S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/10/2017 - 01:17

హైదరాబాద్, ఏప్రిల్ 9: టిఆర్‌ఎస్ పార్టీలో సందడి నెలకొంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లాల్లో జోరుగా సాగుతోంది. లక్ష్యాన్ని మించి ఇప్పటికే 57లక్షల మంది సభ్యత్వ నమోదు చేసుకున్నారు. ఇంకా జిల్లాల్లో సభ్యత్వ నమోదు జరుగుతోంది. మరోవైపు ఈనెల 21న హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్ ప్లీనరీ 27న వరంగల్‌లో జరిగే బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు.

04/10/2017 - 01:17

హైదరాబాద్, ఏప్రిల్ 9: సీనియర్ సిటిజన్లకు శుభవార్త. ప్రస్తుతం తల్లిదండ్రులు, సీనియర్ సిజిజన్స్ సంక్షేమం, నిర్వహణ చట్టం కింద కుమారులు తమ తల్లిదండ్రులకు నెలకు పదివేల రూపాయలకంటే మించి చెల్లించకుండా పరిమితి ఉంది. ఈ సీలింగ్‌ను ఎత్తివేస్తూ కేంద్రం ఈ చట్టానికి సవరణలు తేనుంది.

04/10/2017 - 01:16

పెబ్బేరు, ఏప్రిల్ 9: వనపర్తి జిల్లాలో వడ గాల్పులు ముగ్గురి ప్రాణాలను తీశాయ. శ్రీరంగాపురం మండల పరిధిలోని కంబళ్లాపురం గ్రామంలో వడదెబ్బకు గురై ముగ్గురు మృతి చెందిన సంఘటన జరిగింది. సందుబీసన్న(60), ఉప్పరి రాము లు (63), బాలమ్మ(65) మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
గత వారం రోజులుగా ఎండలు ఎక్కువ కావడంతో ఎండవేడిమికి తాళలేక శరీరం నీరసించి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

04/10/2017 - 01:15

హైదరాబాద్, ఏప్రిల్ 9: తెలంగాణలో 13 ఆలయాలకు పాలక వర్గాలను నియమిమించారు. సిరిసిల్లలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి ఐదుగురిని, శివ సాయిబాబా ఆలయానికి ఐదుగురుని, పోచమ్మ దేవాలయానికి ఇద్దరుని పాలక మండలి సభ్యులుగా నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

04/10/2017 - 00:34

హైదరాబాద్, ఏప్రిల్ 9: కొత్త రాష్ట్రం, కొత్త అసెంబ్లీ...పాత అక్రమాలను తోడి వెలికి తీసి చర్యలు తీసుకోవాల్సిన సమయం. అందుకే ప్రతిపక్షాల డిమాండ్లతో, ఆందోళనలతో మూడు వేర్వేరు అంశాలపై పరిశీలనకు సభా సంఘాలు ఏర్పాటైనా, వీసమెతె్తైనా ముందుకు సాగడం లేదు.

04/09/2017 - 04:16

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 8: నల్లమల అటవీ ప్రాంతంలో మళ్లీ అలజడి మొదలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వడంతో అనుమతులను నిరసిస్తూ నల్లమల అటవీ ప్రాంత ప్రజలు ఆందోళన బాట పట్టారు. శనివారం నల్లమల అటవీ ప్రాంతంలోని నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అమ్రాబాద్, పదరా మండలాల బంద్‌కు జెఎసి పిలుపునివ్వడంతో బంద్ సంపూర్ణంగా కొనసాగింది.

04/09/2017 - 04:11

హైదరాబాద్, ఏప్రిల్ 8: రైతాంగ సమస్యల పరిష్కారానికి కేంద్రం అనేక పథకాలను అమలుచేయడమేగాక, పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.పంటకు మద్దతు ధరను పెంచిందని, నష్టపోయిన పంటకు బీమా దక్కేలా చర్యలు చేపట్టిందని, కేంద్ర పథకాలతో రైతాంగం దిశ, దశ మారిందని ఆయన చెప్పారు.

04/09/2017 - 04:08

హైదరాబాద్, ఏప్రిల్ 8: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న అన్ని పెండింగ్ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ఆదేశించారు. ట్రాఫిక్, లెవెల్ క్రాసింగ్, ప్రయాణీకులకు సౌకర్యాల కల్పన పనులన్నీ నిర్ణయించిన సమయంలోగా పూర్తి చేయాలని అన్నారు.

04/09/2017 - 04:07

భువనగిరి, ఏప్రిల్ 8: ఆధునిక భారత దేశ నిర్మాణ లక్ష్యంతోనె మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని, రాష్ట్రాలలో చేపట్టే అభివృద్ధి పథకాలన్నిటికీ కేంద్రం సహకరిస్తుందని, మతవిద్వేషాలను రెచ్చగొట్ట్టే బిల్లులను వ్యతిరేకిస్తుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు.

04/09/2017 - 04:04

హైదరాబాద్/ హయత్‌నగర్, ఏప్రిల్ 8: కబేళాలకు తరలిస్తున్న గోవులను రక్షించి సంరక్షిస్తున్న ఒక గోశాలను అనుమతి లేదనే కారణంతో రెవెన్యూ అధికారులు కూల్చివేసిన ఉదంతం హయత్‌నగర్ మండలం తుర్కయంజాల్ రెవెన్యూ పరిధిలో చోటు చేసుకొంది. సర్వేనెంబర్ 135, 136ల్లో 12 ఎకరాల పట్టా భూమిలో స్వచ్ఛంద సంస్థ మూడు ఎకరాలలో గోశాలకు షెడ్డు నిర్మించింది.

Pages