S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/14/2016 - 03:42

సిద్దిపేట, డిసెంబర్ 13 : భక్తుల కొంగు బంగారమైన కొమురవెల్లి మలన్న ఆలయంలో పుట్టమన్నుతో ఏర్పడిన స్వయంభూ మూలవిరాట్‌ను తొలగించి గ్రానైట్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్దదుమారాన్ని రేపాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని, బేషరుతుగా క్షమాపణ చెప్పాలని వివిధ పార్టీల నేతలు, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు ఆందోళనలకు శ్రీకారం చుట్టారు.

12/14/2016 - 03:40

గచ్చిబౌలి, డిసెంబర్ 13: గచ్చిబౌలీలోని ఓ హోటల్‌లో మటన్ బిర్యానీలో కుక్కమాంసం కలిపారన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేశాయి. దీంతో జిహెచ్‌ఎంసి ఆరోగ్యం, పారిశుద్ధ్యం విభాగం అధికారులు గచ్చిబౌలిలోని సదరు హోటల్‌పై తనిఖీలు నిర్వహించారు.

12/14/2016 - 03:37

హైదరాబాద్, డిసెంబర్ 13: అసెంబ్లీ ఆవరణలో బందోబస్తుకు వచ్చే పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ఈ నెల 16 నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో చైర్మన్, స్పీకర్ మంగళవారం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

12/14/2016 - 03:36

హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన 30 నెలల్లో మూడువేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ శాసనసభాపక్షం నాయకుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు ఆయన మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

12/14/2016 - 03:35

హైదరాబాద్, డిసెంబర్ 13: రాష్ట్ర మానవహక్కుల కమిషన్ అనాథగా మారుతోంది. ఎంతోకాలంగా అనేక కేసులను యుద్ధప్రాతిపదికపై విచారణ చేసి తీర్పులు ఇస్తూ వస్తున్న ఈ కమిషన్, రెండు రాష్ట్ర ప్రభుత్వాల (తెలంగాణ-ఎపి) మధ్య నలుగుతోంది. రాష్ట్ర విభజన జరిగి రెండున్నర ఏళ్లు గడిచినప్పటికీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఇప్పటివరకు ఇదే కమిషన్ కొనసాగుతోంది.

12/14/2016 - 03:35

హైదరాబాద్, డిసెంబర్ 13: ముఖ్యమంత్రి ఒఎస్‌డిగా కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్‌ను తిరిగి నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన దేశపతి శ్రీనివాస్ గతంలో సిఎం ఒఎస్‌డిగా నియామకం అయిన విషయం తెలిసిందే. అయితే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు ఇతర విధులు నిర్వహించకూడదని, వారి డిప్యూటేషన్లను రద్దు చేయాలని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

12/14/2016 - 03:34

హైదరాబాద్, డిసెంబర్ 13: ఈనెల 17న దుందిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ‘పాసింగ్ ఔట్ ఫ్లైట్ కేడెట్స్’ జరుగుతుందని ఎయిర్ ఫోర్స్ అకాడమి అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీలంక ఎయిర్ ఫోర్స్ కమాండర్ ఎయిర్ మార్షల్ కెవిబి జయంపతి ముఖ్య అతిథిగా హాజరై కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌ను సమీక్షిస్తారని అధికారులు తెలిపారు.

12/14/2016 - 03:33

కరీంనగర్, డిసెంబర్ 13:జాతీయ స్థాయి పాఠశాలల జూడో బాల బాలికల చాంపియన్ షిప్‌ను హర్యానా కైవసం చేసుకుంది. ఆ జట్టుకు 42 పాయింట్లు రాగా 25 పాయింట్లతో మణిపూర్ రన్నరప్‌గా నిలిచింది. ఇక 17 పాయింట్లు సాధించిన పంజాబ్ తృతీయ స్థానంలో నిలిచింది. కరీంనగర్‌లోని మానేర్ హైస్కూల్‌లో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న 62వ జాతీయ జూడో పోటీలు మంగళవారం ముగిసాయి.

12/14/2016 - 03:32

భువనగిరి/బీబీనగర్, డిసెంబర్ 13: శాంతి భద్రతలను కాపాడడంతోనే రాష్ట్భ్రావృద్ధి సాధ్యమని, 350 కోట్ల రూపాయలతో పోలీస్ శాఖను ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

12/14/2016 - 03:07

జీడిమెట్ల/ హైదరాబాద్, డిసెంబర్ 13: మేడ్చల్ జిల్లా నిజాంపేటలోని బండారి లేఔట్‌లో అక్రమ నిర్మాణాలను హెచ్‌ఎండిఎ ఆధ్వర్యంలో కూల్చివేశారు. కాలనీలోని అక్రమంగా నిర్మించిన ఎనిమిది అపార్టుమెంట్ల గోడలను, పదిహేను విల్లాల గోడలను కూల్చివేశారు. హెచ్‌ఎండిఎ జోనల్ అధికారి ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సహకారంతో కూల్చివేతలను చేపట్టారు.
అక్రమ నిర్మాణాలపై హెచ్‌ఎండిఏ ఉక్కుపాదం

Pages