S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/19/2018 - 04:37

హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉందని చెప్పడానకి హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ గుర్తు చేసుకోవాల్సి ఉంటుందని, దీంతో పోలీసుల పనితీరు భేష్ అంటూ తెలంగాణ పోలీసు అధికారులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కితాబ్ ఇచ్చారు. మంగళవారం కేంద్ర మంత్రి హాన్స్‌రాజ్ గంగారాం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను సందర్శంచారు.

09/19/2018 - 04:34

హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణలో ఈ నెల 27వ తేదీన బీజేపీ మహిళామోర్చ మహిళా సమ్మేళనాన్ని నిర్వహించనుందని, దానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ముఖ్య అతిథిగా హాజరవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ చెప్పారు. మహిళామోర్చ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి డాక్టర్ కే లక్ష్మణ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళల పట్ల వివక్ష చూపుతోందని అన్నారు.

09/19/2018 - 04:31

హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆటో, హ్యాట్ గుర్తులు ఉండబోవని, ఈ గుర్తులను అభ్యర్థులకు కేటాయించబోరని పార్లమెంట్ సభ్యులు బి. వినోద్‌కుమార్ తెలిపారు.

09/19/2018 - 04:31

హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ జిల్లాల్లో రైతుల నుండి ఉలవలను కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం అధికారం ఇచ్చింది. ఈ మేరకు మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉలవల కొనుగోలుపై గతంలో విధించిన మార్కెట్ ఫీజును, ఇతర పన్నులను మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ ముఖ్యకార్యదర్శి సి.

09/19/2018 - 04:30

హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రాతపరీక్ష వాయిదా పడింది. అక్టోబర్ 4న జరగాల్సిన ఈ పరీక్షకను అక్టోబర్ 10న నిర్వహించనున్నట్టు పరీక్ష కన్వీనర్ నీతూ ప్రసాద్ చెప్పారు. పేపర్-1 ఉదయం 10 నుండి 12 వరకూ, పేపర్ -2 మధ్యాహ్నం 3 నుండి 5 వరకూ జరుగుతాయని అన్నారు. మొత్తం 9355 పోస్టులకు గానూ 5,62,424 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు.

09/19/2018 - 04:28

హైదరాబాద్, సెప్టెంబర్ 18: ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైందని, ప్రతి పౌరుడు తన పేరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈఓ) రజత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, వివిధ కారణాల వల్ల పొరపాట్లు జరుగుతూ ఉంటాయని, జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాల్సి ఉందన్నారు.

09/19/2018 - 04:26

హైదరాబాద్, సెప్టెంబర్ 18: టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పొత్తుల చర్చలను ముమ్మరం చేశారు. కాంగ్రెస్-టీడీపీలు మిగతా విపక్షాలను కలుపుకుని మహాకూటమి ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ మంతనాలు జరిపారు. రమణ తమ పార్టీకి 30 సీట్లు కావాలని కోరినట్లు సమాచారం.

09/19/2018 - 04:25

హైదరాబాద్, సెప్టెంబర్ 18: సర్వేలు స్టిల్ ఫొటోల వంటివని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ అన్నారు. విపరీతంగా డబ్బులు కురిపించి సర్వేలు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. మంగళవారం ప్రొఫెసర్ కోదండరామ్ తనను కలిసిన విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ సర్వేలతో నిరంతర మార్పులు జరుగుతుంటే సర్వేల్లో ఏలా స్పష్టత వస్తుందని ప్రశ్నించారు. తృప్తి కోసమే సర్వేలని ఆయన అన్నారు.

09/19/2018 - 04:18

న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: ప్రణయ్‌ను హత్య చేయించిన మారుతీరావును కఠనంగా శిక్షించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం ఏపీ భవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ హత్యకు అగ్రకుల దురహంకారమే కారణమని మండిపడ్డారు. ఈ హత్య వ్యవహారంలో నరుూం అనుచరులకు, టీఆర్‌ఎస్ నేతలకు సంబంధాలున్న విషయం బయటపడుతుందనే నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

09/19/2018 - 04:17

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 18: కాంగ్రెస్, టీడీపీల కలయికను తెలంగాణ సమాజం ఒప్పుకోదని, తెలంగాణ రాష్ట్రం రాకుండా అడుగడుగున అడ్డుకున్న చంద్రబాబుకు ఇక్కడ స్థానమే ఉండదని, విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న కాంగ్రెస్‌ను రాజకీయంగా ప్రజలు బతకనివ్వరని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆరోపించారు.

Pages