S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/24/2018 - 04:15

హైదరాబాద్, జూలై 23: మత్స్య పరిశ్రమ అభివృద్థి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని ఈ ఏడాది భూపాల్‌పల్లి జిల్లా నుంచి చేపట్టనున్నారు. ఈ సంవత్సరం చేప పిల్లల విడుదల కార్యక్రమం ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం సచివాలయంలో మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ, మత్స్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

07/24/2018 - 04:13

హైదరాబాద్, జూలై 23: రాష్ట్ర ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కే. తారక రామారావుకు చేతనైతే తనతో 10కె రన్‌లో పాల్గొనాలని కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పాలిటక్స్ ఫిట్‌నెస్‌లో తనతో పోటీ పడేవారు తెలంగాణలో ఎవరూ లేరని ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. దేశంలో రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరుగుతున్నదని ఆయన తెలిపారు.

07/24/2018 - 04:11

హైదరాబాద్, జూలై 23: బావి తెలంగాణను స్వచ్ఛమైన వాతావరణంతో నింపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో పూర్తిస్థాయిలో భాగస్వామ్యం అవుతామని ఎఫ్ట్యాప్సీ ప్రకటించింది. సోమవారం నాల్గో విడత హరితహారంపై అరణ్యభవన్‌లో సమావేశం జరిగింది.

07/24/2018 - 04:09

హైదరాబాద్, జూలై 23: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తదుపరి కార్యాచరణకు ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత జీ కిషన్‌రెడ్డి సోమవారం నాడు డిమాండ్ చేశారు.

07/24/2018 - 04:08

హైదరాబాద్, జూలై 23: నరేంద్రమోదీ ప్రభుత్వం పతనం అవుతుందని వ్యాఖ్యానించడం ద్వారా రాహుల్ గాంధీ నిరాశ, నిస్పృహలో ఉన్నారని తేటతెల్లం అవుతోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. దేశంలో అణగారిన వర్గాలు పేదల్లో నిరాశ, నిస్పృహలు భయాందోళనలు కనిపిస్తున్నాయని రాహుల్ అనడం దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు.

07/24/2018 - 04:08

ఏలూరు, జూలై 23: పశ్చిమగోదావరి జిల్లాలో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం అమలుతీరుపై మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు.

07/23/2018 - 04:01

ఆదిలాబాద్, జూలై 22: ప్రాణహిత ప్రాజెక్టు కోసం తుమ్మడిహెట్టి వద్ద నిర్మించతలపెట్టిన బ్యారేజీ ప్రాంతాన్ని మార్చి వార్దా నదిపైనే నిర్మించేందుకు సర్కారు సర్వసన్నద్ధమవుతోంది. ఈ దిశగానే సాగునీటి నిపుణులు, ఇంజనీర్లు రీడిజైనింగ్ పేరిట వార్దా బ్యారేజీ నిర్మాణం కోసం వడి వడిగా సర్వే నిర్వహించి, డీపీఆర్ తయారీ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్‌కు అప్పగించిన విషయం విదితమే.

07/23/2018 - 03:58

నర్సంపేట, జూలై 22: టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లు మిన్నకుండి హడావుడిగా రైతు బంధు కోసం భూరికార్డుల ప్రక్షాళనకు పూనుకుందని, భూరికార్డుల ప్రక్షాళన అంతా తప్పుల తడకగా మారిందని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రైతులకు దశాబ్దాల తరబడి సంప్రదాయం గా వస్తున్న హక్కులను నేడు రైతుబంధు కారణంగా కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

07/23/2018 - 03:55

చిత్రం..తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య భార్యకు వారి
కుమారుడి చదువుకు ఐదు లక్షల రుపాయల చెక్కును అందజేస్తున్న సీఎం కేసీఆర్

07/23/2018 - 02:59

హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించనున్న హరితహారం కార్యక్రమానికి జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) నిధులను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా డిపీఆర్‌లను సిద్ధం చేయాలన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టనున్న హరితహారం కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

Pages