S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/29/2016 - 04:01

హైదరాబాద్, అక్టోబర్ 28: సచివాలయంలో ఆంధ్రకు కేటాయించిన భవనాలు త్వరగా తెలంగాణకు అప్పగించేలా చొరవ చూపాలని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు సిఎం కె చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఈనెల 31న జరుగనున్న ఏపీ కేబినెట్‌లో సానుకూల తీర్మానం చేసేలా చూడాలని కోరారు. సిఎం కెసిఆర్ శుక్రవారం రాజ్‌భవన్‌కు వెళ్లి ఉమ్మడి గవర్నర్‌తో సమావేశమయ్యారు. భేటీలో రెండు అంశాలపై గవర్నర్‌తో సిఎం చర్చించినట్టు సమాచారం.

10/29/2016 - 00:43

రాజ్‌భవన్‌లో దీపావళి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయ. ఈ సందర్భంగా రాజ్‌భవన్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో కలిసి ‘మనలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో రాజ్‌భవన్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలలతో పాటు షటిల్, బాడ్మింటన్ వంటి ఆటల పోటీలు నిర్వహించారు.

10/29/2016 - 00:26

హైదరాబాద్, అక్టోబర్ 28: ఆదాయ వనరులుగా ఉన్న వివిధ శాఖలు బడ్జెట్ అంచనాలను మించి పురోగతిలో పయనిస్తున్నాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అర్ధ వార్షిక లెక్కల ప్రకారం వచ్చిన రాబడి రాష్ట్ర ఖజానాను పరిపుష్టం చేస్తున్నాయి.

10/29/2016 - 00:25

హైదరాబాద్, అక్టోబర్ 28: హోంగార్డుల సమస్యల పరిష్కారం అంశం రోజు రోజుకూ ముదురుతోంది. హోంగార్డులకు ప్రతిపక్షాలన్నీ బాసటగా నిలిచాయి. హోంగార్డుల డిమాండ్లు, సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్‌రెడ్డి దీపావళి పండుగ తర్వాత ఇందిరాపార్కు వద్ద మూడు రోజులు లేదా 48 గంటల పాటు దీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నారు.

10/29/2016 - 22:10

హైదరాబాద్, అక్టోబర్ 28: శాసన మండలిలో ప్రభుత్వ విప్‌గా నియమితులైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విప్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాజేశ్వర్‌రెడ్డిని మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్, హరీశ్‌రావు, అభినందనలు తెలిపారు.

10/29/2016 - 00:24

హైదరాబాద్, అక్టోబర్ 28: తెలంగాణలో 1500 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాసురూమ్‌లను ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. డిజిటల్ క్లాసు రూమ్‌ల ప్రారంభానికి తీసుకోవలసిన చర్యలపై సంబంధిత అధికారులతో కడియం శ్రీహరి సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిజిటల్ లిటరసీలో తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు.

10/29/2016 - 00:21

పరకాల, అక్టోబర్ 28: పరకాలలో రూరల్ జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని లేని పక్షంలో పరకాల మండలాన్ని ఆచార్య జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలుపుతూ పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న ఆందోళన సెగ శుక్రవారం తెలంగాణ శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి ఉద్యమ సెగ తాకింది.

10/29/2016 - 00:19

నార్కట్‌పల్లి, అక్టోబర్ 28: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల పరిధిలోని మాండ్రా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో పూరి గుడిసె దగ్ధమవ్వడంతో అందులో ఉన్న పోలియో వికలాంగురాలైన బాషబోయిన సుజాత (15) సజీవదహనమైన దారుణ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు బాషబోయిన యాదయ్య, రాములమ్మలు వడ్డెర వృతి పనిచేస్తూ జీవిస్తున్నారు.

10/29/2016 - 00:17

హైదరాబాద్, అక్టోబర్ 28: పలు మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలను నియమిస్తూ శుక్రవారం మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బీరవెల్లి ఉమారెడ్డి, వైస్ చైర్మన్‌గా హోలం చంద్రమోహన్‌ను నియమించారు. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గుండేటి ఐలయ్య యాదవ్, వైస్ చైర్మన్‌గా మాదారపు ఆంజనేయ రావులను నియమించారు.

10/29/2016 - 00:16

హైదరాబాద్, అక్టోబర్ 28: విద్యార్ధులకు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను ఇచ్చి ప్రభుత్వ గురుకులాల్లో విద్యాసంచలనానికి తెరతీసిన సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి విద్యార్ధులకు కియోస్క్‌లు కూడా అందుబాటులోకి తెచ్చారు. తాజాగా విద్యార్ధులకు లైఫ్ స్కిల్స్ స్టూడియోలు ఏర్పాటు చేస్తున్నారు.

Pages