S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/16/2016 - 05:57

హైదరాబాద్, డిసెంబర్ 15: శుక్రవారం నుంచి అసెంబ్లీ, శాసన మండలి శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయి. సమావేశాల షెడ్యూల్ ఈనెల 30 వరకు ఖరారైంది. తిరిగి మరోసారి బిఎసి సమావేశాన్ని నిర్వహించి సమావేశాల పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటారు. గురువారం ఉదయం అసెంబ్లీ కమిటీ హాలులో బిఎసి సమావేశం జరిగింది. శుక్రవారం ఉదయం పది గంటలకు శాసన సభా సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం అవుతాయి.

12/16/2016 - 05:54

వరంగల్, డిసెంబర్ 15: రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటిని ముట్టడించారు. ఇంట్లోకి చొచ్చుకుపోయేందుకు విద్యార్థి సంఘాల ప్రతినిధులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

12/16/2016 - 05:51

బాసర, డిసెంబర్ 15: బాసర ట్రిపుల్ ఐటి యూనివర్శిటిలో పియుసి మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తున్న సిద్దిపేటకు చెందిన శ్రీజ బుధవారం మరణించింది. ఈనెల 1వ తేదీన ఆత్మహత్యకు ప్రయత్నించింది. కాగా ఆ విషయం గమనించిన తోటి విద్యార్థులు అప్రమత్తమవడంతో శ్రీజను రక్షించి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. పదిహేను రోజులుగా చికిత్స పొందుతున్న శ్రీజ బుధవారం తుదిశ్వాస విడిచింది.

12/16/2016 - 05:48

నూతనకల్, డిసెంబర్ 15: కోర్టు కేసులో అత్త, భార్య రాజీకి రాలేదన్న కోపంతో ఐదునెలల కన్నబిడ్డను కర్కశంగా కడతేర్చాడు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న రెండో భార్యపై గొడ్డలితో దాడి చేసి గాయపరిచాడు. మద్యం తాగి, కోపంతో చిందులువేసి దారుణానికి ఒడిగట్టిన ఆ వ్యక్తి మత్తుదిగాక..

12/16/2016 - 05:45

సైదాబాద్, డిసెంబర్ 15: నగరంలోని 23పోలీస్‌స్టేషన్‌లను రూ.75 ఆధునీకరించి మోడల్ ఠాణాలుగా తీర్చిదిద్దనున్నామని హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి తెలిపారు. ఆధునీకరించే వాటిలో 16 శాంతిభద్రతలు, ఆరు ట్రాఫిక్, ఒక మహిళా పోలీస్‌స్టేషన్ ఉందని వివరించారు. గురువారం సైదాబాద్ పోలీస్‌స్టేషన్ నూతన భవన నిర్మాణానికి భూమి పూజచేసి శంకుస్థాపన చేశారు.

12/16/2016 - 05:42

నంగునూరు, డిసెంబర్ 15: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దుతో ప్రజలు, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, దీనిపై ప్రధాని మోదీ పార్లమెంట్‌లో మాట్లాడకుండా తప్పించుకు తిరుగుతున్నారని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంత రావు అన్నారు. గురువారం మండలంలోని పాలమాకుల సిండికేట్ బ్యాంకుముందు డబ్బుల కోసం క్యూలో నిలబడ్డ ప్రజలు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.

12/16/2016 - 05:42

జగదేవ్‌పూర్, డిసెంబర్ 15: సిఎం దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటలలో గురువారం సిఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి పర్యిటించి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈనెల 23న గృహప్రవేశాల తెదీని ఖరారు చేసినప్పటికీ వౌలిక సదుపాయాల కల్పనలో అధికారుల పనితీరుపై వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు.

12/16/2016 - 05:41

హైదరాబాద్, డిసెంబర్ 15: తెలంగాణలో జీవవైవిధ్య సంరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. అమెరికాలోని మెక్సికోలో గురువారం జరిగిన బయోడైవర్సిటీ అంతర్జాతీయ సదస్సు (కాప్-13) ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తూ జీవవైవిధ్య సంరక్షణలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో నిరంతరం సమగ్ర విశే్లషణలు చేస్తున్నామన్నారు.

12/16/2016 - 05:39

ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 15: సిరిసిల్ల రాజన్న జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమళ్లలో గురువారం కల్తీ కల్లు తాగి 20 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కల్లు తాగిన వెంటనే వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా బాధితులను ఆటోలలో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

12/16/2016 - 02:23

హైదరాబాద్, డిసెంబర్ 15: కరీంనగర్ జిల్లా (జయశంకర్, భూపాలపల్లి జిల్లా) మహాముత్తారం మాజీ తహశీల్దార్ కుమ్మరి బాలకిషన్‌కు ఏసిబి ప్రత్యేక కోర్టు లంచం తీసుకున్న కేసులో ఏడాది జైలు శిక్షతోపాటు రూ. 2,500లు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. తహశీల్దార్ బాలకిషన్ 2009, జనవరి 19న మహాముత్తారానికి చెందిన బోడ భాస్కర్ వద్ద నుంచి గ్రామ సేవకుడిగా నియామకానికి గానూ రూ. 10వేలు లంచం డిమాండ్ చేశారు.

Pages