S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/11/2017 - 01:18

హైదరాబాద్, ఏప్రిల్ 10: రానున్న 2019 ఎన్నికల్లో నియోజకవర్గాల సంఖ్య పెరిగితే రాష్ట్రంలో 100 సీట్లను యువతరానికి కేటాయిస్తామని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాబోయే ఎన్నికల నాటికి నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఒక వైపు, కెసిఆర్ కుటుంబం మరో వైపు ఉంటారని అన్నారు. ఆ ఎన్నికల్లో సత్తా చాటడానికి యువతరం సన్నంద్దం కావాలని పిలుపునిచ్చారు.

04/10/2017 - 02:52

హైదరాబాద్, ఏప్రిల్ 9: ప్రజా సమస్యలపై టిజెఎసి చేస్తున్న పోరాటాలకు సామాజికవేత్త మేధా పాట్కర్ మద్దతు ప్రకటించారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆమె ఆదివారం టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. నిరుద్యోగులతో టిజెఎసి నిర్వహించాలనుకున్న ర్యాలీని ప్రభు త్వం అడ్డుకోవడాన్ని ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని ఆమె విమర్శించారు.

04/10/2017 - 02:49

హైదరాబాద్, ఏప్రిల్ 9: ఎన్నికలు లేవు, ప్రత్యేక సందర్భం లేదు, ప్రారంభోత్సవాలు, శంకు స్థాపనలు లేవు అయినా ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. సోదరి ఎంపి కవిత సైతం కెటిఆర్‌కు మద్దతుగా సభలో పాల్గొన్నారు. కెసిఆర్ రాజకీయ వారసుడు కెటిఆర్ అని అధికార ప్రకటన వెలువడ లేదు కానీ అంతా సిద్ధం అవుతోంది.

04/10/2017 - 02:47

హైదరాబాద్, ఏప్రిల్ 9: తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా కోలేటి దామోదర్ గుప్తా ఆదివారం బాధ్యతలు స్వీకరించా రు. హోంమంత్రి నాయి ని నర్సింహారెడ్డి, ఎంపి కవిత, మేయర్ బొంతు రామ్మోహన్, పార్టీ శ్రేణు లు హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తనపై నమ్మకంతో పోలీ స్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించినందుకు కోలేటి దామోదర్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు.

04/10/2017 - 02:04

హైదరాబాద్, ఏప్రిల్ 9: నాగార్జున సాగర్ డ్యామ్ ఆధునీకరణ ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఆటోమేషన్ టెక్నాలజీతో గేట్ల నిర్వహణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆటోమేషన్ టెక్నాలజీతో 26 క్రెస్ట్ గేట్లు, 18 ఇతర గేట్లను అవసరం మేరకు నిర్వహించేందుకు ఆధునీకరణ జరుగుతోంది. దేశంలోనే తొలిసారి నాగార్జున సాగర్‌కు ఆటోమేషన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు.

04/10/2017 - 02:03

హైదరాబాద్, ఏప్రిల్ 9: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు ఎన్‌ఎస్‌యుఐ కృషి చేయాలని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించిన ఎన్‌ఎస్‌యుఐ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆయన ఎన్‌ఎస్‌యుఐ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్‌ఎస్‌యుఐలో పుట్టిన కెసిఆర్ ఇప్పుడు కాంగ్రెస్‌నే విమర్శిస్తున్నారని అన్నారు.

04/10/2017 - 02:08

హైదరాబాద్, ఏప్రిల్ 9: అయోధ్యలో రామాలయ నిర్మాణ అంశంపై గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామమందిర నిర్మాణం కోసం చావడానికైనా..ఇతరులను చంపేందుకైనా సిద్ధమేనని ప్రకటించారు. రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించే వారి తల నరుకుతామంటూ ఆయన ఇటీవల కూడా ఓ సభలో హెచ్చరించారు.

04/10/2017 - 02:00

హైదరాబాద్, ఏప్రిల్ 9: తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్రంలో ఏడు జిల్లాలకు కమిటీలను నియమించింది. ఎన్టీఆర్ భవన్‌లో రాష్ట్ర అధ్యక్షుడు బి.ఎన్.రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ కమిటీలను ప్రకటించారు. రానున్న ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నిరంతరం కార్మికుల సంక్షేమానికి కృషి చేసిన సీనియర్ నాయకులకు ఎన్టీఆర్ శ్రమ శక్తి అవార్డులు ఇచ్చి సన్మానించాల్సిందిగా నిర్ణయించామని తెలిపారు.

04/10/2017 - 02:00

హైదరాబాద్, ఏప్రిల్ 9: నకిలీ పత్రాలతో రుణం పొందిన ఓ ప్రైవేటు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సహా ఐదుగురు డైరెక్టర్లపై సిబిఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ ఎల్‌బినగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖలో రూ. 53.81 కోట్లు రుణం తీసుకొని తిరిగి చెల్లించకపోవడమే కాకుండా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బ్యాంక్‌ను మోసగించిన నేరంపై బ్యాంకు అధికారులు సిబిఐకి ఫిర్యాదు చేశారు.

04/10/2017 - 01:18

హైదరాబాద్, ఏప్రిల్ 9: తెలంగాణ, ఆంధ్రలో అసెంబ్లీ సీట్ల పెంపుదలపై కదలిక వచ్చినట్లు తెలిసింది. ఈ దిశగా అవసరమైన రాజ్యాంగ సవరణకు కేంద్రం సిద్ధమవుతోంది. ఏపి పునర్విభజన చట్టం 2014కు రాజ్యాంగపరమైన సవరణలు తెచ్చేందుకు న్యాయ శాఖకు నోడల్ ఏజన్సీగా ఉన్న కేంద్ర హోంశాఖ అవసరమైన ముసాయిదాను తయారుచేయాలని సూచించినట్లు సమాచారం.

Pages