S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/25/2018 - 03:37

వరంగల్, సెప్టెంబర్ 24: తెలంగాణ ప్రభుత్వం పశుపోషణకు పెద్దపీట వేసిందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. సోమావారం వరంగల్ అర్బన్ జిల్లా మామునూరులో వెటర్నరీ కళాశాలను ఆయన ప్రారంభించారు. పశువైద్య విద్యకు, వైద్యులకు, నిపుణులకు రాబోయే రోజుల్లో మహర్దశ పట్టనున్నదని ఆయన అన్నారు.

09/25/2018 - 03:35

వెంకటాపురం(నూగూరు), సెప్టెంబర్ 24: వెంకటాపురం పోలీసు సర్కిల్ పరిధిలో పోలీసులు, ప్రత్యేక పోలీసు బలగాలు అడవుల్లో జల్లెడ పడుతున్నాయి. సరిహద్దులోని చత్తీస్‌గఢ్ రాష్ట్రం అటవీ గ్రామాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారంతో పాటు అరకులో జరిగిన ఎమ్మెల్యే హత్యతో ఈ ప్రాంతంలో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్లు చేపడుతున్నారు.

09/25/2018 - 03:34

నిజామాబాద్, సెప్టెంబర్ 24: శాసనసభ రద్దు కావడంతో సమీప భవిష్యత్తులోనే ఎన్నికలు జరుగనుండగా, ఎలక్షన్ కమిషన్ నగారా మోగించడానికి ముందే ఆన్‌లైన్‌లో ఓటింగ్ లింక్‌లు సందడి చేస్తున్నాయి.

09/25/2018 - 03:33

కేసముద్రం, సెప్టెంబర్ 24: సికింద్రాబాద్ నుండి గుంటూరు వెళ్తున్న గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు సోమవారం సాయంత్రం కేసముద్రం స్టేషన్లో 40 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఇంజన్‌తో పాటు లగేజీ బోగీలో సాంకేతికలోపం తలెత్తడంతో కేసముద్రంలో నిలిపివేశారు. ఇంటికనె్న దాటిన తరువాత లగేజీ బోగీ బ్రేక్‌రాడ్డు ఊడిపోయి రాళ్లకు తాకడంతో పెద్ద శబ్దం వచ్చింది.

09/25/2018 - 03:29

వనపర్తి, సెప్టెంబర్ 24: అభివృద్దిలో తెలంగాణ రాష్ట్రంలో దేశానికే ఆదర్శమని తెలంగాణ అపద్దర్మ ఉప ముఖ్యమంత్రి మహామూద్ అలి అన్నారు. సోమవారం వనపర్తి నియోజక వర్గంలోని ఖిల్లాఘనపురం, పెద్ద మందడి, పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాల్లో సుమారు రూ.3కోట్ల అంచానతో అంబేద్కర్ భవనాలు, కమ్యూనిటి హల్స్, మైనార్టీ షాదిఖానాకు శంకుస్థాపన చేసిన అనంతరం వనపర్తి సంఘం పంక్షణ్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

09/25/2018 - 03:29

హైదరాబాద్, సెప్టెంబర్ 24; కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 27 న బాపూజీ జయంతి ఉంది. బాపూజీ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.

09/25/2018 - 03:28

హైదరాబాద్, సెప్టెంబర్ 24: అరకులో ప్రజాసేవకులైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమలను మావోయిస్టులు బలిగొనడం దారుణమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో తెలంగాణ టీడీపీ నేతలు మావోయిస్టుల కాల్పుల్లో ప్రాణాలొదిలిన ఇద్దరు నేతలకు నివాళులు అర్పించారు. అనంతరం రెండు నిమిషాల పాటు వౌనం పాటించారు.

09/25/2018 - 02:44

హైదరాబాద్, సెప్టెంబర్ 24: ఓటర్ల జాబితా ఎంత లోపభూయిష్టంగా ఉంటే ప్రజాస్వామ్య ప్రక్రియ అంత బలహీన పడుతుందని, ఓటర్ల జాబితాలో సరైన ఓటర్లను చేర్చడం ద్వారానే ప్రజాస్వామ్య ప్రక్రియ బలపడుతుందని టీటీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు.

09/25/2018 - 02:44

హైదరాబాద్, సెప్టెంబర్ 24: ఎన్నికల సంఘం చెప్పాల్సిన అంశాలను అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఎలా చెబుతారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పార్టీ సమన్వయ సంఘం చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. నవంబర్ 24న ముందస్తు ఎన్నికలు జరుగుతాయని మీడియాలో వచ్చిందని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. ఇది కేసీఆర్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే మీడియాలో వార్తలు వచ్చినట్లు తాము భావిస్తున్నామని అన్నారు.

09/25/2018 - 02:43

హైదరాబాద్, సెప్టెంబర్ 24: సినిమాలు జీవిత ప్రతిబింబాలని దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ పేర్కొన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ (డిపిఎస్‌ఎఫ్‌ఎస్)లో వివిధ కోర్సులను పూర్తిచేసి వృత్తినైపుణ్య శిక్షణ పొందిన విద్యార్థుల స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

Pages