S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/13/2016 - 18:04

హైదరాబాద్‌: మంచాల ఇన్స్‌పెక్టర్‌ గంగాధర్‌ తీరుపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఫెండ్రీ పోలీస్‌ విధానంపై డీజీపీ అనురాగ్‌శర్మను ప్రశ్నించారు. రెండు రోజుల కిందట ఇండియన్‌ నేషనల్‌ ర్యాలీ సంస్థ చేపట్టిన బైక్‌ ర్యాలీకి అనుమతి లేదంటూ గంగాధర్‌ అడ్డుకుని నిర్వాహకులపై చేయి చేసుకున్నారు. ఈ విషయాన్ని నిర్వాహకులు మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

09/13/2016 - 16:41

హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీం నేరాలకు సంబంధించి మరో 30 కేసులు నమోదు చేయడానికి, రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఛార్జిషీట్లు వేసేందుకు సిట్‌ ప్రయత్నాలు చేస్తోంది. స్థానిక కోర్టుల్లోనే ఛార్జిషీట్లు వేయాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీచేసింది.

09/13/2016 - 13:55

హైదరాబాద్‌: ఖైరతాబాద్ గణపతి దర్శనం బుధవారం అర్ధరాత్రి వరకు ఉంటుందని నిర్వహకులు తెలిపారు. లడ్డూ పంపిణీని ఇప్పటికే పూర్తి చేశారు. గురువారం 12 గంటల్లోపు గణపతి నిమజ్జనం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

09/13/2016 - 12:35

హైదరాబాద్‌ : ఖైరతాబాద్‌ మహాగణపతి లడ్డూ ప్రసాదం పంపిణీ మంగళవారం ఉదయం ప్రారంభించారు. గతేడాది లడ్డూ ప్రసాదం పంపిణీ సందర్భంగా ఘర్షణ వాతావరణం నెలకొనడంతో లడ్డూ ఏర్పాటును మానుకోవాలని నిర్ణయానికి వచ్చారు. కానీ, భక్తుల విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది 500కేజీల లడ్డూను ఏర్పాటు చేశారు. నిమజ్జనం ముందే క్యూలో వచ్చిన భక్తులకు పంపిణీ చేస్తే బాగుంటుందని ఉత్సవ కమిటీ భావించింది.

09/13/2016 - 11:09

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో మంగళవారం బక్రీద్‌ పర్వదినాన్ని ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. మక్కా మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈద్‌ ముబారక్‌ అంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

09/13/2016 - 11:06

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నోటీసులు జారీ చేసిన పురాతన భవనాలను వెంటనే ఖాళీ చేయించాలని, పాత భవనాల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి అధికారులను మంగళవారం ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

09/13/2016 - 11:01

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కోఠిలోని వస్త్ర దుకాణంలో మంగళవారం తెల్లవారుజామున చెలరేగిన మంటల్లో బట్టలు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుదాఘాతం కారణంగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆస్తి నష్టం లక్షల్లో ఉంటుందని దుకాణం యజమాని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.

09/13/2016 - 10:47

హైదరాబాద్‌: మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

09/13/2016 - 05:22

కరీంనగర్, సెప్టెంబర్ 12: ఆంధ్ర ప్రాంతానికి సాగు, తాగునీటి అవసరాల కోసం ఆనాడు తన నియోజకవర్గంలో 21 గ్రామాలు ముంపునకు గురవుతున్నా ఎక్కమాట మాట్లాడకుండా అప్పటి సిఎంలు వైఎస్సార్, కిరణ్‌కుమార్‌రెడ్డిల మెప్పుకోసం పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పులిచింతల ప్రాజెక్టును కట్టించారని, నేడు తెలంగాణ ప్రాంతానికి సాగు, తాగు నీటి అవసరాల కోసం అతి తక్కువ ముంపుతో మల్లన్నసాగర్ ప్రాజెక్టును కట్టాలని చూస్తుంటే అడ్డుకు

09/13/2016 - 05:20

గజ్వేల్, సెప్టెంబర్ 12: మల్లన్నసాగర్ నుంచే సిఎం కెసిఆర్ పతనం ప్రారంభమైందని ఎఐసిసి కార్యదర్శి వి. హన్మంతరావు ఎద్దేవా చేశారు. సోమవారం గజ్వేల్‌లో జరిగిన మల్లన్నసాగర్ నిర్వాసితుల సంఘీభావ సదస్సుకు హాజరై ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 1234 పాలన కొనసాగుతోందని, తెలంగాణకు కాపలాకుక్కలా ఉంటానని చెప్పిన సిఎం కెసిఆర్ పదవిని పట్టుకొని వేలాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Pages