S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/19/2016 - 04:39

హైదరాబాద్, డిసెంబర్ 18: రోజురోజుకూ మైనర్ల రాష్ డ్రైవింగ్ పెచ్చుమీరుతోంది. హైదరాబాద్ నగరంలో గత మూడేళ్లలో ఐదువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే 49రెట్లు ఎక్కువగా ప్రమాదాలు జరిగాయి. డ్రంకెన్ డ్రైవ్‌లో దాదాపు 1500 మంది మైనర్లు పట్టుబడ్డారు. అయితే నిందితులకు కనీస శిక్షలు కూడా పడకపోవడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 2013లో 55 కేసులు నమోదు కాగా, 2016 నవంబర్ నాటికి 2,676 కేసులు నమోదయ్యాయి.

12/18/2016 - 06:57

చౌటుప్పల్, డిసెంబర్ 17: ప్రవాస భారతీయుడు దీపక్‌కాంత్ వ్యాస్‌కు చెందిన సుమారు రూ.10 కోట్ల విలువ చేసే 24.01 ఎకరాల భూమిని తప్పుడు రికార్డులతో రిజిస్ట్రేషన్ చేసిన సంఘటనతో సంబంధం ఉన్న నల్లగొండ జిల్లా చౌటుప్పల్ సబ్‌రిజిస్ట్రార్ తిరుమల్‌రావుపై శనివారం కేసు నమోదైంది.

12/18/2016 - 06:57

గంగాధర్, డిసెంబర్ 17: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి వద్ద ఎల్లంపల్లి పైపులైన్ పగిలింది. దీంతో నీరంతా వృధాగా పోతోంది. వందమీటర్ల ఎత్తుతో ఎగిసిపడుతోంది. మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్‌లోకి వస్తున్న ఎల్లంపల్లి పైపులైను ఎయిర్ వాల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ద్వంసం చేయడంతో పెద్దఎత్తున నీరు ఎగిసి పడుతోంది.

12/18/2016 - 06:56

లింగాల, డిసెంబర్ 17: ఆటవిడుపుగా ఆడుకోవడానికి చెరువు వద్దకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ఈతరాక నీటమునిగి ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అప్పాయపల్లి గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. అప్పాయపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ (11), బాల్‌చంద్రు (12), రమేష్ (15)కు కలిగిన ఈత సరదా కాస్తా వారి ప్రాణం తీసింది.

12/18/2016 - 06:54

హైదరాబాద్, డిసెంబర్ 17: తెలంగాణ ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య బీమా పథకం అమలుకోసం 13 కార్పొరేట్ ఆస్పత్రులకు ప్రభుత్వానికి మధ్య శనివారం ఒప్పందం కుదిరింది.

12/18/2016 - 06:53

హైదరాబాద్, డిసెంబర్ 17: ఖమ్మంలో విషజ్వరాలు సోకిన రోగులను కాపాడటంలో వైద్యులు విఫలమయ్యారని, ఈ సంఘటనపై విచారణకు సభాసంఘాన్ని నియమించాలని శాసనమండలిలో కాంగ్రెస్ నేతలు సుధాకరరెడ్డి, షబ్బీర్ అలీ, ఎం.రంగారెడ్డి, ఆకుల లలిత ప్రశ్నించారు. దీనిపై వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సమాధానం చెబుతూ అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో వౌలిక వసతులను మెరుగుపరచటంతోపాటు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

12/18/2016 - 06:52

హైదరాబాద్, డిసెంబర్ 17: జిల్లాల్లో ఐదు కోట్ల రూపాయల వ్యయంతో డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నామని, హైదరాబాద్‌లో మహిళా డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రవాణా మంత్రి పి మహేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ వాహనాలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో తిరిగేందుకు సింగిల్ పర్మిట్ అనుమతి ఉందని, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం లేదని చెప్పారు.

12/18/2016 - 06:51

హైదరాబాద్, డిసెంబర్ 17: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో పలు మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, ఇదేవిధంగా కొనసాగిస్తే రైతులకు ఎక్కువగా ప్రయోజనం ఉండదని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ పథకం అమలు గురించి బిజెపి సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విషయం తెలిపారు.

12/18/2016 - 06:51

హైదరాబాద్, డిసెంబర్ 17: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు, గతంతో పోలిస్తే వ్యవసాయ సాగు విస్తీర్ణం తగ్గింది. నిరంతర విద్యుత్ సరఫరాతోనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. వ్యవసాయానికి 9గంటలు విద్యుత్ సరఫరా చేయాలని శనివారం శాసనసభలో ప్రతిపక్ష నేత కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసినప్పటికీ రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా కావడంలేదన్నారు.

12/18/2016 - 06:26

హైదరాబాద్, డిసెంబర్ 17: విద్యుత్ కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, జెన్కో ప్రాజెక్టుల్లో బలవంతంగా ఉత్పత్తిని నిలుపుదలచేసే చర్యలకు పాల్పడరాదని ప్రతిపక్ష నేత జానారెడ్డి తెరాస సర్కారును హెచ్చరించారు. విద్యుత్ రంగంలో నిలకడలేని విధానాలను అమలుచేస్తే ఇప్పుడున్న ప్రభుత్వాలే కాకుండా, రానున్న ప్రభుత్వాలు కూడా పతనమవుతాయని ఆయన స్పష్టం చేశారు.

Pages