S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/16/2016 - 02:22

హైదరాబాద్, డిసెంబర్ 15: హైదరాబాద్ నగరంలో నగదు మార్పిడి పేరుతో మోసానికి పాల్పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్, రాజేంద్రనగర్, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో నగదు మార్పిడి కేసులో దాదాపు 22 మంది అరెస్టయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటనే ఆజమాబాద్‌లో గురువారం చోటుచేసుకుంది.

12/16/2016 - 02:22

హైదరాబాద్, డిసెంబర్ 15: దిల్‌సుక్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా నిర్ధారణ అయిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం)కు చెందిన ఐదుగురు నిందితులను దేశంలో ఇతర పేలుళ్ల ఘటనలతో సంబంధం ఉన్న అభియోగాలపై ఇతర జైళ్లకు తరలించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వీరు చర్లపల్లి జైలులో ఉన్నారు.

12/16/2016 - 02:21

హైదరాబాద్, డిసెంబర్ 15: కాళేశ్వరం ప్రాజెక్టు భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టువల్ల తెలంగాణలోని 15 జిల్లాల రైతాంగానికి ప్రయోజనం కలుగుతుందని, ఈ ప్రాజెక్టును ఏదో విధంగా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు కుతంత్రాలు పన్నుతున్నాయని, ప్రతిపక్షాల వలలో రైతులు పడకుండా అవగాహన కలిగించాలని చెప్పారు.

12/16/2016 - 02:20

హైదరాబాద్, డిసెంబర్ 15: శాసనసభలో బిజినెస్ రూల్స్ కింద స్పీకర్‌కు ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రత్యేక గ్రూపుగా గుర్తించడం, సీట్ల కేటాయింపు, సీట్ల అమరిక విధానం అధికారాలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డి హైకోర్టుకు తెలిపారు.

12/16/2016 - 02:19

హైదరాబాద్, డిసెంబర్ 15: నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతోన్న ఏడుగురిని షీ టీమ్స్ బృందాలు అదుపులోకి తీసుకున్నట్టు షీ టీమ్స్ అధికారిణి, అదనపు పోలీస్ కమిషనర్ స్వాతిలక్రా తెలిపారు. నిందితుల్లో 61 ఏళ్ల ఓ వృద్ధుడు కూడా ఉన్నట్టు ఆమె పేర్కొన్నారు. ఎన్టీఆర్ పార్క్ వద్ద మహిళలను వేధించిన రాజేందర్‌ఫాడ్ (24) శ్రీనివాస్ సోలంకి (18) ప్రవీణ్‌కుంద్ (18)లను అదుపులోకి తీసుకున్నారు.

12/16/2016 - 02:19

హైదరాబాద్, డిసెంబర్ 15: పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి (13 మార్చి 2017) రూ. 7500 కోట్ల మేరకు నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత నెలకు రూ. 1500 కోట్ల నుంచి రూ. 2000 కోట్ల మేరకు రాష్ట్ర ఆదాయానికి గండిపడనుందని ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్ర ఆదాయ రాబడికి రూ.

12/16/2016 - 02:18

గుంటూరు (కల్చరల్), డిసెంబర్ 15: కావ్యాలు, కథలు, విమర్శ, హిందూమత మహావర్ణన, వీటన్నింటికి తోడు విమర్శకుల ప్రశంసలు పొందిన చారిత్రక నవలలెన్నింటినో రచించిన ఆచార్య ముదిగొండ శివప్రసాద్ తెలుగుజాతి మెచ్చిన అత్యుత్తమ చారిత్రక నవలా చక్రవర్తి అని పలువురు ప్రముఖులు కొనియాడారు.

12/15/2016 - 07:27

హైదరాబాద్, డిసెంబర్ 14: హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో గల ఇంటర్నెట్ కేఫ్‌లపై బుధవారం సౌత్‌జోన్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఇంటర్నెట్ సెంటర్లలో అసభ్యకర, నీలి చిత్రాలు చూస్తున్న 65 మంది టీనేజర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోంవర్కు పేరిట ఎక్కువ సేపు ఇంటర్నెట్ సెంటర్లలో గడుపుతున్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ఇంటర్నెట్ కేంద్రాలపై దాడులు జరిపారు.

12/15/2016 - 07:26

గోదావరిఖని, డిసెంబర్ 14: గోదావరి నుంచి వృధాగా పోతున్న నీటి నిల్వలను పరిపూర్ణంగా వినియోగంలోకి తీసుకువస్తూ, నీటి కొరతగల ప్రాంతాలకు రివర్స్ పంపింగ్ ద్వారా నిరంతరం నీటిని సరఫరా చేసే అవకాశం ఉన్నందున కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను లైఫ్ లైన్ ప్రాజెక్ట్‌గా ప్రభుత్వం గుర్తించిందని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తెలిపారు.

12/15/2016 - 07:26

నల్లగొండ, డిసెంబర్ 14: వర్షాభావం, కరవు పరిస్థితులతో నీరులేక వెలవెలబోతున్న డిండి ప్రాజెక్టుకు ఇక జలకళ రానుంది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించి డిండికి దండిగా నీరు అందించనున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలోని లక్ష్మాపురం చెరువు నుండి డిండి రిజర్వాయర్‌కు నీటి విడుదల చేసేందుకు ఇరిగేషన్ శాఖ సన్నాహాలు చేస్తుండటంతో డిండి ప్రాంత ప్రజల్లో, రైతుల్లో కొత్త ఆశలను రేపుతుంది.

Pages