S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/20/2016 - 02:38

హైదరాబాద్, డిసెంబర్ 19: కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై టిటిడిపి , రైతు రుణమాఫీపై బిజెపి వాయిదా తీర్మానాలను ప్రతిపాదించాయి. సోమవారం ప్రశ్నోత్తర కార్యక్రమం ముగిసిన తర్వాత స్వల్పకాలిక చర్చ కింద నయిమ్ అంశాన్ని చర్చించారు. స్పీకర్ మధుసూధనాచారి వాయిదా తీర్మానాలను తిరస్కరించినట్టు ప్రకటించారు.

12/20/2016 - 02:37

హైదరాబాద్, డిసెంబర్ 19: ఇటీవల కన్నుమూసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సహా ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలకు సోమవారం నాడు శాసనసభ నివాళులు అర్పించింది. ప్రశ్నోత్తర కార్యక్రమం పూర్తికాగానే శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, తమిళనాడు సిఎంలకు సంతాపం ప్రకటించేందుకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

12/20/2016 - 02:36

హైదరాబాద్, డిసెంబర్ 19: తెలంగాణలో ఆరోగ్య రక్షణకు కొత్త విధానాన్ని తీసుకువస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి చెప్పారు. సోమవారం నాడు ఆయన శాసనసభలో మాట్లాడుతూ సమగ్ర వైద్యశాలల సదుపాయాల నిర్వహణకు సేవలు పెంచుతామని, మెరుగైన భద్రత కల్పిస్తామని, పేషెంట్ కేర్ పారిశుద్ధ్యం పట్టించుకుంటామని చెప్పారు.

12/19/2016 - 05:20

హైదరాబాద్, డిసెంబర్ 18: పౌరసరఫరాల శాఖలో పొదుపు ఉద్యమం చేపట్టడం, గోనె సంచులకు సంబంధించి పాత లెక్కలు తీయడం, రవాణాలో వినూత్న విధానాలు అమలు చేయడం వల్ల ఈ శాఖకు ఏటా కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది. రైస్ మిల్లర్ల వద్ద ఉండిపోయిన గోనె సంచులను రికవరీ చేయాలని ఈ శాఖ కమిషనర్ సివి ఆనంద్ నిర్ణయించారు. అలాగే గోనె సంచుల రవాణాలో కొత్త విధానానికి తెర తీశారు.

12/19/2016 - 05:16

హైదరాబాద్, డిసెంబర్ 18: తెలంగాణ రాష్ట్రంలో బిసి సామాజిక వర్గాల అభ్యున్నతికి తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు కల్పించటానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం నిజాం కళాశాల మైదానంలో జరిగిన ముదిరాజ్‌ల సింహగర్జన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.

12/19/2016 - 05:10

హైదరాబాద్, డిసెంబర్ 18: చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఎమ్మెల్యే, జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తెలంగాణలో బిసిల జనాభా 60 శాతం ఉంటే 119 ఎమ్మెల్యేల్లో 19 మంది బిసిలు, ఆంధ్రాలో బిసిల జనాభా 52 శాతం ఉంటే, 175 ఎమ్మెల్యేల్లో 33 మంది బిసిలు ఉన్నారన్నారు.

12/19/2016 - 05:07

అడ్డాకుల, డిసెంబర్ 18: మహబూబ్‌నగర్ జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ దుర్ఘటనలో మహిళ మృతదేహం కారు టాపుపై పడినా ఆగకుండా నిందితులు పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు కొందరు యువకులు వెంటపడ్డారు. అయతే శవాన్ని వదిలేసి నిందితులు తప్పించుకుపోయారు. అడ్డాకుల సమీపంలో టివిఎస్ లూనాపై వెడుతున్న దంపతులను ఓ కారు ఢీకొట్టింది.

12/19/2016 - 05:07

నల్లగొండ, డిసెంబర్ 18: డిండి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను రెండేళ్లలో పూర్తి చేసి కరవు, ఫ్లోరైడ్ పీడిత మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు తాగుసాగునీరు అందిస్తామని భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

12/19/2016 - 05:02

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 18: ప్రజాసమస్యలను భుజాలకెత్తుకుని, వాటిని వెలుగులోకి తెచ్చే బాధ్యత పౌరవేదికలదేనని తెలంగాణ రాజకీయ ఐకాస కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ప్రజాసంఘాల పాత్ర అమోఘమని అన్నారు.

12/19/2016 - 04:40

హైదరాబాద్, డిసెంబర్ 18: ముస్లిం బిసిలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంలో తాము పూర్తి మద్దతుగా ఉన్నామని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్‌పి నాయకుడు కె జానారెడ్డి తెలిపారు. బిసి రిజర్వేషన్లపై రాష్ట్ర బిసి కమిషన్ అభిప్రాయ సేకరణ జరపుతోంది. బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు, కమిషన్ సభ్యులకు పార్టీ తరఫున ఆదివారం లేఖ అందజేశారు.

Pages