S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/01/2018 - 13:52

హైదరాబాద్: చంద్రబాబుకు అధికారమే పరమావధి అని, అందుకే కాంగ్రెస్‌తో జతకడుతున్నారని బీజేపీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. ఇపుడు తెలుగుదేశం పార్టీ నందమూరి తెలుగుదేశం కాదని నారావారి తెలుగుదేశం అని ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌గాంధీకి తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రయేజనాలు అవసరం లేదని, కుర్చిని నిలుపుకోవటం ఆయన లక్ష్యమని అన్నారు.

11/01/2018 - 07:01

నిజామాబాద్, అక్టోబర్ 31: ఇప్పటికే వారు శాసనమండలి సభ్యులుగా చట్టసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ, ముందస్తు ఎన్నికల రూపంలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శాసనసభ్యులుగా ఎన్నికవ్వాలని తహతహలాడుతున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకంగా ముగ్గురు శాసన మండలి సభ్యులు ఎమ్మెల్యే టిక్కెట్ రేసులో కొనసాగుతుండడం చర్చనీయాంశమవుతోంది.

11/01/2018 - 06:59

సూర్యాపేట, అక్టోబర్ 31: ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ముందస్తు ఎన్నికలకు ముఖ్యకూడలిగా ఉన్న సూర్యాపేట వేదికగా పాచికలు కదుపుతున్నాయి. బలమైన అభ్యర్థులు బరిలోకి దిగుతున్న నేపథ్యంలో స్ధానిక స్ధానం రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మిగిలిన శాసనసభ స్థానాలకు భిన్నంగా రాజకీయ పరిస్థితులు ఉన్న దృష్ట్యా త్రిముఖ పోటీ తథ్యమన్నది స్పష్టమైపోయింది.

11/01/2018 - 06:58

కడెం, అక్టోబర్ 31: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో తొమ్మిది నెలల ముందే శాసనసభను రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ రద్దుచేసిన గంటలోనే 105 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రతిపక్షాలను సందిగ్దంలో పడేశారు.

11/01/2018 - 06:57

సిద్దిపేట, అక్టోబర్ 31 : సిద్దిపేట జిల్లాలో మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కిరాకపోవటంతో.. అభ్యర్థులను ఖరారు చేయకపోవటంతో వివిధ పార్టీల నుండి టికెట్లు ఆశీస్తున్న నేతల్లో తీవ్ర ఆయోమయం నెలకొంది. నోటీఫికేషన్ వెలువడి మూడువారాలు కావస్తున్న టికెట్ల ఖరారుపై ఏలాంటి స్పష్టత లేకపోవటంతో వివిధ పార్టీల నుండి టికెట్ ఆశీస్తున్న ఆశావహులు ఆందోళనకు గురవుతున్నారు.

11/01/2018 - 06:04

హైదరాబాద్, అక్టోబర్ 31: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్దార్ పటేల్ స్ఫూర్తిని నీరుగారుస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు.

11/01/2018 - 06:01

హైదరాబాద్, అక్టోబర్ 31: రాజోలిబండా డైవర్షన్ స్కీమ్ (ఆర్‌డిఎస్), సుంకేసుల బ్యారేజికి మధ్య నిర్మించే పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి కేంద్రానికి బుధవారం లేఖ రాశారు. అపెక్స్ కమిటీ అనుమతి లేని ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలా అనుమతి ఇస్తారని జోషి అభ్యంతరం వ్యక్తం చేశారు.

11/01/2018 - 06:00

హైదరాబాద్, అక్టోబర్ 31: వ్యవసాయ రంగం సమగ్ర అభివృద్ధికి విత్తనమే మూలమని తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధృవీకరణ అథారిటీ డైరెక్టర్ డాక్టర్ కే. కేశవులు పేర్కొన్నారు. ‘మేలైన విత్తన నాణ్యతకు పంటకోత అనంతరం సాంకేతిక పరిజ్ఞానం’ అన్న అంశంపై తెలంగాణ వ్యవసాయ శాఖ, తెలంగాణ విత్తన ధృవీకరణ అథారిటీ, ఇండోజర్మన్ విత్తన రంగ ప్రాజెక్ట్ సంయుక్తంగా నిర్వహించిన రెండురోజుల వర్క్‌షాప్ బుధవారం ముగిసింది.

11/01/2018 - 05:59

హైదరాబాద్, అక్టోబర్ 31: మాజీ ప్రధాని, తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ 24వ వర్థంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. బుధవారం నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహానికి సీఎల్‌పీ మాజీ నేత కే.

11/01/2018 - 05:58

హైదరాబాద్, అక్టోబర్ 31: భారతదేశ ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురష్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఐక్యతా పరుగు కార్యక్రమాన్ని దక్షణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో అలుపెరగని పోరాట యోదుడుగా సర్దార్ వల్లబాయ్ పటేల్ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.

Pages