S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/25/2018 - 02:43

హైదరాబాద్, సెప్టెంబర్ 24: అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు హతమార్చడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు సామాజిక కార్యకర్త వరవరరావు ఇంటిని సోమవారం నాడు ముట్టడించారు. నక్సలైట్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు, రాస్తారోకో నిర్వహించినట్టు ఏబీవీపీ కార్యదర్శి ఎల్ అయ్యప్ప తెలిపారు.

09/25/2018 - 01:13

హైదరాబాద్, సెప్టెంబర్ 24: మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి కి సికింద్రాబాద్ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది, అనంతరం బెయిల్ ప్రక్రియను ఆయన న్యాయవాదులు పూర్తి చేయడంతో జగ్గారెడ్డి చంచల్‌గూడ జైలు నుండి విడుదలయ్యారు. రూ. 50 వేల చొప్పున రెండు పూచీకత్తులతో న్యాయమూర్తి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.

09/25/2018 - 01:11

హైదరాబాద్, సెప్టెంబర్ 24: కాంగ్రెస్, టీడీపీలతో పొత్తు పెట్టుకోమని ఏ అమరుడు చెప్పారని తెలంగాణ జన సమితి అధినేత కోదండరామ్‌పై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా యువత అమరులు కావడానికి కారణమైన కాంగ్రెస్, టీడీపీలతో పొత్తును ఎలా సమర్ధించుకుంటారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

09/25/2018 - 01:08

హైదరాబాద్, సెప్టెంబర్ 24: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ల ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజావ్యాజ్య పిటీషన్‌ను హైకోర్టు స్వీకరించింది.

09/25/2018 - 01:07

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణలో టెన్త్ , ఇంటర్‌పరీక్షల హడావుడి మొదలైంది. టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూలు, ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూలు జారీ అయ్యాయి. మరో పక్క దాదాపు అన్ని కాలేజీల్లో సిలబస్‌ను కూడా పూర్తి చేసి, దసరా సెలవుల అనంతరం రివిజన్ ప్రారంభించనున్నారు. ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థులకు జనవరిలో రెండు స్పెషాలిటీ సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించనున్నారు.

09/25/2018 - 01:06

హైదరాబాద్, సెప్టెంబర్ 24: పరిశోధన రంగంలో మరింత నాణ్యతా ప్రమాణాలను పెంచేందుకు మలేషియాలోని పెటాలింగ్ జయలోని లింకన్ యూనివర్శిటీ కాలేజీతో ఉస్మానియా యూనివర్శిటీ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. పిహెచ్‌డీ సూపర్‌వైజర్లకు, రీసెర్చి స్కాలర్లకు, అంతర్జాతీయ సదస్సుల నిర్వహణకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సహకారాన్ని లింకన్ యూనివర్శిటీ అందించనుంది.

09/25/2018 - 01:05

హైదరాబాద్, సెప్టెంబర్ 24: ఓటర్ల జాబితా సవరణ గడువు మంగళవారం ముగుస్తోంది. ఈ గడువును కనీసం నెలరోజుల పాటు పొడిగించాలని వివిధ జిల్లాల నుండి విజ్ఞప్తులు వచ్చాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ తొలుత జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఓటర్ల జాబితా సవరణ తేదీ గడువు 2018 అక్టోబర్ చివరి వరకు ఉండేది. ఈ నెల ఎనిమిదో తేదీన జారీ అయిన తాజా నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 25 వరకే గడువు విధించారు.

09/25/2018 - 01:05

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణలో 2018-19 సంవత్సరానికి రైతుల నుండి కందులు, పల్లీ, సోయాబీన్ కొనుగోలుకోసం మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజన్సీగా నియమించారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేందుకు వీలుగా మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించారు. వ్యాపారులు తక్కువ ధరకు రైతుల నుండి కందులు, పల్లీ, సోయాబీన్ కొనుగోలు చేయకుండా నివారించేందుకు ప్రభుత్వ నిర్ణయం తోడ్పడుతుంది.

09/25/2018 - 01:04

రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శ
* పలు పార్టీల నేతలు బీజేపీలో చేరిక *
మెట్రో రెండో దశ ప్రారంభానికి తొందరెందుకన్న దత్తాత్రేయ

09/25/2018 - 03:54

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తమ పార్టీ కంటే ఎక్కువ అసంతృప్తులు, గొడవలు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌లో ఉన్నాయని టీ.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. తమ పోరాటం అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుపైనేనని పొన్నం సోమవారం విలేఖరుల సమావేవంలో తెలిపారు. టీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకు పార్టీలో అందరమూ కలిసి పని చేస్తామని ఆయన చెప్పారు.

Pages