S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/28/2018 - 04:29

హైదరాబాద్, జూలై 27: తెలంగాణలోని వికలాంగులకు 28న (శనివారం) మోటరైజెడ్ త్రిచక్ర వాహనాలు, బ్యాటరీ వీల్ చైర్స్, లాప్ టాప్స్, 4జి స్మార్ట్ ఫోన్లను తెలంగాణ వికలాంగుల సహకారం సంస్థ, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం అధ్యర్యంలో పంపిణీ చేయనున్నట్లు వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ కమిషనర్ బి. శైలజ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

07/28/2018 - 04:22

సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలన్నీ మధ్యాహ్నం తర్వాత మూతపడ్డాయ. ఇందులో భాగంగా బాసరలో సరస్వతి అమ్మవారి గర్భాలయ ద్వారాలను, యాదాద్రిలో లక్ష్మీనరసింహ స్వామి బాలాలయాన్ని , సిరిసిల్ల రాజన్న జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేస్తున్న అర్చకులు, అధికారులు

07/28/2018 - 04:18

చిత్రం..గురుపూర్ణిమను పురస్కరించుకుని మొరాదాబాద్‌లో
గురు పూజోత్సవం జరుపుతున్న విద్యార్థినులు

07/28/2018 - 04:42

హైదరాబాద్, జూలై 27: యుద్ధ విమానాల కొనుగోలులో రూ.40 వేల కోట్ల అవినీతి జరిగిందని ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపీ వి. హనుమంత రావు విమర్శించారు. బోఫోర్సు కుంభకోణంలో 60 కోట్ల కుంభకోణం జరిగిందని లోగడ బీజేపి నేతలు గోరంతను కొండంతలు చేశారని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. రాజీవ్ గాంధీ మరణించిన తర్వాత బోఫోర్సు కుంభకోణంపై కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.

07/28/2018 - 04:43

హైదరాబాద్, జూలై 27: రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తూ, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆ పార్టీ అధిష్టానం సమాయత్తం చేస్తున్నది. ఇందులో భాగంగానే శనివారం సాయంత్రం గాంధీ భవన్‌లో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎఐసిసి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

07/28/2018 - 04:45

హైదరాబాద్, జూలై 27: నాలుగేళ్ల పాలనలో ప్రధాని నరేంద్రమోదీ ఎన్నో ఘనతలను సాధించారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న డాక్టర్ లక్ష్మణ్ గురువారం నాడు టెక్నాస్‌లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాస తెలంగాణ వాసులను ఉద్ధేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సాధించిన అనేక విజయాలను వివరించారు.

07/28/2018 - 04:46

హైదరాబాద్, జూలై 27: తెలంగాణ ప్రభుత్వం అంతా కంప్యూటర్ గ్రాఫిక్స్ మాయ చేస్తోందని, సమస్యలు ఎక్కడివక్కడ యథాతథంగా ఉన్నాయని బీజేపీ నేతలు శుక్రవారం నాడు ఎద్దేవా చేశారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు జి కిషన్‌రెడ్డి, ఉప నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్‌రావులు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు.

07/27/2018 - 04:50

హైదరాబాద్, జూలై 26: జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయానికి కొత్త పాలక మండలిని ప్రభుత్వం నియమించింది. అదే విధంగా సంగారెడ్డి జిల్లా జరాసంఘంలలోని ఆలయానికి కూడా కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ తెలంగాణ సర్కారు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి 14 మందిని సభ్యులుగా నియమించారు.

07/27/2018 - 04:50

హత్నూర, జూలై 26: తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని చందాపూర్, రెడ్డిఖానాపూర్ గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ప్రారంబోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

07/27/2018 - 04:47

వరంగల్, జూలై 26: ఎన్నికల దగ్గరపడుతున్న కొద్దీ ఉమ్మడి వరంగల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయ. అధికార పార్టీ నేతలే అధికార పార్టీ మున్సిపల్ చైర్‌పర్సన్‌పై పెట్టిన అవిశ్వాసం టీఆర్‌ఎస్ కొంప ముంచింది. ఎమ్మెల్యే అసమర్థత కాంగ్రెస్ సొమ్ము చేసుకుంది. అధికార పార్టీ చేతిలో ఉన్న వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపల్ పీఠం అనూహ్యంగా హస్తగతం అయిపోయింది.

Pages