S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/02/2018 - 06:23

హైదరాబాద్, నవంబర్ 1: రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి రాగానే మేనిఫెస్టో అమలుకు చట్టబద్ధ కమిటీని తెస్తామని, ఈ కమిటీకి ప్రొఫెసర్ కోదండరాం చైర్మన్‌గా వ్యవహరించనున్నారని టీటీడీపీ ప్రధానకార్యదర్శి బండ్రు శోభారాణి పేర్కొన్నారు. ఈ తరహా కమిటీ పశ్చిమబెంగాల్‌లో ఉందని అన్నారు.

11/02/2018 - 06:22

విశాఖపట్నం, నవంబర్ 1: ఏఐసీసీ సభ్యుడు, పీసీసీ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ పార్టీకి గురువారం రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కలయికను నిరసిస్తూ ఆయన పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా వట్టి వసంతకుమార్ ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అణచివేసేందుకు పుట్టిందే టీడీపీ.

11/02/2018 - 06:21

హైదరాబాద్, నవంబర్ 1: తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజు ఓట్లు వేసేందుకు వచ్చిన వారికి ‘బ్రీత్ ఎనలైజర్’ పరీక్షలు నిర్వహించలేమని చీఫ్ ఎలక్టోరల్ అధికారి రజత్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ ఒక సమావేశంలో మాట్లాడుతూ, ప్రస్తుతం పోలీసులు వాహనాలను నడిపేవారికి తరచూ బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు.

11/02/2018 - 05:28

వరంగల్, నవంబర్ 1: తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మళ్లీ మావోల అలజడి పోలీసులకు సవాల్‌గా మారింది.

11/02/2018 - 05:32

మహబూబ్‌నగర్, నవంబర్ 1: ఎన్నో ఏళ్లుగా దేశాన్ని పరిపాలించి ప్రజల కష్టాలు తీర్చని దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీకి భయపడేది లేదని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడిస్తామని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజల ఆశీర్వాద సభకు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

11/02/2018 - 05:26

ఆదిలాబాద్, నవంబర్ 1: ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులోని జైనథ్ మండలం పిప్పర్‌వాడ జాతీయ రహదారి టోల్‌ప్లాజా వద్ద గురువారం పోలీసుల తనిఖీల్లో మహారాష్ట్ర నాగ్‌పూర్ నుంచి ఆదిలాబాద్ వైపు కారులో తరలిస్తున్న రూ.18.44లక్షల నగదు పట్టుబడింది.

11/02/2018 - 05:25

వరంగల్, నవంబర్ 1: రాష్ట్రంలో ఆయుష్ పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజి నారాయణారావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఐఏపీజీ ఈటీ పరీక్షలో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆయుర్వేదం, హోమియా, యూనానీ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఈనెల 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు స్వీకరించనున్నారు.

11/02/2018 - 05:24

సంగారెడ్డి, నవంబర్ 1: ఒక చాయ్‌వాలాను దేశ ప్రధానిగా చేసిన భారతీయ జనతా పార్టీ సిద్దాంతాలను చూసి ఎంతో గర్వించిన తనకు ఇప్పుడు ధనమే మూలమన్న విషయం తెలిసిందని, డబ్బు లేని వారిని బీజేపీ పార్టీ చిన్నచూపు చూస్తుందని ఆ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

11/02/2018 - 05:33

గోదావరిఖని, నవంబర్ 1: రాష్ట్రంలో డిసెంబర్‌లో జరుగబోయే సాధారణ ఎన్నికలను మహాయజ్ఞంలా తీసుకున్నాం... ఏ మాత్రం అల్లర్లకు, అసాంఘిక కార్యక్రమాలకు అవకాశమివ్వం... ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ జరిగేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రజలంతా స్వేచ్ఛగా...

11/02/2018 - 05:22

సంగారెడ్డి, నవంబర్ 1: ఎన్నికల సమరం సమయం దగ్గర పడుతున్న కొద్దీ రసవత్తర రాజకీయాలకు తెరలేస్తోంది. ప్రధానంగా సంగారెడ్డి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో రంగంలోకి దిగేందుకు సిద్ధవౌతున్నట్లు తెలుస్తోంది.

Pages