S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/22/2017 - 03:11

మహబూబ్‌నగర్, జూలై 21: పాలమూ రు ఎత్తిపోతల పథకం ముంపు బాధితులను ముఖ్యమంత్రి కెసిఆర్ మోసగిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. పాలమూరు ఎత్తిపోతల పథ కం పరిధిలో గల నార్లపూర్, ఎదుల, కర్వె న, వట్టెం రిజర్వాయర్ పనులను సిపిఐ రాష్ట్ర బృందం శుక్రవారం పరిశీలించింది.

07/22/2017 - 03:09

పెబ్బేరు, జూలై 21: రాష్ట్రంలో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని, ప్రజలకు అందుబాటులో ఉండి రవాణ సేవలు అందించడమే తమ లక్ష్యమని రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు.

07/22/2017 - 03:06

దేవరకొండ, జూలై 21: నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున దారుణం జరిగింది. ప్రసవం కోసం వచ్చిన రమావత్ కవిత అనే గిరిజన మహిళ ప్రభుత్వాసుపత్రిలోని బాత్‌రూంలో ఒక మగశిశువుకు జన్మనిచ్చింది. దీనిని గమనించిన సిబ్బంది డ్యూటీలో ఉండే వైద్యురాలు శశికళకు సమాచారమందించినా ఆమె సకాలంలో ఆసుపత్రికి రాలేదు.

07/22/2017 - 03:03

వరంగల్, జూలై 21: ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం కయ్యానికి కాలు దువ్వుతున్న నేపథ్యంలో శనివారం నుంచి రెండు రోజులపాటు వరంగల్‌లో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బిజెపి నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

07/22/2017 - 01:50

హైదరాబాద్/గచ్చిబౌలి, జూలై 21: మైలార్‌దేవ్‌పల్లి ముతూట్ ఫైనాన్స్ చోరికి యత్నించిన కేసులో నలుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముతూట్ ఫైనాన్స్ దోపిడి చేయడానికి ఏడుగురు నిందితులు ప్రయత్నించగా వారిలో నలుగుర్ని అరెస్టు చేశామని ముగ్గురు పరారీలో ఉన్నట్లు సైబరాబాద్ జాయింట్ సిపి షానవాజ్ ఖాసిం తెలిపారు.

07/22/2017 - 01:48

హైదరాబాద్, జూలై 21: ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి సంఘాల ఐక్యా కార్యాచరణ కమిటీ శుక్రవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. ఒక దశలో ర్యాలీ నిర్వహించాలని ప్రయత్నించడంతో నగరంలో భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు మధ్య విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. దాంతో ఇరువర్గాల మధ్య తోపులాటలు, ఉద్రిక్తత ఏర్పడింది.

07/22/2017 - 01:45

హైదరాబాద్, జూలై 21: హుజూరాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా పరకాల-హుజురాబాద్ రోడ్‌పై ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే లైన్‌పై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇందుకు అవసరమైన డిజైన్ ఖరారు చేశామని, రానున్న 18 నెలల్లోగా బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి రైల్వే ఇంజనీర్లకు సూచించారు.

07/22/2017 - 01:43

హైదరాబాద్, జూలై 21: వచ్చే నెల ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని అన్ని పట్టణాలను బహిరంగ మలమూత్ర విసర్జన పట్టణాలుగా ప్రకటిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కె తారకరామారావు తెలిపారు. సచివాలయం నుంచి శుక్రవారం మున్సిపల్ కమిషనర్లతో మంత్రి కెటిఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

07/22/2017 - 01:41

హైదరాబాద్, జూలై 21: నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ద్వారా వస్తున్న నిధుల్లో రూ.1532 కోట్లను స్టేట్ హెల్త్ సొసైటీకి కేటాయిస్తూ ప్రభుత్వం అనుమతించింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అధ్యక్షతన స్టేట్ హెల్త్ సొసైటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. 50 పడకలతో ఉన్న మాతా శిశు వైద్య శాలలు మరో 10 ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

07/22/2017 - 01:34

హైదరాబాద్, జూలై 21: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని వదలడంలో వివక్ష చూపిస్తోందని గద్వాల శాసనసభ్యురాలు డికె అరుణ మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు కింద ఉన్న రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా హాల్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే రైతులు ధర్నా చేసి వ్యవసాయ అవసరాలకు నీటిని విడుదల చేయాలని కోరారని అన్నారు.

Pages