S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/08/2018 - 00:10

హైదరాబాద్, ఆగస్టు 7: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ సిబ్బందికి మూడు జతల యూనిఫామ్స్‌ను అందించాలని యాజమాన్యం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రతి ఏడాది అందించాల్సిన యూనిఫామ్స్ కార్మికులకు అందడం లేదు. దీంతో ఆర్టీసీలో పనిచేస్తున్న సుమారు 20వేల కండక్టర్లు, 22వేల డ్రైవర్లు, గ్యారేజీ సిబ్బందికి యూనిఫామ్స్ కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారు.

08/08/2018 - 00:10

హైదరాబాద్, ఆగస్టు 7: అఖిల భారత విద్యార్ధి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ బుధవారం నాడు రాష్టవ్య్రాప్తంగా నిరసన ర్యాలీలు, ధర్నాలు చేపట్టనున్నట్టు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్ళి ఎల్ అయ్యప్ప తెలిపారు.

08/08/2018 - 00:09

హైదరాబాద్, ఆగస్టు 7: బీసీ వర్గాలకు రిజర్వేషన్ల పెంపు కోసం ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు చేస్తున్న కృషి చారిత్రాత్మకమని బీసీ కమిషన్ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ అన్నారు. ఇటీవల ప్రధానిని కలిసి ఈ మేరకు రిజర్వేషన్ల పెంపు తప్పదని కోరడం ద్వారా బీసీల ఆకాంక్షలను ప్రధానికి వివరిస్తున్నారని అన్నారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతి సారి ఈ విషయంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారని అన్నారు.

08/08/2018 - 00:09

హైదరాబాద్, ఆగస్టు 7: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్నందున ప్రశ్నించేందుకే ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 13న నగరానికి వస్తున్నారని టీ.పీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం అన్నారు.

08/08/2018 - 00:08

హైదరాబాద్, ఆగస్టు 7: కండరాల్లో రక్తప్రసరణ జరిగేలా చురుగ్గా ఉండాలని జూబ్లీహిల్స్, అపోలో ఆసుపత్రి పెరిఫెరల్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ సి. చంద్ర శేఖర్ ప్రజలకు సూచించారు. వెరికోస్ వెయిన్స్ అభివృద్ధి చేయకుండా ఆలస్యం చేయవద్దని, నివారణే సరైన చికిత్స అని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వంశపారంపర్యంగా, వయస్సుపరంగా ఏర్పడే సమస్య ఉంటుందని ఆయన తెలిపారు.

08/08/2018 - 00:07

హైదరాబాద్, ఆగస్టు 7: తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు సైతం ఉన్నత విద్య అందుబాటులో ఉండేలా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్ చేసిన కృషి ఎనలేనిదని కాకతీయ వర్శిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శంకరయ్య పేర్కొన్నారు.

08/07/2018 - 04:46

భిక్కనూరు, ఆగస్టు 6: రైతులను పరామర్శించేందుకు నిజామాబాద్ జైలుకు వెళ్తున్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంను కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్ గేట్ వద్ద పోలీస్‌లు అరెస్టు చేశారు.

08/07/2018 - 04:44

జగిత్యాల, ఆగస్టు 6: ఖరీఫ్‌లో పంటలకు నీరు అందించకుండా కర్షకులను కేసీఆర్ సర్కార్ కన్నీళ్లు పెట్టిస్తోందని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆరోపించారు.

08/07/2018 - 04:41

వనపర్తి, ఆగస్టు 6: రాష్ట్రంలో వ్యవసాయం దండుగ కాదు పండుగ అని నిరూపించి రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచామని రాష్ట్ర విద్యుత్, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లాలోని వివిధ మండలల్లో సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

08/07/2018 - 03:58

హైదరాబాద్: తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటిన మహాజ్ఞాని ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు సోమవారం రాష్టవ్య్రాప్తంగా ఘనంగా జరిగాయి. తెలంగాణ వాధాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు.

Pages