S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/19/2017 - 04:16

సంగారెడ్డి, జూలై 18: సాగునీటి ప్రాజెక్టుల పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటుందని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల గుండా నిర్మిస్తున్న హై టెన్షన్ విద్యుత్ టవర్ల భూ నిర్వాసితులను మంగళవారం ఆయన సంగారెడ్డిలో పరామర్శించారు.

07/19/2017 - 04:15

నిజాంసాగర్, జూలై 18: నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలోనికి రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, మంగళవారం 232 క్యూసెక్క్‌ల వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్ట్ డిఈఈ దత్తాత్రి తెలిపారు. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతమైన సంగారెడ్డి జిల్లా, బాచెపల్లి, రాంరెడ్డిపేట్, నిజాంపేట్, శంకరంపేట్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద నీరు వచ్చి ప్రాజెక్ట్‌లోకి స్వల్పంగా చేరుతున్నాయన్నారు.

07/19/2017 - 04:13

బీబీనగర్, జూలై 18: తనకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు.. మరోసారి భార్య ఆడపిల్లను కంటుం దేమో నని భర్త అనుమానం పెంచుకున్నాడు. నిం డు గర్భిణి అని కూడా చూడకుండా భార్య, కూతు రిపై కిరోసిన్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలంలోని రావిపహడ్ పం చాయతీ పరిధిలోని తండాలో భార్య, కూతురిని దారుణంగా హత్యచేసిన సంఘటన చోటుచేసుకుంది.

07/19/2017 - 04:11

సిద్దిపేట, జూలై 18 : తెలంగాణ సర్కార్ విద్యాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తుందని..అన్ని పాఠశాల, కళాశాల భవనాలకు పక్కా భవనాలు మంజూరు చేసిందని డిప్యూటీ సిఎం, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యావ్యవస్థను నీరుగార్చరని, కొత్తగా పాఠశాలలు, కళాశాలలు మంజూరు చేసినా పక్కా భవనాలు, వౌలిక సదుపాయాలు కల్పించలేదని, అధ్యాపక సిబ్బందిని నియమించలేదన్నారు.

07/19/2017 - 04:05

హైదరాబాద్, జూలై 18: రాజధానిలో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. మూడురోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు, మెయిన్‌రోడ్లు జలమయమయ్యాయి.

07/19/2017 - 04:01

హైదరాబాద్, జూలై 18: తెలంగాణలోని ప్రధాన దేవాలయాలైన భద్రాచలం, యాదగిరిగుట్ట, వేములవాడ, బాసర, కాళేశ్వరం, ధర్మపురి, కీసరగుట్ట, జోగుళాంబ పుణ్యక్షేత్రాల్లో వసతి, సేవలపై వస్తు సేవా పన్ను (జిఎస్‌టి) వేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం తిరుమల-తిరుపతి దేవస్థానాల్లో జిఎస్‌టి అమలవుతున్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. వెయ్యిరూపాయలు ఆపైగా అద్దె ఉన్న గదులపై 12 శాతం జిఎస్‌టి వేస్తున్నారు.

07/19/2017 - 04:00

హైదరాబాద్, జూలై 18: హైదరాబాద్ నగరశివారులో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై యాసిడ్ దాడి ఘటన కలకలం సృష్టించింది. బాధితురాలు, దాడికి పాల్పడిన యువకుడు ఒకే చోట పనిచేస్తుండడం గమనార్హం. పేట్ బషీరాబాద్‌లో చోటుచేసుకున్న సంఘటన వివరాల్లోకి వెళితే.. దత్తాత్రేయనగర్‌లో నివాసముంటోన్న ముర్తుజా చిరువ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

07/19/2017 - 03:59

హైదరాబాద్, జూలై 18: దక్షిణాసియాలో 15 బిలియన్ ప్రజలు వంశానుగతమైన జన్యుసంబంధ వ్యాధులకు గురవుతున్నారని ఇదో అరుదైన అంశమని సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్ రాకేష్ కె మిశ్రా చెప్పారు. సిసిఎంబి నిర్వహించిన పరిశోధనలో అనేక ఆశ్చర్యకరమైన అంశాలు బట్టబయలు అయ్యాయని ఆయన తెలిపారు. ఈ అధ్యయన ఫలితాలు వ్యక్తిగత చికిత్సా విధానంలో సమగ్రమైన మార్పులకు బాట వేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

07/19/2017 - 03:58

హైదరాబాద్, జూలై 18: పాఠశాలల్లో విద్యార్ధులు నీలిచిత్రాల వలలో చిక్కుకుంటున్నారని, ఇటీవల విడుదలైన కొన్ని వీడియో గేమ్స్‌తో విద్యార్ధులు తీవ్రమైన మానసిక సంఘర్షణకు సైతం గురవుతున్నారని విద్యానిపుణులు వాపోతున్నారు.

07/19/2017 - 03:57

హైదరాబాద్, జూలై 18: అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడ డాక్టర్ జిఆర్ రెడ్డి అన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ మానవ వనరుల అభివృద్ధి సంస్ధ (ఎంసిఆర్-హెచ్‌ఆర్‌డి)లో మంగళవారం నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల అధికారులకు పునశ్చరణ, సామర్థ్యపు పెంపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

Pages