S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/13/2016 - 04:41

హైదరాబాద్, సెప్టెంబర్ 12: భూ సేకరణలో సమస్యలు తలెత్తకుండా కొత్త చట్టం తీసుకు రావడానికి ప్రభుత్వం ఐఎఎస్ అధికారులతో కమిటీ వేసింది. జివో 123 ద్వారా భూ సేకరణ చేయడం, కొందరు కోర్టుకు వెళ్లడంతో భూ సేకరణ వివాదాస్పదం కావడంతో వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్త చట్టం తీసుకు రావాలని నిర్ణయించింది.

09/12/2016 - 18:12

హైదరాబాద్: మల్లన్నసాగర్ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి బలవంతంగా భూ సేకరణ చేస్తున్నారని, నిర్వాసితులకు సరైన న్యాయం జరిగేలా జోక్యం చేసుకోవాలని టి.కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. రాజ్‌భవన్‌లో టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవి తదితరులు గవర్నర్‌ను కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు.

09/12/2016 - 17:48

హైదరాబాద్: ప్రజలందరూ ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలని, పుకార్లు నమ్మవద్దని, సోషల్ మీడియాలో, ఇతర మాధ్యామాల ద్వారా పుకార్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. గణేశ్ నిమజ్జనం, బక్రీద్ నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు సోమవారం కవాతు నిర్వహించారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టారు.

09/12/2016 - 16:41

హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన లక్ష్మి సోమవారం నకిలీ వీసాతో దుబాయ్ వెలుతుండగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

09/12/2016 - 16:18

హైదరాబాద్‌: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న నివేదికల నేపథ్యంలో అవసరమైన ముందుజాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, సీపీ మహేందర్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్‌ హైదరాబాద్‌లో అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

09/12/2016 - 15:36

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం, బక్రీద్‌ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని, నగరంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు పోలీసులను హెచ్చరించాయి. దీంతో ముందుజాగ్రత్తగా సీపీ మహేందర్‌ రెడ్డి నగరంలో పర్యటిస్తున్నారు. పాతబస్తీలో పోలీసులు సోమవారం కవాతు నిర్వహించారు.

09/12/2016 - 14:26

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం నుంచి సోమవారం ఉదయం కువైట్ వెళ్తున్న ముషీర్ అహ్మద్ అనే వ్యక్తిని ఎయిర్‌పోర్ట్ పోలీసులు తనిఖీ చేయగా బుల్లెట్‌ బయటపడింది. ముషీర్ అహ్మద్ ని అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీ తలాబ్‌కట్టకు చెందిన వ్యక్తిగా ముషీర్ అహ్మద్ని పోలీసులు గుర్తించారు.

09/12/2016 - 13:55

కరీంనగర్‌: కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే కరీంనగర్‌లో ఏడాదికి రెండు పంటలు పండించుకోవచ్చని, తద్వారా కరీంనగర్‌ మరో కోనసీమగా మారుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారు. ఎవరెన్ని సమస్యలు సృష్టించినా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని తెలిపారు.

09/12/2016 - 13:21

హైదరాబాద్‌ : వినాయకుడి నిమజ్జనం కోసం చెరువులోకి దిగిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన కూకట్‌పల్లి పరిధిలో జరిగింది. జగద్గిరిగుట్టకు చెందిన భాస్కర్‌ (42) ఆదివారం రాత్రి మిత్రులతో కలిసి కూకట్‌పల్లి నల్లచెరువుకు వినాయక నిమజ్జనం కోసం వచ్చి విగ్రహం సహా చెరువులోకి దిగి చెరువులో మునిగిపోయాడు. సోమవారం ఉదయం అతని మృతదేహం లభించింది.

09/12/2016 - 13:06

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్దిపూర్‌లో ఓ మహిళ తన భర్తను హత్యచేసి ఇంట్లోనే పూడ్చిపెట్టింది. సోమవారం ఉదయం గ్రామస్తులు పిర్యాదు చేయగా సంఘటనా ప్రదేశానికి పోలీసులు చేరుకుని, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమత్తం ఆస్పత్రికి తరలించి నిందితురాలు కోసం గాలింపుచర్యలు చేపట్టారు.

Pages