S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/10/2016 - 06:33

హైదరాబాద్, అక్టోబర్ 9: తెలంగాణలో కొత్తగా తొమ్మిది పోలీస్ కమిషనరేట్లు ఏర్పడ్డాయి. దసరా నుంచి ఐదు కమిషనరేట్లు పనిచేస్తాయి. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. భారీగా ఐపిఎస్‌ల బదిలీలతోపాటు అదనపు ఎస్పీలకు పదోన్నతులు లభించనున్నాయి. పదోన్నతులపై కసరత్తు కొనసాగుతోందని ఆదివారం డిజిపి అనురాగ్ శర్మ తెలిపారు.

10/10/2016 - 06:32

హైదరాబాద్, అక్టోబర్ 9: ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేయాలన్న లక్ష్యంతో సిపిఎం రాష్ట్ర కమిటీ ఈ నెల 17 నుంచి తెలంగాణలోని అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో మహాజన పాదయాత్ర నిర్వహించాలని సంకల్పించింది. సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు మహాజన పాదయాత్రలో పలువురు పార్టీ నాయకులు పాల్గొంటారు.

10/10/2016 - 06:32

హైదరాబాద్, అక్టోబర్ 9: తెలంగాణలో కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల నియామకాల్లో గందరగోళపరిస్థితి ఏర్పడింది. తగినంత మంది ఐఎఎస్ అధికారులు లేకపోవడం ఇందుకు కారణం. ప్రస్తుతం పనిచేస్తున్న 10 జిల్లాల కలెక్టర్లు మినహాయిస్తే మిగతా 21 జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను నియమించాలి. అంటే 42 మంది ఐఎఎస్ అధికారుల అవసరం వెంటనే ఉంటుంది.

10/10/2016 - 06:30

హైదరాబాద్, అక్టోబర్ 9:కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పౌర సరఫరాల శాఖలోని ఉద్యోగుల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ శాఖ కమిషనర్ సివి ఆనంద్ ఉద్యోగులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పౌరసరఫరాల సంస్థ, లీగల్ మెట్రాలజీ విభాగాల్లో అధికారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

10/10/2016 - 04:16

హైదరాబాద్, అక్టోబర్ 9: ఎప్పుడెప్పుడా అని అధికార తెరాస పార్టీ నేతలు ఎదురు చూస్తోన్న నామినేటెడ్ పదవుల పందేరానికి దసరా కానుకగా సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారు. 9 కార్పొరేషన్లకు చైర్మన్లను ఆదివారం ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుంచీ కష్టపడిన కార్యకర్తలకు అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో నియామకాలు జరిపినట్టు పేర్కొన్నారు.

10/10/2016 - 04:15

హైదరాబాద్, అక్టోబర్ 9: వెనుకబడిన తరగతుల విద్యార్థులకు సిఎం కెసిఆర్ దసరా కానుకగా ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకాన్ని ప్రకటించారు. దీనికి జ్యోతిరావు ఫూలే బీసీ ఓవర్సీస్ పథకంగా నామకరణం చేస్తూ ఫైలుపై ఆదివారం సంతకం చేశారు. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మాత్రమే ఈ పథకం అమలవుతున్న విషయం తెలిసిందే.

10/10/2016 - 04:14

హైదరాబాద్, అక్టోబర్ 9: దసరానుంచి తెలంగాణ కొత్త స్వరూపం సంతరించుకోనుంది. భౌగోళికంగా పది జిల్లాలుగా ఉన్న తెలంగాణ 31 జిల్లాలుగా ఆవిర్భవించనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణ రాజకీయ స్వరూపమే మారిపోనుంది. ప్రస్తుతం జిల్లాల్లో అధిపత్యం చలాయిస్తున్న వర్గాల్లోనూ మార్పు అనివార్యం కాబోతోంది. చివరకు మంత్రుల నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలు సైతం పక్క జిల్లాలోకి పోతున్నాయి. ఇదో విచిత్రమైన పరిస్థితి.

10/10/2016 - 04:13

హైదరాబాద్, అక్టోబర్ 9: దసరా పర్వదినమైన మంగళవారం ఉదయం 11 గంటల 13 నిమిషాలకు కొత్త జిల్లాల ఆవిర్భావానికి ముహూర్తం ఖరారైంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త జిల్లాలతోపాటు కొత్త రెవిన్యూ డివిజన్లు, మండలాలు, పోలీస్ కమిషనరేట్లు, పోలీస్ సబ్ డివిజన్లు, పోలీస్ సర్కిళ్లు, కొత్త పోలీస్ స్టేషన్లను ఏకకాలంలో ప్రారంభించనున్నారు.

10/10/2016 - 04:11

వరంగల్, అక్టోబర్ 9: జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో విపక్షాలు విపరీత ధోరణితో వ్యవహరిస్తున్నాయని సిఎం కె చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ప్రభుత్వం చేపట్టే ప్రజోపయోగకర కార్యక్రమాల కారణంగా ఉనికి కోల్పోతామనే భయంతో కాంగ్రెస్, తెదేపాలు కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రజల్లో లేనిపోని ఆందోళనలు రేకెత్తించే ప్రయత్నాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.

10/10/2016 - 03:49

హైదరాబాద్, అక్టోబర్ 9: తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాలు ఆదివారం హుస్సేన్ సాగర్ తీరాన అంబరాన్నంటాయి. సాగర తీరం పూలవనాన్ని తలపించింది. శనివారం ఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించిన మహా బతుకమ్మ గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకోవటంతో ఆదివారం నాటి బతుకమ్మ ఉత్సవాలు మరింత ఉత్సాహంగా జరిగాయి.

Pages