S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/31/2019 - 04:35

హైదరాబాద్, అక్టోబర్ 30: విదేశీ వర్శిటీల్లో ప్రవేశాలకు తెలంగాణ విద్యార్థులకు ప్రత్యేక డ్రైవ్‌ను నవంబర్ 2వ తేదీన నిర్వహిస్తున్నట్టు ఇండియా మ్యాటర్స్ ఫౌండేషన్ అధిపతి విజయకుమార్ నాయర్ తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని లెమన్‌ట్రీ హోటల్‌లో ఈ స్పెషల్ డ్రైవ్ ఉంటుందని ఆయన చెప్పారు. ఆసక్తి ఉన్న వారు అడ్మిషన్ ఆఫీసర్‌ను కలుసుకోవాలని సూచించారు.

10/31/2019 - 02:10

హైదరాబాద్, అక్టోబర్ 30: ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఖరీఫ్‌లో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేయనునున్న నేపథ్యంలో ధాన్యం సేకరణకు విస్తృత ఏర్పాట్లు చేసింది. గడిచిన ఐదు సంవత్సరాలలో ధాన్యం కొనుగోళ్లు 318 శాతం పెరిగినట్టు అవుతుంది.

10/31/2019 - 02:09

హైదరాబాద్, అక్టోబర్ 30: మందులు, వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజల్లో అవగాహన లేక ఏటా రాష్ట్రంలో 12వేల మంది టీబీ వ్యాధితో చనిపోతున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. 2025 నాటికి భారత్ నుంచి టీబీని తరిమికొట్టాలని మంత్రి అన్నారు.

10/31/2019 - 02:08

హైదరాబాద్, అక్టోబర్ 30: ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలుపుతూ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తన దీక్ష విరమించాలని కోరుతూ బుధవారం ఆర్టీసీ జేఏసి నిర్వహించిన ‘సకల జన భేరీ’ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. సభ చివరలో జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోందించింది.

10/31/2019 - 02:07

హైదరాబాద్, అక్టోబర్ 30: ప్రతి జిల్లాలో కేన్సర్ వ్యాధి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జగ్గారెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. కేన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోందని, ప్రభుత్వాసుపత్రుల్లో రోగ నివారణకు సరైన వైద్య సదుపాయాలు లేవన్నారు. ఆర్థిక ఇబ్బందులతో కేన్సర్ బాధితులు సరైన వైద్య చికిత్స చేయించుకోలేకపోతున్నారు.

10/31/2019 - 02:07

హైదరాబాద్, అక్టోబర్ 30: నీరా, తాడిని శాస్ర్తియ పద్ధతుల్లో విశే్లషించి ప్రజలకు తెలియచేసేందుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభ రెడ్డి గవర్నర్‌కు లేఖ రాశారు. నీరాను విక్రయించేందుకు తెలంగాణ ప్రభుత్వం నీరా పాలసీని తెచ్చిందని, అందుకు అనుగుణంగా అబ్కారీ చట్టానికి సవరణలు చేశారన్నారు. కల్లు, గీత సహకార సొసైటీలకు లైసెన్సులు ఇవ్వనున్నారన్నారు.

10/31/2019 - 02:06

హైదరాబాద్, అక్టోబర్ 30: భవిష్య నిధి పెన్షన్‌దారులు వచ్చే నవంబర్ నెలలో డిజిటల్ జీవన్ ప్రమాణ్‌ను భవిష్య నిధి కార్యాలయానికి సమర్పించాలని హైదరాబాద్ భవిష్యనిధి అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ కోరారు. అంతరాయం లేకుండా ప్రతి నెల పెన్షన్ మంజూరుకు సహకరించాలని ఆయన కోరారు. పెన్షన్ పొందే బ్యాంకు బ్రాంచ్‌లకు వెళ్లి డిజిటల్ జీవన్ ప్రమాణ్‌ను సమర్పించాలని ఆయన భవిష్య నిధి పెన్షన్‌దారులను కోరారు.

10/31/2019 - 02:05

హైదరాబాద్, అక్టోబర్ 30: తెలంగాణ పారిశ్రామిక రంగానికి మహర్దశ పట్టింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కలసాకారం కానుంది. యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్ వద్ద తెలంగాణ పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ తొలిసారిగా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేశారు. ఈ పార్కును నవంబర్ 1వ తేదీన రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నారు. ఈ పారిశ్రామిక వాడలో మొదటి దశలో 450 యూనిట్లు రానున్నాయి.

10/31/2019 - 02:04

హైదరాబాద్, అక్టోబర్ 30: తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్‌గా నియమితులైనందుకు ప్రముఖ న్యాయవాది టీ శ్రీరంగారావును విద్యుత్ ఇంజనీర్లు అభినందించారు. బుధవారం ఇక్కడ తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల సంఘం సభ్యులు, ఉద్యోగులు టీ శ్రీరంగారావును కలిసి ప్రశంసించారు. శ్రీరంగారావు న్యాయవాదిగా అందించిన సేవలను వారు ప్రస్తావించారు.

10/31/2019 - 01:26

హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్ శాసన సభ్యుడు శానంపూడి సైదిరెడ్డితో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ టీ. పద్మారావుగౌడ్, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, జీ.

Pages