S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/22/2017 - 01:32

హైదరాబాద్, జూలై 21: తెలంగాణలో ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్‌కు అర్హత పరీక్ష టీచర్సు ఎలిజిబిలిటీ టెస్టు (టెట్)ను ఈ నెల 23వ తేదీన నిర్వహిస్తున్నట్టు సెట్ కన్వీనర్ శేషుకుమారి తెలిపారు. 31 జిల్లాల్లో ఉదయం ఒక పేపర్, సాయంత్రం ఒక పేపర్ నిర్వహిస్తున్నామని, పేపర్ -1 ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12 వరకూ, పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం ఐదు వరకూ జరుగుతుందని చెప్పారు.

07/22/2017 - 01:32

హైదరాబాద్, జూలై 21: కోర్టు ధిక్కారం కేసు కింద తెలంగాణ సదరన్ డిస్కాం సిఎండికి హైకోర్టు నోటీసు జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పదోన్నతులు ఇచ్చారంటూ ఎన్‌ఎస్‌ఆర్ మూర్తి తదితరులు పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులో పిటిషనర్ తరఫున న్యాయవాది డాక్టర్ కె లక్ష్మి నరసింహ, డిస్కాం తరఫున విద్యాసాగర్ వాదనలు వినిపించారు.

07/22/2017 - 01:31

హైదరాబాద్, జూలై 21: ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ కేసులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపై అభియోగాలు రుజువు కావడంతో ఎసిబి కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఒక్కొక్కరికి ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.1000 జరిమాన విధిస్తూ తీర్పు చెప్పింది. తెలంగాణ సిఐడి అదనపు డిజిపి కార్యాలయం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

07/22/2017 - 01:30

హైదరాబాద్, జూలై 21: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ప్రజల ఆరోగ్య సంరక్షణకు పెను సవాలుగా మారుతున్నాయని డాక్టర్క్ వితౌట్ బోర్డర్స్/మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ (ఎంఎస్‌ఎఫ్) సంస్ధ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీజినల్ కాంప్రెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ (ఆర్‌సిఇపి) పేరిట స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలకు వచ్చే వారం హైదరాబాద్ హైటెక్స్ వేదిక కాబోతున్నదని ఎంఎస్‌ఎఫ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

07/22/2017 - 01:29

మహబూబ్‌నగర్, జూలై 21: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీలను భర్తీ చేస్తామని కొత్త జిల్లాలు ఏర్పడడంతో ఆయా జిల్లాల్లో ఖాళీలను భర్తి చేయాల్సి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి, హరితహారం మూడవ విడత కార్యక్రమంలో భాగంగా మంత్రి మహేందర్‌రెడ్డి పర్యటించారు.

07/22/2017 - 01:28

హైదరాబాద్, జూలై 21: గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారత కార్మికుల కోసం కార్మిక శాఖతో కలిసి పనిచేయడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ అంగీకరించినట్టు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శుక్రవారం నాడు ఆయన సుష్మా స్వరాజ్‌ను కలిసి గల్ఫ్‌లో చిక్కుకు పోయిన భారత కార్మికుల వెతలు గురించి చెప్పారు.

07/21/2017 - 23:31

హైదరాబాద్, జూలై 21: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ నరుూం మృతిపై మెజిస్టీరియల్ విచారణ జరుగనున్నది. గత సంవత్సరం ఆగస్టు 8న పోలీసుల ఎదురు కాల్పుల్లో మృతి చెందిన ఖాజా నయిమొద్దీన్ సంఘటనపై ఈ నెల 28న ఉదయం 11 గంటలకు షాద్‌నగర్ రెవెన్యూ డివిజినల్ అధికారి కార్యాలయంలో మెజిస్టీరియల్ విచారణ జరుపనున్నట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి, సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ ఎం.కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

07/21/2017 - 23:31

హైదరాబాద్, జూలై 21: రాష్ట్రంలో అమలు జరుగుతున్న మిషన్ భగీరథ పనుల్లో 75 శాతం పూర్తయినట్లు ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సి) సురేందర్‌రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథ పైప్‌లైన్‌తో పాటే డక్ట్ వేసిన పదివేల కిలోమీటర్ల పరిధిలో ఫైబర్ వేసేందుకు అంతా సిద్ధమైందని అన్నారు. శుక్రవారం నాడిక్కడ డక్ట్ ఇంటిగ్రేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడానికి అనుసరించాల్సిన విధానాన్ని ఎస్‌ఈ, ఈఈలకు ఐటి శాఖ ప్రతినిధులు వివరించారు.

07/21/2017 - 23:30

హైదరాబాద్, జూలై 21: తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి సంబంధించి తుది విడత కౌనె్సలింగ్ ఈ నెల 22వ తేదీ నుండి నిర్వహిస్తున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ కె వెంకటాచలం పేర్కొన్నారు. ఈ నెల 22 నుండి 31వరకూ ఈ కౌనె్సలింగ్ జరుగుతుందని అన్నారు. ఈసేవ/మీ సేవ ద్వారా లేదా కాలేజీల హెల్ప్‌లైన్ సెంటర్ల ద్వారా బయోమెట్రిక్ ధృవీకరణతో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు.

07/21/2017 - 23:30

హైదరాబాద్, జూలై 21: భారతదేశంలోని మొత్తం 2.1 మిలియన్ల మంది ఎయిడ్స్‌రోగులు ఉండగా, సాలీనా కొత్తగా 80 వేల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులవుతున్నారు. ప్రపంచం మొత్తం మీద 95 శాతం ఎయిడ్స్ వ్యాధి ఉన్న పది దేశాల్లో భారత్ ఒకటి. ఈ వివరాలను యుఎన్ ఎయిడ్స్ రిపోర్టులో పేర్కొంది.

Pages