S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/09/2019 - 23:27

హైదరాబాద్, నవంబర్ 9: సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్య వివాదానికి భరత వాక్యం పలకాలని, అభివృద్ధిపై దృష్టిసారించాలని లోక్‌సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ విజ్ఞత కలిగిన సమాజం గతం మీద దృష్టి పెట్టదని, ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలన్నారు. ఒక స్థానిక సమస్యను జాతీయ సమస్యగా తయారు చేసుకుని మనం చేయాల్సిన పనుల నుంచి మన దృష్టిని మరల్చుకున్నామన్నారు.

11/09/2019 - 16:00

హైదరాబాద్: ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన ఛలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం ఉద్రిక్తతకు చోటుచేసుకుంది. బైక్‌పై ట్యాంక్‌బండ్‌కు వచ్చిన ఎంపీ సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా పలువురు నేతలను గృహనిర్బంధం చేశారు. సచివాలయం వద్ద లాఠీఛార్జీ చేశారు. పలువురు కార్మికులు గాయపడ్డారు. పలువురు ఓయూ జేఏసీ నేతలు ట్యాంక్‌బండ్‌పై సొమ్మసిల్లి పడిపోయారు.

11/09/2019 - 00:14

హైదరాబాద్, నవంబర్ 8: ఆర్టీసీ కార్మికుల భవిష్యనిధికి (బీమా) చెల్లించాల్సిన బకాయి లు రూ. 760 కోట్లు తక్ష ణం చెల్లించాలని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మకు పీఎఫ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 15లోపు కార్మికులకు బకాయిలు చెల్లించకపోతే భారీ జరిమానా తప్పదని అధికారులు హెచ్చరించారు.

11/09/2019 - 00:10

హైదరాబాద్, నవంబర్ 8: ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా శనివారం చలో ట్యాంక్‌బండ్ నిర్వహించి తీరుతామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం విజయవంతం చేస్తామని ఆయన ప్రకటించారు. సమ్మెకు అన్ని రాజకీయ పక్షాలు, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయన్నారు.

11/09/2019 - 00:07

హైదరాబాద్, నవంబర్ 8: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం ఇక్కడ గాంధీభవన్ నుంచి ర్యాలీగా ఖైరతాబాద్ వరకు ర్యాలీగా వెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తల ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. ఉదయం 10 గంటలకే పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గాంధీభవన్ వద్దకు చేరుకున్నారు.

11/09/2019 - 00:01

ముస్తాబాద్, నవంబర్ 8: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను మెట్ట ప్రాంతాలకు తరలించి, బీడుభూముల్ని సస్యశ్యామలం చేసి, రాష్ట్రాన్ని ధనిక రైతులకు చిరునామాగా తీర్చిదిద్దుతామని, రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు అన్నారు.

11/08/2019 - 23:59

నాగర్‌కర్నూల్, నవంబర్ 8: టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికే పెద్దపీట వేస్తోందని, రైతును రాజును చేయడమే సీఏం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కొల్లాపూర్‌లో వ్యవసాయ మార్కెట్‌యార్డు నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

11/08/2019 - 23:56

వరంగల్, నవంబర్ 8: ప్రస్తుతం ఆర్థిక మాంద్యం ఏర్పడటానికి కేంద్రంలోని బీజేపి, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వాలే కారణమని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. శుక్రవారం వరంగల్ నగరంలోని ఏకశిల పార్కు వద్ద నిర్వహించిన కాంగ్రెస్ ధర్నా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.

11/08/2019 - 23:55

నిజామాబాద్, నవంబర్ 8: గడచిన 35రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె వివాదానికి ముగింపు పలికేందుకు హేతుబద్ధమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావును తెరాస అసమ్మతి నేతగా ముద్రపడ్డ రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు ఆర్టీసీ సమ్మె విషయమై శుక్రవారం ఆయన ముఖ్యమంత్రికి పంపిన బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేశారు.

11/08/2019 - 22:58

హైదరాబాద్, నవంబర్ 7: సుఖవ్యాధి గనేరియా వ్యాధిలో తెలంగాణ, సిఫిలిస్‌లో ఆంధ్రా అగ్రస్థానంలో నిలిచాయి. ఈ వివరాలను 2018లో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ హెల్త్ బ్యూరో నిర్వహించిన జాతీయ హెల్త్ ప్రొఫైల్‌లో ప్రకటించింది. సుఖవ్యాధులు సిఫిలిస్, గనేరియా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో విస్తరించాయి.

Pages