S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/18/2016 - 06:26

చండీగఢ్, డిసెంబర్ 17: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఐటి శాఖ జరుపుతున్న దాడుల్లో సామాన్యుల వద్ద కూడా భారీ మొత్తంలో నగదు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. తాజాగా చండీగఢ్‌లోని ఓ ప్రముఖ దర్జీ దుకాణంపై జరిపిన దాడుల్లో 30 లక్షల రూపాయల నగదుతో పాటుగా రెండున్నర కిలో బంగారం పట్టుబడింది.

12/18/2016 - 06:24

హైదరాబాద్, డిసెంబర్ 17: రాష్ట్రంలోని 24 జిల్లాల కోసం పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయనున్నట్టు మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోగా ఈ ప్రాంతాల ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి సలహాలు, సూచనల మేరకు పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

12/18/2016 - 06:24

హైదరాబాద్, డిసెంబర్ 17: అవినీతి రహిత సమాజం ఏర్పాటు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పేర్కొన్నారు. 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో ఏర్పడ్డ పరిస్థితిపై శాసనమండలిలో శనివారం జరిగిన చర్చకు సమాధానం ఇచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నోట్లరద్దుపై తీసుకున్న నిర్ణయాన్ని సాహసోపేత నిర్ణయంగా పేర్కొంటూ, ఈ నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తోందన్నారు.

12/18/2016 - 06:16

హైదరాబాద్/ ఖైరతాబాద్, డిసెంబర్ 16: సంతలో పశువుల్ని కొనుగోలు చేసినట్టుగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని టిడిపి నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై నిలదీస్తామనే భయంతోనే అకారణంగా తమను సస్పెండ్ చేశారన్నారు. ప్రస్తుతం సభ జరుగుతున్న తీరును ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది ఖండించాలని అన్నారు.

12/18/2016 - 06:12

సూర్యాపేట, డిసెంబర్ 17: బౌద్ధక్షేత్రంగా భాసిల్లుతున్న జిల్లాలోని నాగారం మండలం ఫణిగిరికి ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా పురావస్తు శాఖ పనితీరును మెరుగుపర్చేందుకు ప్రపంచస్థాయి అనుభవాలను జోడిస్తోంది.

12/18/2016 - 06:09

హైదరాబాద్, డిసెంబర్ 17: అసెంబ్లీలో ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యార్థుల సమస్యలపై టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వాయిదా తీర్మానం ప్రవేశపెట్టి చర్చించాలని పట్టుబడితే సస్పెండ్ చేయడం ఆక్షేపణీయమని టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. విపక్ష సభ్యుల అభ్యర్థనలను పట్టించుకోకుండా ఏకపక్షంగా సభ నడుస్తోందని ఆరోపించారు.

12/17/2016 - 05:45

కరీంనగర్, డిసెంబర్ 16:ప్రభుత్వం అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం వెరసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మిథ్యగా మారింది. కాలే కడుపులతో నకనకలాడుతూ గడపాల్సిన స్థితిలో విద్యార్థులున్నారు. అసలే అంతంతమాత్రంగా కేటాయింపులున్న ఈ మధ్యాహ్న భోజన పథకం నిధులు సరిగా విడుదల కాక నీరుగారుతోంది. బిల్లుల కోసం కార్మికులు ఆందోళనబాట పట్టడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు రోజులుగా పూర్తిగా నిలిచిపోయింది.

12/17/2016 - 05:45

నారాయణపేట టౌన్, డిసెంబర్ 16: ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందనే ఆశతో పంటను తీసుకువస్తే రైతుల కడుపులో మన్ను పోస్తారా అంటూ అన్నదాతలు ఆక్రోశానికి గురై నారాయణపేట మార్కెట్ యార్డులో కార్యాలయాన్ని ధ్వంసం చేసి కార్యదర్శిపై దాడి చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మార్కెట్‌యార్డులో శుక్రవారం ఎర్ర కంది క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.

12/17/2016 - 05:44

హైదరాబాద్, డిసెంబర్ 16: రాష్ట్రంలోని హోం గార్డులకు న్యాయం చేస్తామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం అసెంబ్లీలో జీరో అవర్‌లో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులకు కాలుష్య హానికర అలవెన్సును చెల్లిస్తున్నట్లే హోం గార్డులకూ చెల్లిస్తున్నారా? అని ప్రశ్నించారు.

12/17/2016 - 05:44

హైదరాబాద్, డిసెంబర్ 16:తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు వినియోగించే నీటి విషయంలో ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబించాలని, కాలుష్యవ్యాప్తికి దోహదపడే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరించింది.

Pages