S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/15/2016 - 07:10

హైదరాబాద్, డిసెంబర్ 14: తెలంగాణను చలి వణికిస్తోంది. ఆదిలాబాద్‌లో రాత్రివేళ కనీస ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. హైదరాబాద్‌లో 21 డిగ్రీలు, నిజామాబాద్‌లో 17 డిగ్రీలు, ఖమ్మంలో 18 డిగ్రీలు నమోదు కాగా, ఇతర ప్రాంతాల్లో సాధారణం కన్నా ఒకటి రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో చలి ఎక్కువగా ఉంది.

12/15/2016 - 07:10

హైదరాబాద్, డిసెంబర్ 14: శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న శాసనసభా, శాసనమండలిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు గురువారం జరుగనున్న టిఆర్‌ఎస్ శాసనసభా పక్షం సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం శాసనసభాపక్షం సమావేశం జరుగనుంది.

12/15/2016 - 07:09

హైదరాబాద్, డిసెంబర్ 14: పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల స్కీం మొదటి దశ పనులను చేపట్టకుండా చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆఫ్ సదరన్ జోన్ స్టే మంజూరు చేసింది. ఈ స్టే ఆదేశాలు వచ్చే ఏడాది జనవరి 17వ తేదీ వరకు అమలులో ఉంటాయి. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను పిఎస్‌రావు నేతృత్వంలోని బెంచ్ జారీ చేసింది.

12/15/2016 - 07:08

హైదరాబాద్, డిసెంబర్ 14: తెలంగాణ సచివాలయంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక విద్యార్థులు ఐదుగురు బుధవారం హల్‌చల్ చేశారు. ఐదుగురు విద్యార్థులు సచివాలయంలోకి వేరే పని ఉందంటూ పాస్ తీసుకుని వెళ్లారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాలు ఉండే ‘సి’ బ్లాక్ ‘సమతా’ ముందు హఠాత్తుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలంటూ వారు డిమాండ్ చేశారు.

12/15/2016 - 07:07

హైదరాబాద్, డిసెంబర్ 14: ‘బడ్జెట్ రూపకల్పనలో జిల్లా ప్రణాళికలు చాలా ముఖ్యం, ఈ ప్రణాళికల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది, ఆయా జిల్లాలలో అవసరాలను గుర్తించి ప్రతిపాదనలు పంపాలి’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కలెక్టర్లను ఆదేశించారు. ప్రగతి భవన్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన సెషన్‌లో ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

12/15/2016 - 07:06

హైదరాబాద్, డిసెంబర్ 14: ‘ప్రభుత్వం అంటే మంజూరీలు చేయడానికే పరిమితం కాదు. మంచి పథకాలు, విధానాలతో ప్రజా జీవితాల్లో మార్పు తేవడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరింత సమర్థంగా అమలుచేసే ఉద్దేశంతోనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని, పరిపాలనా విభాగాలను వికేంద్రీకరించామని అన్నారు.

12/14/2016 - 04:13

హైదరాబాద్, డిసెంబర్ 13: కొత్త నోట్ల పంపిణీలోనూ తెలంగాణకు కోత విధించారు. దేశ వ్యాప్తంగా కొత్త నోట్ల పంపిణీలో తెలంగాణకు దక్కాల్సిన వాటా కన్నా తక్కువ కరెన్సీ పంపించారు. తెలంగాణకు ఇప్పటి వరకు 17,500 కోట్ల రూపాయల కొత్త నోట్లను ఆర్‌బిఐ పంపించింది. వాస్తవానికి తెలంగాణకు ఇప్పటి వరకు 20వేల కోట్ల రూపాయల కొత్త కరెన్సీ పంపిణీ జరగాలి. రెండున్నర వేల కోట్ల రూపాయల వరకు కరెన్సీ తక్కువ పంపించారు.

12/14/2016 - 04:07

హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్శిటీలను నెలకోల్పేందుకు వీలు కల్పించే బిల్లుకు మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం నాడు తుది రూపం ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు మంత్రులు కెటిఆర్, పోచారం శ్రీనివాసరెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి కూడా హాజరయ్యారు.

12/14/2016 - 04:00

హైదరాబాద్, డిసెంబర్ 13: ఆర్థిక లావాదేవీలన్నింటినీ నగదు రహితంగా మార్చడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో సంస్థాగతంగా బ్యాంకులు బలోపేతం కావాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. నగదు రహిత లావాదేవీల నిర్వహణపై గ్రామ సభలు నిర్వహించి బ్యాంక్ అకౌంట్లు, కార్డుల నిర్వహణపై అవగాహన కల్పించాలని బ్యాంకర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు.

12/14/2016 - 03:46

నల్లగొండ, డిసెంబర్ 13: తొందరపడి ఓ కోయిల ముందే కూసిందన్నట్లుగా 2019 ఎన్నికల్లో అధికారం దక్కుతుందో లేదో తెలియకపోయినా సీఎం పదవి తనదంటే తనదేనంటు టిపిసిసి సీనియర్ నేతల ప్రకటనలు వేడిపుట్టిస్తున్నాయి. కాంగ్రెస్‌లో కలకలానికి, మిగతావారు నవ్వుకోవడానికి ఈ ప్రకటనలు ఉపకరిస్తున్నాయి.

Pages