S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/19/2017 - 03:57

హైదరాబాద్, జూలై 18: తెలంగాణ ఆబ్కారీ శాఖలో భారీగా బదిలీలు అయ్యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ను అరికట్టడమే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనకు సిద్ధమైంది. ఎక్సైజ్‌లో పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో బదిలీలపై అకున్ సబర్వాల్ ప్రస్తావించారు. ఈ క్రమంలో 23 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 196 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీకి రంగం సిద్ధం చేసింది.

07/19/2017 - 03:56

హైదరాబాద్, జూలై 18: మాజీ సైనికోద్యోగులు, వితంతువులు లేదా ఆధారపడిన వారికి ఏవైనా పెన్షన్ సమస్యలు ఉన్నట్లయితే ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న ‘పెన్షన్ ఆదాలత్’లో పరిష్కరించుకోవాలని తెలంగాణ సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కర్నల్ పి. రమేశ్ కుమార్ తెలిపారు.

07/19/2017 - 03:56

హైదరాబాద్, జూలై 18: పాఠశాల విద్యార్థుల స్కూల్ బ్యాగుల భారంపై ప్రభుత్వం దృష్టిసారించింది. స్కూల్ బ్యాగుల భారంపై ఇప్పటికే డజనుకు పైగా ప్రత్యేక కమిటీలు అనేక సిఫార్సులు చేసినా, విద్యార్ధుల బరువు తగ్గించేందుకు ఇంత వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీనిపై ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టులో సైతం పిటీషన్లు దాఖలు చేశాయి.

07/19/2017 - 03:47

హైదరాబాద్, జూలై 18: అంబులెన్స్ సర్వీసు నిర్వహణ సంస్ధ అయిన జివికె-ఇఎంఆర్‌ఐ సంస్ధలు కార్మిక చట్టాలకు విరుద్ధంగా తమతో 12 గంటలు పని చేయిస్తున్నాయని తెలంగాణ 108 అంబులెన్స్ ఉద్యోగుల సంఘం నాయకులు రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

07/19/2017 - 03:46

హైదరాబాద్, జూలై 18: గ్రేటర్ హైదరాబాద్ పోలీస్ తమ హాక్-ఐ అప్లికేషన్‌ను సింక్రోనీ ఫైనాన్షియల్ ఉపయోగించే రవాణా సేవల అప్లికేషన్‌కు అనుసంధానంపై ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా మరింత సింక్రోనీ ఫైనాన్షియల్ ఉద్యోగుల భద్రత బలోపేతం అవడంతోపాటు హైదరాబాద్‌లో భద్రతకు భరోసా కల్పిస్తుందని నగర పోలీస్ కమిషనర్ ఎం మహేందర్‌రెడ్డి అన్నారు.

07/19/2017 - 03:43

హైదరాబాద్, జూలై 18: హరిత హారంలో మొక్కలు నాటేందుకు పోటీ పడి లక్ష్యాన్ని అధిగమించాలని అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి పిలుపునిచ్చారు. హరితహారంపై ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

07/19/2017 - 03:43

హైదరాబాద్, జూలై 18: ఇంజనీరింగ్ కాలేజీల్లో యుజి కోర్సులో చేరేందుకు తుది విడద కౌనె్సలింగ్ షెడ్యూలు విడుదల చేసినట్టు కన్వీనర్ ఎ వాణి ప్రసాద్ తెలిపారు. సర్ట్ఫికేట్ల పరిశీలన 19న జరుగుతుందని, వెబ్ ఆప్షన్లు 19,20 తేదీల్లో చేయవచ్చని, సీట్ల కేటాయింపు 22న జరుగుతుందని ఆమె వివరించారు.

07/19/2017 - 03:41

హైదరాబాద్, జూలై 18: వరంగల్ జిల్లా తమ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డిపై రాజకీయ వత్తిళ్ళ కారణంగా పెట్టిన కేసులను ఎత్తి వేయాలని రాష్ట్ర డిజిపిని కోరగా సానుకూలంగా స్పందించారని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్వర్యంలో పలువురు నేతలు డిజిపిని కలిసి వినతి పత్రం సమర్పించారు.

07/19/2017 - 03:41

హైదరాబాద్, జూలై 18: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డ్‌గా పనిచేస్తున్న శెట్టి ఉదయకుమార్ సాగర్, స్టాండింగ్ కౌన్సిల్ పి. వెంకటరెడ్డిల కాలపరిమితిని తాత్కాలికంగా పెంచారు.

07/19/2017 - 03:40

హైదరాబాద్, జూలై 18: రాజధానిలో ఆజమాబాద్ పారిశ్రామిక ప్రాంతంలో భూమి బదలాయింపు, అవకతవకలపై సిబిఐ చేత దర్యాప్తు చేయించే విషయమై రాష్ట్రప్రభుత్వం తన అభిప్రాయం తెలియచేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నగరానికి చెందిన టిఆర్‌ఎస్ నేత కుమార్ ఈ విషయమై హైకోర్టుకు రాసిన లేఖను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ టి రజని విచారించారు.

Pages