S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/21/2018 - 03:46

హైదరాబాద్, సెప్టెంబర్ 20: కరీంనగర్ జిల్లా జగిత్యాల కొండగట్టు వద్ద జరిగిన ఆర్‌టీసీ బస్సు ప్రమాదానికి ఓవర్‌లోడ్, ఓవర్‌టేక్ కారణమని సంస్థ చైర్మన్ సోమారపుసత్యనారాయణ వెల్లడించారు. బస్సు బోల్తాపడడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరుపడి ఊపిరి ఆడలేదని, అందువల్లే మరణాలు ఎక్కువ సంభవించాయని గురువారం ఇక్కడ తెలిపారు. కొండ గట్టు రోడ్ ప్రమాదంలో 61 మంది మృత్యువాత పడ్డారు.

09/21/2018 - 03:44

వరంగల్, సెప్టెంబర్ 20: పోరుగడ్డగా పేరున్న జనగామ జిల్లాలో టీఆర్‌ఎస్ అసమ్మతి వర్గం రోజురోజుకు గళాన్ని పెంచుతోంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఏక కాలంలో తెలంగాణలో పోటీచేసే 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో వివిధ నియోకవర్గల్లో టికెట్ అశిస్తున్న అశావాహులు కంగుతున్నారు. నౌ ఆర్ నెవర్ అన్నట్టుగా ఆశావాహులు తమకే టికెట్ కావాలంటూ ఆందోళనకు తెర లేపారు.

09/21/2018 - 03:43

హైదరాబాద్, సెప్టెంబర్ 20: ఎన్నికలకు ఎప్పుడైనా సిద్దమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒకవైపు సవాల్ చేస్తుంటే, అదే పార్టీకి చెందిన మర్రి శశీధర్‌రెడ్డేమో ఇప్పుడే నిర్వహించవద్దని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడమేమిటనీ టీఆర్‌ఎస్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రశ్నించారు.

09/21/2018 - 03:40

హైదరాబాద్, సెప్టెంబర్ 20: 2018-19 సంవత్సరం రబీ సీజన్‌లో సెనగపంట వేసే రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్‌లో సెనగవిత్తనాలు (జేజీ-11 తదితర రకాలు) క్వింటాల్‌కు 6500 రూపాయలు ఉండగా సగ భాగం అంటే 3250 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తూ, రైతులకు క్వింటాల్‌కు 3250 రూపాయలకు ఇస్తామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు.

09/21/2018 - 03:40

హైదరాబాద్, సెప్టెంబర్ 20: వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిసూ ప్రభుత్వం గురువారం జీఓ జారీ చేసింది. ఆశ్వయుజ మాసం పున్నమి రోజు వాల్మీకి జన్మించినందువల్ల ఆ రోజున వాల్మీకి జయంతిని నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి పేరుతో ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. దసరా తర్వాత వాల్మీకి జయంతి వస్తుంది.

09/21/2018 - 03:39

హైదరాబాద్, సెప్టెంబర్ 20: ఇస్రో చైర్మన్ కె శివన్‌కు ,సుప్రసిద్ధ శిల్పాచార్యుడు డాక్టర్ ఎక్కా యాదగిరిరావులకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయాలని గీతం విశ్వవిద్యాలయం నిర్ణయించినట్టు ఛాన్సలర్ ప్రొఫెసర్ కే రామకృష్ణారావు, ఉప కులపతి ప్రొఫెసర్ ఎస్ శివప్రసాద్‌లు తెలిపారు.

09/21/2018 - 03:38

హైదరాబాద్, సెప్టెంబర్ 20: ఇటీవల జరుగుతున్న నేర సంఘటనలను కొన్ని టీవీ ఛానల్స్ సంచలన వార్తలుగా పదేపదే ప్రచారం చేయడాన్ని తెలంగాణ డిజిపి మహేందర్‌రెడ్డి తప్పుపట్టారు. ఛానల్స్ అత్యుత్సాహంతో నేర సంఘటనలను ప్రచారం చేయడంతో సమాజంలో భయబ్రాంతులు నెలకొంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఛానల్స్ కార్యక్రమాలు చూస్తుంటే ప్రభుత్వం పేర్కొన్న నియమనిబంధనలను పాటించడం లేదన్న అనుమానం వ్యక్తం అవుతోందన్నారు.

09/21/2018 - 02:00

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 20: కొండలు, గుట్టలు, అరణ్యాల్లో సంచరించాల్సిన ఎలుగుబంటి జనారణ్యంలోకి వచ్చింది. నిత్యం వేలాది మందితోకిటకిటలాడుతూ, అనేక వ్యాపారాల కూడలిలో హల్‌చల్ చేసింది. పలు వీధుల గుండా సంచరిస్తూ, వ్యాపారస్థులు, స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులు, అటవీశాఖాధికారులను ముప్పు తిప్పలు పెట్టి, మూడు చెర్ల నీళ్ళు తాగించింది.

09/20/2018 - 17:45

హైదరాబాద్: ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు 15 రోజులకు ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఓటరు జాబితాలో తప్పులు తడకలు ఉన్నట్లు వెల్లడైందని ఆయన పేర్కొన్నారు. ఓట్ల తొలగింపుపై భారీగా ఫిర్యాదులు రావటంతో ఈసీ అయోమయానికి గురవుతున్నట్లు అభిప్రాయపడ్డారు.

09/20/2018 - 13:56

ఆదిలాబాద్:ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవటంతో మనస్తాపానికి గురైన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఖానాపూర్ టిక్కెట్టు వస్తుందని ఆయన భావించారు.

Pages