S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/19/2018 - 04:14

భువనగిరి, సెప్టెంబర్ 18: జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో చోటుచేసుకుంటున్న మహిళల అక్రమరవాణా రోజురోజుకు పెరిగిపోతోందని, ప్రపంచవ్యాప్తంగా వ్యభిచార వృత్తిలో 75 మిలియన్ల మహిళలు, యువతులు, బాలికలు మగ్గుతున్నారని బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూఫ్లెమింగ్ ఆవేదన వ్యక్తపరిచారు.

09/19/2018 - 03:31

హైదరాబాద్, సెప్టెంబర్ 18: టెన్సింగ్ నార్కే జాతీయ సాహస అవార్డు-2017కు ఎంపికైన నావికదళ లెప్టినెంట్ కమాండర్ కుమారి ఐశ్వర్య బొడపాటిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభినందించారు. ఐశ్వర్య తెలంగాణ ప్రాంతవాసి. భవిష్యత్‌లో ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డులు మరిన్ని గెలుచుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ఈ నెల 25న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఐశ్వర్య అవార్డును అందుకోనున్నారు.

09/19/2018 - 03:24

హైదరాబాద్, సెప్టెంబర్ 18: కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డికి ప్రధాని నరేంద్రమోదీ గురించి మాట్లాడే హక్కు లేదని బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీ్ధర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానిని విమర్శిస్తే రేవంత్ పెద్ద నాయకుడు అవుతాడని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి తుంటరి నాయకుడని, ఏదో మాట్లాడితే ఏదో పదవి ఇస్తారని ప్రచారం చేసుకుంటున్నందని అన్నారు.

09/18/2018 - 23:34

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం సీట్లను సర్దుబాటు చేసుకుంటే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు కూటమి తరపున రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది.

09/18/2018 - 23:34

ధర్మపురి, సెప్టెంబర్ 18 : తమ ఏకైక వారసుడు, ముద్దుల తనయుడు తారక రామారావుకు తెలంగాణ రాజ్యాధికార పట్ట్భాషేకం చేయడానికి తెరాస వ్యవస్థాపక అధినేత చంద్రశేఖర్‌రావు కసరత్తు చేస్తున్నారా? అన్న ప్రశ్నకు దాదాపు అవుననే సమాధానం లభిస్తున్నది. తాజా పరిస్థితుల పరిశీలనాధారంగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు కోవాలని కేసిఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది.

09/18/2018 - 23:33

చొప్పదండి, సెప్టెంబర్ 18: రాష్టవ్య్రాప్తంగా 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.. చొప్పదండి సిట్టింగ్ స్థానానికి ప్రకటించక పోవటంతో నియోజకవర్గంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది.

09/18/2018 - 23:32

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లినందున వీటి ఆధారంగా శాసనసభ ఎన్నికలు జరుపకూడదంటూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. ఓటర్ల జాబితాలో తప్పులపై త్వరలోనే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి మంగళవారం విలేఖరులకు చెప్పారు.

09/18/2018 - 17:49

నల్గొండ: ప్రణయ్ హత్యకు జూలైలో స్కెచ్ సిద్ధం చేశారని, ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశామని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. కోటి రూపాయలు డిమాండ్ చేసిన అస్గర్ అలీ చివరకు 50 లక్షలకు ఒప్ఫందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. బీహార్‌కు చెందిన సుభాష్ శర్మతో ఈ హత్య చేయంచినట్లు వెల్లడించారు.

09/18/2018 - 17:28

నల్గొండ: మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యను ఖండిస్తున్నామని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆయన ఈరోజు ప్రణయ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ్మినేనితో పాటు కంచె ఐలయ్య కూడా పరామర్శించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. అమృతను చట్టసభలకు పంపాలని, మిర్యాలగూడ ప్రజలు సహకరించాలని కోరారు.

09/18/2018 - 17:26

హైదరాబాద్: నట కిరీటీ రాజేంద్రప్రసాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయనను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. ఆస్ట్రేలియా సాంస్కృతిక శాఖ తరపున ఏడుగురు ఎంపీల బృందం సిడ్నీ పార్లమెంటు హాలులో ఘనంగా సత్కరించింది. భారతదేశం నుంచి మొట్టమొదటి పురస్కారం అందుకున్న నటుడిగా రాజేంద్రప్రసాద్ ఈ గౌరవాన్ని అందుకోవటం విశేషం.

Pages