S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/14/2017 - 03:21

నిర్మల్, ఆగస్టు 13: చదువుల తల్లి సరస్వతిమాత కొలువుదీరిన బాసర ఆలయంలో వరుసగా జరుగుతున్న అపశృతులు ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్నాయ. కొంతమంది వ్యక్తుల కారణంగా ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లుతోంది. ఇటీవల ఆలయంలో చోటుచేసుకుంటున్న వరుస సంఘటనలు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. లక్షలాది మంది భక్తులతో ఆరాధింపబడుతున్న సరస్వతిదేవి ఆలయంలో..

08/14/2017 - 03:19

బాసర, ఆగస్టు13: బాసర క్షేత్రాన్ని అభివృద్ధి పరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతిదేవిని దర్శించుకున్న అనంతరం రాజన్న వసతి గృహంలో విలేఖరులతో మాట్లాడారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో 120 కోట్ల రూపాయలతో బాసర మాస్టర్ ప్లాన్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు.

08/14/2017 - 03:18

బాసర, ఆగస్టు13: తెలంగాణ భాషా, సాహితీ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కవి సమ్మేళనాలను నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత చెప్పారు. ఆదివారం నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలోని జిఎస్‌డి కల్యాణ మండపంలో నిర్మల్ జిల్లా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు.

08/14/2017 - 03:18

పరకాల, అగస్టు 13: ఎస్‌ఆర్‌ఎస్‌పి పునరుజ్జీవన పథకం ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఉపయోగపడదని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందరెడ్డి అన్నారు. ఆదివారం వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ఎస్‌పి పునరుజ్జీవన పథకం కేవలం కరీంనగర్ జిల్లాకే ఉపయోగపడుతుందని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సోయి లేదని వ్యాఖ్యానించారు.

08/14/2017 - 03:17

నాగర్‌కర్నూల్, అగస్టు 13: రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు రాష్ట్రంలోని కొన్ని పార్టీలు ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు.

08/14/2017 - 03:17

చౌటుప్పల్, ఆగస్టు 13: హైదరాబాద్-విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ట్రాఫిక్ రద్దీ కొనసాగింది. తెల్లవారుజాము నుంచి ఉదయం 10.00 గంటల వరకు పంతంగి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ జామైంది. కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. వరుసగా నాలుగు రోజులు ప్రభుత్వ సెలవులు రావడంతో శుక్రవారం నుంచి హైవేపై రద్దీ పెరిగింది.

08/14/2017 - 02:51

హైదరాబాద్, ఆగస్టు 13:ఎల్లంపల్లి, మిడ్‌మానేరు పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ చివరి కల్లా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. 2018 కొత్త సంవత్సరంలో అడుగుపెట్టే నాటికి ఎల్లంపల్లి నీళ్లు మిడ్ మానేరు ప్రాజెక్టులో పడాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిని మంత్రి హరీశ్‌రావు ఆదివారం నాడు జల సౌధలో సమీక్షించారు.

08/14/2017 - 02:48

హైదరాబాద్, ఆగస్టు 13: రానున్న స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఆదివారం చక్ దే ఇండియా రైడ్ 3వ ఎడిషన్‌ను తెలంగాణ ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. మాదాపూర్ హైటెక్స్ కాంప్లెక్స్‌లోని నేషనల్ అకాడమి ఆఫ్ కనస్ట్రక్షన్స్ వద్ద హైదరాబాద్ బైసెక్లింగ్ క్లబ్ (హెచ్‌బిసి), భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

08/14/2017 - 02:47

హైదరాబాద్, ఆగస్టు 13: పత్తి పంట బంపర్ దిగుబడి వస్తే రైతులు ఊరికే ఉంటారా? మద్దతు ధర లేకపోతే వీధి పోరాటాలకు దిగితే ఏమి చేయాలి? పత్తి కొనుగోలు కేంద్రాలు తగినన్ని లేకపోతే మిర్చి, పసుపు రైతుల మాదిరిగా పత్తి రైతు ఆందోళన దిగితే ఎలా? పత్తి పంటంటే తెలంగాణ రైతుకు ఎందుకింత విపరీతమైన మోజు? ఈ ప్రశ్నలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి. అందుకే ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది.

08/14/2017 - 02:15

హైదరాబాద్/గచ్చిబౌలి, ఆగస్టు 13: భూవివాదంలో తలదూర్చిన నలుగురు పోలీసు అధికారులపై కేసు నమోదు అయింది. కేసు నమోదైన వారిలో రాచకొండ కమిషనరేట్‌లో అడిషనల్ డిసిపిగా పనిచేస్తున్న అధికారి, మరో ముగ్గురు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. పనిచేస్తున్న పోలీసు స్టేషన్‌లోనే పోలీసు అధికారులపై కేసు నమోదు కావడంతో చర్చనీయాంశంగా మారింది. కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Pages