S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/11/2016 - 06:28

హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణ ప్రజలకు అత్యంత ముఖ్యమైన పెద్ద పండుగ దసరా పండుగ రోజుననే అతి పెద్ద పరిపాలనా సంస్కరణల అమలుకు శ్రీకారం చుట్టడం శుభప్రదం అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

10/11/2016 - 06:27

హైదరాబాద్, అక్టోబర్ 10: రాష్ట్రంలో జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తూ గెజిట్ నోటిఫికేషన్ సోమవారం పొద్దుపోయిన తర్వాత ప్రభుత్వం జారీ చేసింది. పది జిల్లాలతో ఉన్న తెలంగాణను 31 జిల్లాలతో పునర్వ్యవస్థీకరించింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్తగా 25 రెవిన్యూ డివిజన్లు, 125 మండలాలను ఏర్పాటు చేస్తున్నట్టు కూడా గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

10/11/2016 - 06:26

హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుతో వివిధ శాఖల్లో పదోన్నతులకు సర్కారు కసరత్తు ప్రారంభించింది. ప్రతి జిల్లాలో 30 ప్రధాన శాఖలు, 206 ఉపశాఖలు ఉన్నాయి. ఉపశాఖలు 206 ఉన్నప్పటికీ, అన్ని శాఖలకు కలిపి వాస్తవంగా జిల్లాస్థాయి అధికారులు ఒక్కో జిల్లాలో 50నుండి వంద మంది ఉంటారు. అంటే ఒక్కో అధికారికి సరాసరిన రెండు నుంచి నాలుగు శాఖలున్నాయి.

10/11/2016 - 06:25

హైదరాబాద్, అక్టోబర్ 10: దసరా పర్వదినాన మంగళవారం నుంచి 21 కొత్త జిల్లాలను ప్రారంభించే బాధ్యతను మంత్రులకు అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రుల జాబితాను అనధికారికంగా రెండు రోజుల కిందట ప్రకటించినప్పటికీ దానిలో పలుమార్పులు చేసి తాజాగా సోమవారం తిరిగి విడుదల చేసింది.

10/11/2016 - 06:13

భద్రాచలం, అక్టోబర్ 10: 3జిల్లాల పునర్విభజనతో ఆదివాసీ ప్రాంతాలను ముక్కలు చెక్కలు చేస్తుంటే తమ జాతి ఉనికిని కాపాడుకోవాల్సిన ఎమ్మెల్యేలు ఎందుకు వౌనంగా ఉన్నారు? పునర్విభజనపై ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు? అసలు గవర్నర్ పాలనలో ఉండాల్సిన ఆదివాసీ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కర్రపెత్తనం ఏంటి?

10/11/2016 - 06:11

చర్ల, అక్టోబర్ 10: ఖమ్మం జిల్లా చర్ల మండలం కోరెగడ్డలంకల్లో గోదావరిలో సోమవారం రెండు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో రెండు పడవల్లోని సుమారు 70 మంది కూలీలను స్థానిక జాలర్లు, తోటి కూలీలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. చర్ల మండలం గోదావరి నడిమధ్యలో కోరెగడ్డ అనే లంకలు ఉన్నాయి. అక్కడ 500 ఎకరాల్లో మిర్చి ఇతర పంటలు సాగుచేస్తుంటారు. అక్కడకు కూలీలను నిత్యం పడవల ద్వారా తరలించి, తిరిగి తీసుకొస్తుంటారు.

10/11/2016 - 06:00

హైదరాబాద్, అక్టోబర్ 10: ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేపట్టిన గ్యాంగ్‌స్టర్ నరుూమొద్దీన్ అలియాస్ నరుూం కేసు దర్యాప్తు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి సాగుతోంది. నరుూం పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమై నేటితో రెండు నెలలు పూర్తి కావచ్చినా.. దర్యాప్తు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. నరుూం కేసు పోలీస్ ఇన్‌ఫార్మర్ల గుండెల్లో గుబులు రేపుతోంది.

10/11/2016 - 05:58

హైదరాబాద్, అక్టోబర్ 10: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తన హోదాను మరచి, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. కెసిఆర్ పాలన తుగ్లక్ పాలనలా ఉందని ప్రజలు అనుకుంటున్నారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి సోమవారం టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, సిఎల్‌పి నేత కె.

10/11/2016 - 05:38

హైదరాబాద్, అక్టోబర్ 10: కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి ధూమ్‌ధామ్ ఏర్పాట్లు చేశారు. తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సిద్దిపేటలో సిఎం కెసిఆర్ నేటి ఉదయం 11.13 నిమిషాలకు కొత్త జిల్లాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సిద్దిపేట జిల్లాగా ఆవిష్కరిస్తారు. సరిగ్గా అదే సమయానికి మంత్రులు మొత్తం 20 జిల్లాలను ప్రారంభిస్తారు.

10/10/2016 - 06:35

హైదరాబాద్, అక్టోబర్ 9: దసరా నుంచి కొత్త జిల్లాలు ఏర్పడుతున్నందున ప్రభుత్వ శాఖలు జిల్లా అధికారులను నియమిస్తున్నారు. అన్ని శాఖల అధికారులకు సూచన ప్రాయంగా వారికి కేటాయించిన జిల్లాల గురించి వివరించారు. అయితే అధికారికంగా మంగళవారం నాడే ఉత్తర్వులు వెలువడుతాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో 31 జిల్లాలకు జిల్లా ఇరిగేషన్ అధికారులను నియమిస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్నారు.

Pages