్రిగోల్డ్ అనేది ఓ ప్రైవేటు సంస్థ.

Pages