S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/14/2017 - 02:35

హైదరాబాద్, ఏప్రిల్ 13: తెరాస పార్టీ ఎన్నికల హామీ పత్రంలో ఒకటి చెప్పి, చేస్తున్నది మరొకటి అని టిటిడిపి ఆరోపించింది. చట్ట వ్యతికరేక పనులు చేస్తూ, పౌర హక్కులను హరించే విధంగా పాలన సాగిస్తోందని విమర్శించింది.

04/14/2017 - 02:34

హైదరాబాద్, ఏప్రిల్ 13: జాతీయ ఆహార భద్రత చట్టం అమలు తీరు తెన్నులను నిత్యం పర్యవేక్షించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఫుడ్ కమిషన్‌ను నియమించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిషన్‌కు చైర్‌పర్సన్, ఒక సభ్య కార్యదర్శి, మరో ఐదుగురు సభ్యులు ఉంటారు.

04/14/2017 - 02:34

హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలంగాణ రాష్ట్ర అధికార భాషా కమిషన్ చైర్మన్‌గా పనిచేస్తున్న దేవులపల్లి ప్రభాకర్‌రావు పదవీ కాలాన్ని పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. సింగ్ పేరుతో గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. 2016 ఏప్రిల్ 26 న వెలువడ్డ ఉత్తర్వులో దేవులపల్లి ప్రభాకర్‌రావు పదవీకాలం ఏడాది మాత్రమే అంటూ పేర్కొన్నారు. దేవులపల్లికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు.

04/13/2017 - 23:55

హైదరాబాద్, ఏప్రిల్ 13: ఢిల్లీలో హైదరాబాద్ పోలీసుల కస్టడీ నుంచి ఓ నేరస్థుడు పరారయ్యాడు. మహమ్మద్ అలీ అనే నేరస్థుడిని హైదరాబాద్ పోలీసులు ఇటలీ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. అనంతరం అతణ్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చే క్రమంలో హజ్రత్ నిజాముద్దీన్ రైల్వేస్టేషన్‌లో తప్పించుకున్నాడు. పాస్‌పోర్టు ఫోర్జరీ కేసులో హైదరాబాద్ పోలీసులు మహమ్మద్ అలీపై కేసు నమోదు చేశారు. అలీ కోసం లుకౌట్ నోటీసు జారీ చేశారు.

04/13/2017 - 23:53

హైదరాబాద్, ఏప్రిల్ 13: మైనారిటీ రిజర్వేషన్ల అమల్లో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బిసిల ప్రయోజనాలను దెబ్బతీసేవిధంగా ఉందని టిడిఎల్‌పి నేత రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఒకరికి న్యాయం చేయడానికి నలుగురికి అన్యాయం చేస్తారా? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వం బిసిల హక్కులకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

04/13/2017 - 23:53

హైదరాబాద్, ఏప్రిల్ 13: రెండు అంతర్జాతీయ సదస్సులకు ఐటి శాఖ మంత్రి కె తారక రామారావును ఆహ్వానించారు. కాలిఫోర్నియాలో జరిగే ప్రపంచ పర్యావరణ, నీటి వానరుల కాంగ్రెస్ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసేందుకు పిలిచారు. వివిధ ప్రపంచ దేశాల నుంచి సుమారు 1000 మంది నీటి, పర్యావరణ నిపుణులు ఈ సదస్సుకు హాజరవుతారు.

04/13/2017 - 23:52

హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ పరిసరాల్లో నాలుగు భారీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసింది. నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి రూ. 2400 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఒక్కో ఆసుపత్రికి ఆరు వందల కోట్లు ఖర్చవుతుంది. ఇందులో భవనాలు, వైద్య పరికరాలు, మానవ వనరుల వ్యయం కలిసి ఉన్నాయి.

04/13/2017 - 07:48

14 నుంచి 20 వరకూ నిర్వహణ 2 రోజులపాటు నేనూ కూలికి వెళ్తా
పార్టీ నేతలూ వెళ్లితీరాల్సిందే.. 21న ప్లీనరీలో అధ్యక్షుని ఎన్నిక
మంత్రి నాయిని అధ్యక్షతన కమిటీ తెరాస అధినేత కెసిఆర్ వెల్లడి

04/13/2017 - 07:44

హైదరాబాద్, ఏప్రిల్ 12: తెలంగాణ చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని తమిళనాడు ఆదర్శంగా తీసుకుందని, ఈ తరహా ప్రాజెక్టు రాష్ట్రంలో చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తమిళనాడు తాగునీటి విభాగం చీఫ్ ఇంజనీర్ వైరవనాథన్ తెలిపారు. హైదరాబాద్ ‘జలసౌధ’లో మిషన్ భగీరథపై తెలంగాణ -తమిళనాడు అధికారుల మధ్య బుధవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

04/13/2017 - 07:43

హైదరాబాద్, ఏప్రిల్ 12: రాష్ట్ర మంత్రివర్గ పునరీజ్య్యూవస్థీకరణ ఉండదని పరోక్షంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. జనహితలో బుధవారం మీడియాతో ముఖ్యమంత్రి ఇష్టాగోష్టి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాదిరిగా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? అని అడిగిన ప్రశ్నకు కెసిఆర్ స్పందిస్తూ ‘ఎందుకు, అక్కడ చంద్రబాబు ఆ పని చేసి తలనొప్పి తెచ్చుకున్నాడు’ అని వ్యాఖ్యానించారు.

Pages