S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/25/2016 - 02:57

హైదరాబాద్, అక్టోబర్ 24: కొమరం భీమ్ జిల్లా జైనూరు మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని నియమిస్తూ మార్కెటింగ్ శాఖ మంత్రి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్‌గా కుమ్ర భగవంతరావు, వైస్ చైర్మన్‌గా సెడిక సీతారామ్‌ను నియమించారు.

10/25/2016 - 02:56

హైదరాబాద్, అక్టోబర్ 24: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతున్న నిధులు, శాఖల వారీగా సమకూరుతున్న ఆదాయం, కేంద్ర ప్రాయోజిత పథకాలు, కొత్తగా ఆదాయ మార్గాలపై నివేదికలు అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వివిధ శాఖాధిపతులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం వివిధ శాఖల ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో రాజీవ్ శర్మ సమావేశమయ్యారు.

10/25/2016 - 02:55

హైదరాబాద్, అక్టోబర్ 24: గల్ఫ్‌లోని భారత కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ జాగృతి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరింది. మూడు రోజుల అధికారిక పర్యటన కోసం బహ్రెయన్‌కు వచ్చిన రాజ్‌నాథ్‌సింగ్‌ను తెలంగాణ జాగృతి బహ్రెయన్ శాఖ అధ్యక్షుడు చెల్లంశెట్టి హరిప్రసాద్ ఇతర కార్గవర్గ సభ్యులు కలిసి గల్ఫ్ కార్మికుల సమస్యలను వివరించారు.

10/25/2016 - 02:55

హైదరాబాద్, అక్టోబర్ 24: హోంగార్డులకు ఉద్యోగ భద్రతతోపాటు వేతనాలు పెంచాలని కోరుతూ అఖిల భారత హోంగార్డుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సకినాల నారాయణ చేపట్టిన ఆమరణ దీక్షకు తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం మద్దతు ప్రకటించారు. హైదరాబాద్‌లో సోమవారం నారాయణ చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. హోంగార్డుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.

10/25/2016 - 02:38

కొత్తగూడెం, అక్టోబర్ 24: సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జెఎసి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట సోమవారం కాంట్రాక్ట్ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు.

10/25/2016 - 02:36

కొత్తగూడెం, అక్టోబర్ 24: జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలి గ్రీవెన్స్‌డేను సోమవారం స్థానిక ఆర్డీవో సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు నేతృత్వంలో నిర్వహించారు. ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని సమస్యలపై దరఖాస్తులు అందజేశారు. ప్రధానంగా భూసమస్యలు, ప్రభుత్వం తరపున విడుదల కావాల్సిన నిధులపై ఎక్కువ మంది దరఖాస్తులు అందజేశారు.

10/24/2016 - 05:40

హైదరాబాద్, అక్టోబర్ 23: తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలుగా అవమానం జరుగుతోందని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరిస్తోందని తెలంగాణ పొలిటికల్ జెఎసి చైర్మన్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటూనే రైతుల సమస్యలు పరిష్కరించడం లేదని ఆయన ఆరోపించారు.

10/24/2016 - 05:39

హైదరాబాద్, అక్టోబర్ 23: తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ ఫిల్మ్ డైరెక్టర్ దూలం సత్యనారాయణ నిర్మించిన పర్యాటక చిత్రానికి అంతర్జాతీయంగా ప్రతిష్ఠాకరమైన అవార్డు లభించింది. ఈ నెల 19 నుంచి 21వ తేదీల వరకు పోర్చుగల్‌లో అంతర్జాతీయ పర్యాటక ఉత్సవం జరిగింది. ఉత్తమ టూరిజం చిత్రాల నిర్మాణానికి అవసరమైన ఫిల్మ్ లోకేషన్స్‌పై మూడు నిమిషాల నిడివి ఉన్న చిత్రాన్ని దూలం సత్యనారాయణ నిర్మించారు.

10/24/2016 - 05:38

హైదరాబాద్, అక్టోబర్ 23: సరైన అవగాహన లేకపోవడం వల్ల అనేక రోగాల సమస్యలకు మూలం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రపంచ ఆర్థరైటిస్ డే సందర్భంగా రుమటోలజీ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్ జల విహార్‌లో చేపట్టిన వాక్ టు సపోర్ట్ ఆర్థరైటిస్ అవేర్‌నెస్ నడకను మంత్రి ప్రారంభించారు.

10/24/2016 - 05:30

కొత్తగూడెం, అక్టోబర్ 23: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీకి సంబంధించి ప్రభుత్వం నుండి ఇంకా సర్క్యులర్ విడుదల కాకపోవడంతో కార్మిక వర్గంలో ఆందోళన నెలకొంది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా ప్రకటన సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎలాంటి షరతులు లేకుండా సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తున్నట్లు కూడా ప్రకటించారు.

Pages