S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/17/2016 - 05:00

హైదరాబాద్, డిసెంబర్ 16: కొత్త ఏడాది మొదటి తేదీనుంచే రాష్టవ్య్రాప్తంగా నగదురహిత లావాదేవీలపై ప్రజా చైతన్య కార్యక్రమం చేపట్టనున్నట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కార్యక్రమాన్ని ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లేందుకు విద్యావంతులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

12/17/2016 - 04:55

హైదరాబాద్, డిసెంబర్ 16: బిజెపిపక్ష నాయకుడు జి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి వాటి ఫలాలను ప్రజలకు అందించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇబ్బందులను ప్రజలు నవ్వుకుంటూ బాధలు అనుభవిస్తున్నారని అన్నారు. నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలకు కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకోవడం వల్లనే ఎక్కడా ఆందోళనలు జరగడం లేదన్నారు.

12/17/2016 - 04:54

హైదరాబాద్, డిసెంబర్ 16: పెద్ద నోట్ల రద్దుకు ముందస్తు ప్రణాళిక లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సునామీని మించిన జాతీయ విపత్తులా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు కె జానారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

12/17/2016 - 04:53

హైదరాబాద్, డిసెంబర్ 16: ఆరోగ్యశ్రీ సేవలు యధాతథమని, జాబితాలో ఉన్నవాటిని కుదించలేదని వైద్య ఆరోగ్య మంత్రి సి లక్ష్మారెడ్డి సభలో ప్రకటించారు. పైగా మరో ఎనిమిది వైద్య చికిత్సలను పథకం కిందకు తీసుకొచ్చామని వెల్లడించారు.

12/17/2016 - 04:52

హైదరాబాద్, డిసెంబర్ 16: పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేస్తున్న సన్నబియ్యంలో అక్రమాలకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. తెరాస ఎమ్మెల్యే కిశోర్‌కుమార్, జి బాలరాజు, చింతల ప్రభాకర్, బాపూరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈటల సమాధానమిస్తూ 11 వర్శిటీలకు సన్న బియ్యం అందించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.

12/17/2016 - 04:00

చిత్రాలు..శుక్రవారం మొదలైన శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు తరలివస్తున్న బిజెపి, తెరాస, ఎంఐఎం, టిడిపి ఎమ్మెల్యేలు.

12/17/2016 - 03:50

హైదరాబాద్/గచ్చిబౌలి, డిసెంబర్ 16: రహదారులు అభివృద్ధికి సూచికలుగా నిలుస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర అన్నారు. పర్యావరణానికి హాని కలుగకుండా రహదారుల నిర్మాణం జరగాలని ఆయన అన్నారు. హైటెక్స్ సిటీలో శుక్రవారం నుంచి ప్రారంభమైన 77వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రహదారుల నిర్మాణాన్ని బట్టి ఆ దేశ స్థితిగతులను అంచనా వేయవచ్చని ఆయన అన్నారు.

12/17/2016 - 03:46

తూప్రాన్, డిసెంబర్ 16: నోట్ల మార్పిడి చేస్తామంటూ పిలిచి, ఆ తరువాత చంపేస్తామని బెదరించి రూ. 91.78 లక్షలు దోచుకున్న కేసులో ఒక ఎస్‌ఐ సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 34.26 లక్షలు రికవరీ చేసినట్లు తూప్రాన్ డిఎస్‌పి వెంకటేశ్వర్లు తెలిపారు.

12/17/2016 - 04:12

హైదరాబాద్, డిసెంబర్ 16: ఎబివిపి తెలంగాణ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా డాక్టర్ చెన్న కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శిగా ఎల్ అయ్యప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి మసాడి బాపురావు ఒక ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 24 నుండి జరిగే ఎబివిపి జాతీయ మహాసభల్లో వీరు బాధ్యతలు చేపడతారు. చెన్నకృష్ణారెడ్డి మెదక్ జిల్లాకు చెందిన వారు కాగా, ఉస్మానియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

12/17/2016 - 03:39

హైదరాబాద్/ఖైరతాబాద్, డిసెంబర్ 16: రాష్ట్రానికి ముఖ్యమంత్రిలా కాకుండా ప్రధాని మోడీ ఏజెంటులా సిఎం కెసిఆర్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Pages