S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/21/2017 - 02:57

న్యూఢిల్లీ,జూలై 20: ఢిల్లీ పోలీసుల ద్వారా తనకు పునర్జన్మ లభించిందని దేశ రాజధానిలో కిడ్నాప్‌కు గురై బయటపడిన తెలుగు వైద్యుడు శ్రీకాంత్‌గౌడ్ అన్నాడు. రెండువారాల క్రితం ఢిల్లీలో కిడ్నాప్‌కు గురైన శ్రీకాంత్‌ను బుధవారం పోలీసులు నిందితుల నుంచి కాపాడి ఢిల్లీలో గురువారం నాడు మీడియా ముందు ప్రవేశపెట్టారు.

07/21/2017 - 02:50

హైదరాబాద్, జూలై 20: దేశంలో మొట్టమొదటి సారి రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని తమ (తెలంగాణ) ప్రభుత్వం నిర్ణయించిందని సేద్యం శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ‘ఇండో-జర్మన్ కోఆపరేషన్ ఆన్ సీడ్ సెక్టార్ డెవలప్‌మెంట్’ లో భాగంగా సచివాలయంలో గురువారం జరిగిన ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీలో మాట్లాడారు.

07/21/2017 - 02:48

హైదరాబాద్, జూలై 20: ఆక్రమణలకు గురవుతున్న వక్ఫ్‌బోర్డు ఆస్తులను పరిరక్షించుకునేందుకు మైనార్టీ శాఖ ప్రక్రియ ప్రారంభించింది. ఎక్కడెక్కడ వక్ఫ్ ఆస్తులు ఉన్నదీ ‘జియోగ్రాఫికల్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్’ (జిఐఎస్) ద్వారా వక్ఫ్‌బోర్డు ఆస్తులన్నీ డిజిటలైజ్ చేయనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టేందుకు మైనార్టీ శాఖ నిర్ణయం తీసుకుంది.

07/21/2017 - 02:47

హైదరాబాద్, జూలై 20: తెలంగాణలో నైరుతీ రుతుపవనాలు సాధారణ స్థితికి చేరాయి. శుక్రవారం రోజు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ నిన్న చేసిన ప్రకటనను ఉపసంహరించుకుంది. భారీ వర్షసూచన ఏదీ లేదని వివరించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగూడెం (వరంగల్), కామారెడ్డి, లింగంపేట (నిజామాబాద్), తాడ్వాయిలలో ఐదేసి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

07/21/2017 - 02:47

హైదరాబాద్, జూలై 20 : రాష్ట్రంలోని ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశానికి 17,128 దరఖాస్తులు వచ్చినట్టు కెఎన్‌ఆర్ హెల్త్ యూనివర్శిటీ విసి డాక్టర్ బి కరుణాకర్‌రెడ్డి గురువారం నాడు చెప్పారు. సర్ట్ఫికేట్ల పరిశీలన, వెబ్ ఆధారిత కౌనె్సలింగ్ షెడ్యూలును విడుదల చేశారు. సర్ట్ఫికేట్ల పరిశీలన ఈ నెల 22 నుండి 27వ తేదీ వరకూ కొనసాగిస్తామని ఇందుకోసం ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.

07/21/2017 - 02:46

హైదరాబాద్, జూలై 20: హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న డ్రగ్ మాఫియాపై ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, రాష్ట్ర మంత్రి కెటి రామారావు మధ్య ట్విట్టర్‌లో మరోసారి మాటల యుద్ధం జరిగింది. డ్రగ్ మాఫియాపై దిగ్విజయ్ సింగ్ గురువారం ఉదయం ఓ ట్వీట్ చేశారు.

07/21/2017 - 02:45

హైదరాబాద్, జూలై 20: ఎమ్సెట్ రెండో దశ కౌనె్సలింగ్‌లో గురువారం రాత్రికి మొత్తం 37490 మంది వెబ్ ఆప్షన్లను నమోదు చేశారు. వెబ్ ఆప్షన్ల నమోదుకు గురువారం రాత్రి వరకూ గడవు విధించారు. సీట్ల కేటాయింపు 22వ తేదీ రాత్రి 8 గంటలకు జరుగుతుంది. ఇంత వరకూ ఇంజనీరింగ్‌లో 24,141 సీట్లు, బి ఫార్మసీలో 2944 సీట్లు, ఫార్మా డిలో 471 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

07/21/2017 - 02:44

హైదరాబాద్, జూలై 20: హైకోర్టు అనుమతి లేకుండా సరోగసి శిశువులను తల్లిదండ్రులకు అప్పగించవద్దని డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. సరోగసికి సంబంధించి రాజదానిలోని వివిధ ఆసుపత్రుల్లో జరుగుతున్న కార్యక్రమాలపై దక్కన్ క్రానికల్ పత్రికలో 2017 జూన్ 19 న వచ్చిన వార్తపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ కుమార్ కైట్ వ్యక్తిగతంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖరాశారు.

07/21/2017 - 02:43

హైదరాబాద్, జూలై 20: వివిధ సాంకేతిక కారణాలు, న్యాయస్థానాల ఆదేశాలతో తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ 15 నోటిఫికేషన్ల పరీక్షలను వాయిదా వేసింది. ఈ మేరకు కార్యదర్శి ఎ వాణి ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. హైకోర్టులో 29495/2017, 23837/2017 తదితర పిటీషన్లలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు వాయిదా వేసినట్టు పేర్కొన్నారు.

07/21/2017 - 02:10

హైదరాబాద్, జూలై 20: తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలుగా ఈ విషయాన్ని కోరుతున్నా మజ్లిస్‌ల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు.

Pages