S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/24/2018 - 01:42

హైదరాబాద్, సెప్టెంబర్ 23: జంటనగరాల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గణేష్ శోభాయాత్ర ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. చివరి రోజు గణేష్ శోభాయాత్రను తిలకించడానికి జంటనగరాలతో పాటు వివిధ జిల్లాల నుంచి భారీగా తరలిరావడంతో ట్యాంక్‌బండ్ పరిసరాలు జనసంద్రమయ్యాయి.

09/23/2018 - 23:46

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) ల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు సంక్షేమ పింఛన్లు, జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు వేతనాలు చెల్లించే అంశం పరిశీలనలో ఉందని హైదరాబాద్ పోస్టల్ రీజియన్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఎస్‌వీ రావు తెలిపారు.

09/23/2018 - 23:44

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణ ఉద్యోగుల సంక్షేమం కోసం పోరాటం చేస్తామని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఈఏ)కు కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన చిలగాని సంతోష్‌కుమార స్వామి తెలిపారు. టీఈఏ 17 వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మట్లాడుతూ, తెలంగాణ ఉద్యోగుల కోసం టీఈఏ తొలుత నుండి పోరాటం చేస్తూనే ఉందని గుర్తు చేశారు.

09/23/2018 - 23:44

హైదరాబాద్, సెప్టెంబర్ 23: రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుండి ప్రస్తుత ఖరీఫ్‌కు సంబంధించి ఐదులక్షల టన్నుల మక్కలను కొనుగోలు చేస్తామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన సంబంధిత అధికారులతో తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని, కొనుగోలుకోసం 259 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

09/23/2018 - 23:42

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణ స్టేట్ రియల్ ఏస్టేట్ రెగ్యులేషన్ చట్టం (రెరా) పకడ్బందిగా అమలు చేయనున్నట్టు రెరా చైర్మన్, ఐఏఎస్ అధికారి రాజేశ్వర్ తివారీ పేర్కొన్నారు. రెరా కింద తమ వెంచర్లను నమోదు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఐదు వందల చదరపు మీటర్ల విస్థీర్ణం కంటే ఎక్కువగానీ, 8 యూనిట్ల కంటే గృహాలు కానీ కలిగిన వెంచర్లు తప్పనిసరిగా రెరా కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

09/23/2018 - 23:38

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఇంజనీరింగ్, మెడిసన్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, ఇంటర్ కోర్సులు చదివే 14 లక్షల మంది ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఇబీసీ విద్యార్థుల గత ఏడాది ఫీజుల బకాయిలు రూ.2200 కోట్లు వెంటనే చెల్లించాలని, బీసీ, ఇబీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులుర మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లను, 64 ఆర్డీవో కార్యాలయాలను ముట్టడించి ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించాల

09/23/2018 - 07:17

నిజామాబాద్, సెప్టెంబర్ 22: అన్ని వర్గాల వారి అభ్యున్నతి కోసం వేల కోట్ల రూపాయలతో విరివిగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా పేద వర్గాల వారికి అందిస్తున్న రుణాలలో భారీగా సబ్సిడీలను సైతం వర్తింపజేస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు.

09/23/2018 - 07:13

కడెం, సెప్టెంబర్ 22: నిర్మల్ జిల్లాలోని మండల కేంద్రమైన కడెంలో గల కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరుతుండడంతో జలాశయం నీటి మట్టం పెరుగుతూ వస్తుంది.

09/23/2018 - 07:12

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 22: టీఆర్‌ఎస్ భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, స్థానిక భువనగిరి టీఆర్‌ఎస్ అభ్యర్ధి పైళ్ల శేఖర్‌రెడ్డిలకు శనివారం ప్రతిపక్షాలు అడ్డుకుని నిరసన తెలిపాయి.

09/23/2018 - 07:18

కంఠేశ్వర్, సెప్టెంబర్ 22: దళితలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రక్షణ లేకుండాపోయిందని, అందుకు నిదర్శనం ప్రణయ్ హత్యేనని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఇటీవల మిర్యాలగూడలో దళితుడైన ప్రణయ్ హత్యకు నిరసనగా శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఫూలాంగ్ చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Pages