S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/01/2018 - 05:31

సిద్దిపేట, అక్టోబర్ 31: ఎన్ని కూటమిలు వచ్చినా టీఆర్‌ఎస్ పార్టీదే విజయమని.. వచ్చే ఎన్నికల్లో వంద స్థానాలు కైవసం చేసుకుంటామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. బుధవారం రాత్రి సిద్దిపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వందమంది మంత్రి హరీష్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

11/01/2018 - 05:26

ధర్మపురి, అక్టోబర్ 31: కేసు మాఫీ చేస్తానని బాధితుడి నుంచి 10వేలు లంచం తీసుకుంటూ జగిత్యాల జిల్లా ధర్మపురి ఎస్‌ఐ అంజయ్య ఏసీబీకి దొరికిపోయారు. తన పోలీస్ స్టేషన్‌లోనే బుధవారం సాయంత్రం ఇది చోటుచేసుకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన అల్లంకొండ చంద్రయ్య కరీంనగర్‌కు చెందిన మహేంద్ర ఫైనాన్స్‌లో రుణ సాయం ద్వారా ట్రాక్టర్ తీసుకున్నారు.

11/01/2018 - 05:25

ఆత్మకూర్(ఎస్), అక్టోబర్ 31: తెలంగాణకు ద్రోహంచేసిన చంద్రబాబు, అభివృద్ధిని అడ్టుకుంటున్న కాంగ్రెస్ అవిత్ర పొత్తుతో మహాకూటమిగా మాయా నాటకం ఆడుతూ కలిసి వస్తున్నారని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండి కూటమి నేతలకు కర్రూగాల్చి వాతలు పెట్టాలని రాష్ట్ర విద్యుత్, ఎస్సీకులాల అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు.

11/01/2018 - 05:24

నారాయణపేటటౌన్, అక్టోబర్ 31: తెలంగాణ ప్రాంతాన్ని నాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి తెలంగాణ వెనుకబాటుకు కారణమైన కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తెలంగాణ ద్రోహిలా చరిత్రలో నిలిచిపోయారన్నారు.

11/01/2018 - 04:46

ఎన్నికల భూమి......
=============

11/01/2018 - 02:16

హైదరాబాద్, అక్టోబర్ 31: తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్వర్యంలో నవంబర్ 4న నిర్వహించనున్న బీసీల బహిరంగ సభకు హాజరుకావాల్సిందిగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. బుధవారం ఎర్ర సత్యనారాయణ నేతృత్వంలో బద్దం మహేంద్ర గౌడ్, ఎగ్గే బిక్షపతి, ప్రకాశ్, రాకేశ్ తదితరులు అమరావతిలో చంద్రబాబును కలిసి ఈ మేరకు ఆహ్వానిస్తూ వినతి పత్రం అందజేశారు.

10/31/2018 - 17:58

హైదరాబాద్: ఏపీలో విలీనమైన ఏడు మండలాల ఓటర్ల వివాదాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

10/31/2018 - 17:57

హైదరాబాద్: టీఆర్‌ఎస్ మీడియా, ఆ పార్టీకి సహకరిస్తున్న మీడియా సంస్థలపై కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మీడియా సంస్థలు అన్నీ అవాస్తవాలు రాస్తున్నాయని, ఇతర పార్టీలపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని అన్నారు. తగు చర్యలు తీసుకోకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

10/31/2018 - 17:57

రాజన్న సిరిసిల్ల: కాళేశ్వరం వద్దంటూ కాంగ్రెసోళ్లు కోర్టులో 200 కేసులు వేశారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా నాగంపేటలో ఎన్నికల సభలో మాట్లాడుతూ ఈ సారి ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. నా కోసం నలభై రోజులు కష్టపడితే మళ్లీ ఐదేళ్లు మీకోసం కష్టపడతానని, కష్టపడి సాధించిన తెలంగాణను ద్రోహుల పరం చేయవద్దని కోరారు.

10/31/2018 - 15:21

హైదరాబాద్: మహాకూటమి నేతలతో కోదండరామ్ భేటీ అయ్యారు. ఈ కూటమి ఏర్పాటుతో రాష్ట్రంలో రాజకీయ మార్పులు సంభవించటం తథ్యమని అన్నారు. అభ్యర్థులు ఇంకా ఖరారు కాకపోవటంతో టీఆర్‌ఎస్‌కు ధీటుగా ప్రచారం చేయలేకపోతున్నామని వెల్లడించారు. కూటమిలోనే కొనసాగుతామని అన్నారు.

Pages