S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/31/2019 - 05:13

సూర్యాపేట, అక్టోబర్ 30: ఎన్నో ఆశలతో పత్తి సాగుచేసిన రైతుల ఆశలు ఆవిరయ్యాయి. సిరులు కురిపిస్తుందనుకొని ఆరుగాలం శ్రమించి అప్పులు చేసి సాగుచేసిన తెల్లబంగారం చేతికందే దశలో వరుస వర్షాలతో నేలపై పడిపోతోంది. భూమి తడరాకుండా కురుస్తున్న వర్షాల ధాటికి పత్తిపంట తడిసి నల్లబడి పోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

10/31/2019 - 05:11

ఆదిలాబాద్,అక్టోబర్ 30: గిరిజన సమస్యలపై చర్చించేందుకు బుధవారం ఉట్నూరు కెబి కాంప్లెక్స్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం పరస్పర రాజకీయ ఆరోపణలతో ఉద్రిక్తతలకు దారితీసింది.

10/31/2019 - 05:08

చౌటుప్పల్, అక్టోబర్ 30: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు దేశానికే ఆదర్శం కానుందని శాసనమండలి విప్ కర్నె ప్రభాకర్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి రాజమల్లు అన్నారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారులో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ప్రారంభోత్సవ ఏర్పాట్లను బుధవారం వారు పరిశీలించారు.

10/31/2019 - 05:04

సూర్యాపేటరూరల్, అక్టోబర్ 30: మిషన్ భగీరథ పథకం కింద తాను నిర్మించిన ట్యాంకులకు సంబంధించిన బిల్లులు చెల్లించకుండా తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఒక కాంట్రాక్టర్ కుటుంబ సభ్యులతో కలిసి కిరోసిన్ డబ్బాలతో ట్యాంకు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన మండల పరిధిలోని కుసుమవారిగూడెంలో బుధవారం జరిగింది.

10/31/2019 - 05:02

వరంగల్, అక్టోబర్ 30: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు వ్యవస్థకు పదును పెట్టారని, దీంతో పోలీసులకు ప్రజల్లో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరిగాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్‌స్టేషన్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు.

10/31/2019 - 05:00

యాదగిరిగుట్ట, అక్టోబర్ 30: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించే భక్తులకు నిత్య అన్న ప్రసాదం అందించేందుకు ఉద్దేశించిన నూతన భవన నిర్మాణ పనులను కొండ కింద గండి చెరువు సమీపంలోని స్థలంలో భూమి పూజతో ప్రారంభించారు.

10/31/2019 - 06:02

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రానికే మణిహారంగా కరీంనగర్ మానేరు వాగుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణమతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం తీగల వంతెన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ 220 మీటర్ల ఎత్తులో రెండు పైలాన్ పిల్లర్లతో నాలుగు వరుసల రహదారుల నిర్మాణాలు శరవేగంతో అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయన్నారు.

10/31/2019 - 04:44

హైదరాబాద్, అక్టోబర్ 30: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, నిపుణుల ఆంగ్లభాషా ప్రావీణ్యాన్ని వైయుక్తికంగా నిర్ధారించే బృందంలో తోడ్పాటు అందించేందుకు ఇఫ్లూ ముందుకు వచ్చింది. దీంతో ఇఫ్లూ సిబ్బంది సేవలను ఆంగ్ల భాషా ప్రావీణ్య నిర్ధారణ నిపుణులుగా వినియోగించుకునేందుకు టీసీఎస్ ఐయాన్ ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వీరిని డిజిటల్ మార్కింగ్ నిపుణులుగా వ్యవహరించనున్నారు.

10/31/2019 - 04:38

హైదరాబాద్, అక్టోబర్ 30: దేశంలో 24.84లక్షల మంది పోలీసు బలగాలు ఉండాలి. కాని 19.41 లక్షల మంది పోలీసులు ఉన్నారు. ఇందులో 12.36 లక్షల మంది సివిల్ పోలీసువలు, 2.34 లక్షల మంది జిల్లా ఆర్మ్‌డ్ పోలీసులు, 4.71 లక్షల మంది రాష్ట్ర ఆర్మ్‌డ్ పోలీసులు ఉన్నారు. దేశం మొత్తంపైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం 2.85 లక్షల మంది పోలీసులతో అగ్రస్థానంలో ఉంది. రెండవ స్థానంలో 2.14లక్షల మంది పోలీసు బలగాలతో మహారాష్ట్ర ఉంది.

10/31/2019 - 04:37

హైదరాబాద్, అక్టోబర్ 30: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సమస్యపై చట్టాన్ని ఉల్లంఘించకుండా ఉండాలని రాష్ట్రప్రభుత్వ అదికారులకు టీపీసీసీ కోశాధికారి గూడూరి నారాయణ రెడ్డి కోరారు. ఆర్టీసీ సమస్యపై హైకోర్టును తప్పుదోవ బట్టించాలని సీఎం కేసీఆర్ సీనియర్ బ్యూరోక్రాట్లను, ఇతర అధికారులను బలవంతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Pages