S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/27/2016 - 08:46

మహబూబ్‌నగర్, అక్టోబర్ 26: మహబూబ్‌నగర్ జిల్లా జడ్పీ సమావేశం రసాభాసగా కొనసాగింది. కాంగ్రెస్, టిఆర్‌ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు, మాటల యుద్ధం, నిరసనలతో బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సమావేశం దద్దరిల్లింది.

10/27/2016 - 08:23

హైదరాబాద్, అక్టోబర్ 26: ఓటుకు నోటు కేసులో నిందితుడు, టిటిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ప్రతి సోమవారం అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి రేవంత్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. కాగా ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారించి ఇకపై ప్రతి సోమవారం రేవంత్ రెడ్డి ఏసిబి ఆఫీసుకు హాజరు కాకుండా మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

10/27/2016 - 08:22

హైదరాబాద్, అక్టోబర్ 26: ఉస్మానియా యూనివర్శిటీ శతవార్షికోత్సవాలను మునె్నన్నడూ లేని విధంగా ఘనంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి యూనివర్శిటీ అధికారులను ఆదేశించారు. ఉస్మానియా యూనివర్శిటీ శతవార్షికోత్సవాల సన్నాహక సమావేశంలో ఆయన ఏర్పాట్లను సమీక్షించారు. శతవార్షికోత్సవాలను ఏదో ఒకరోజుకో రెండు రోజులకో పరిమితం చేయకుండా ఏడాది పొడవునా కార్యక్రమాలు కొనసాగేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

10/27/2016 - 08:21

హైదరాబాద్, అక్టోబర్ 26: పాకిస్తాన్ ఇకనైనా కళ్లు తెరవాలని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు హితవు చెప్పారు. క్వెట్టా పోలీసు అకాడమీపై ఉగ్రవాదులు దాడి చేయడం అమానుషమని ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందని, చివరకు పాక్‌కు అదే భస్మాసుర హస్తంగా మారిందని ఆయన తెలిపారు. మన దేశం ఎప్పుడూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించలేదని అన్నారు.

10/27/2016 - 06:56

హైదరాబాద్, అక్టోబర్ 26: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పార్టీ ఆధినేత కెసిఆర్ వెంట కలిసి నడిచిన వారందరికీ తగిన గుర్తింపు ఇస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి తప్పకుండా అవకాశాలు దక్కుతాయన్న దానికి ఈద శంకర్‌రెడ్డినే నిదర్శనం అన్నారు.

10/27/2016 - 06:53

హైదరాబాద్, అక్టోబర్ 26: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల జగడం ఇప్పట్లో తేలేలా కనిపించటం లేదు. విభజన జరిగి రెండున్నరేళ్లు గడిచిన తరువాత కూడా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపిణీ, బకాయిల చెల్లింపుపై సయోధ్య కుదరలేదు. విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లో ఉత్పత్తి అయిన విద్యుత్‌లో ఆంధ్రాకు 46.11శాతం, తెలంగాణకు 53.89 శాతం కేటాయించారు.

10/27/2016 - 06:51

హైదరాబాద్, అక్టోబర్ 26: కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వం రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. ప్రస్తుత సచివాలయంలోని కార్యాలయాల తరలింపు, భవనాల కూల్చివేత, కొత్త సచివాలయ నిర్మాణం, ప్రారంభోత్సవం వరకు ఎప్పుటి నుంచి ఏది జరగాలో షెడ్యూల్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. సచివాలయం కూల్చివేత పనుల నుంచి కొత్త భవన నిర్మాణం వరకు ఆర్ అండ్ బి శాఖ ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక ఇచ్చింది.

10/26/2016 - 07:50

హైదరాబాద్, అక్టోబర్ 25: ఎక్కడైనా అగ్నిప్రమాదాలు సంభవించిన వెంటనే స్పందించి ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు ద్విచక్ర వాహనాలను రంగంలోకి దింపనుంది. అగ్నిమాపక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో వంద బుల్లెట్‌లను కొనుగోలు చేసింది. ఒక బుల్లెట్‌కు ఇద్దరు సిబ్బంది, ఒక సిలిండర్, మెడికల్ కిట్ ఉంటుంది.

10/26/2016 - 07:49

హైదరాబాద్, అక్టోబర్ 25: గిరిజనుల అభివృద్ధి కోసం ఎస్టీ సబ్ ప్లాన్‌కు కేటాయించిన నిధులు సత్వరం విడుదల చేయాలని నిర్ణయించినట్టు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గిరిజనాభివృద్ధి, సబ్ ప్లాన్ అమలుపై మంగళవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. గిరిజన సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, బడ్జెట్‌లో గిరిజనుల అభివృద్ధికి పెద్ద పీట వేసినట్టు చెప్పారు.

10/26/2016 - 07:47

నల్లగొండ, అక్టోబర్ 25: వైద్య విద్య లక్ష్యంగా ఎంసెట్‌లో 167 ర్యాంకు సాధించిన మెడికో అకస్మాత్తుగా తనువు చాలించాడు. ఉస్మానియా వర్శిటీలో ఎంబిబిఎస్ తొలి ఏడాదిలో చేరి రోజులు పూర్తికాకముందే యానాల సాయికుమార్‌రెడ్డి (19) చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ పట్టణంలోని శ్రీ లక్ష్మీసాయి టవర్స్ ఐదో అంతస్తు నుంచి అర్థరాత్రి సమయంలో కిందకుదూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Pages