S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/16/2020 - 06:27

హైదరాబాద్, మార్చి 15: ‘మిషన్ హైదరాబాద్’ పేరుతో హైదరాబాద్ నగర అభివృద్ధికి వచ్చే ఐదేళ్లలో 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ది మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

03/16/2020 - 06:25

హైదరాబాద్, మార్చి 15: రాష్ట్ర అసెంబ్లీ ఆదివారం నాలుగు బిల్లులను ఆమోదించింది. తెలంగాణ వస్తువులు సేవల పన్ను సవరణ బిల్లు, తెలంగాణ మహిళ స్వయం సహాయక బృందాల సహ వాటా పించన్ రద్దు బిల్లు, తెలంగాణ లోకాయుక్త సవరణ బిల్లు, తెలంగాణ జీతాలు, పించను చెల్లింపు, అనర్హతల తొలగింపు సవరణ బిల్లులను రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

03/16/2020 - 06:24

హైదరాబాద్, మార్చి 15: ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్న కరోనా వైరస్ నివారణకు చేపట్టే చర్యల కంటే, కరోనా వైరస్ విస్తరించకుండా ప్రజల్ని అప్రమత్తం చేయాలని కాంగ్రెస్ పక్షనేత భట్టి విక్రమార్క ప్రభుత్వానికి సూచించారు.

03/16/2020 - 06:23

హైదరాబాద్, మార్చి 15: సోషల్ మీడియాలో కరోనా పోస్టులు, స్టేటస్‌లపై తెలంగాణ పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. లేనిపోని పుకార్లు పుట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ హెచ్చరించారు. కోరోనాపై దుష్ప్రచారం చేస్తే ఏడాది జైలు శిక్ష విధిస్తామని సీపీ చెప్పారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.

03/16/2020 - 06:23

హైదరాబాద్, మార్చి 15: ఇంటింటికీ మంచినీరు దొరకలేదు కాని, ఇంటింటికీ మద్యం మాత్రం బెల్ట్‌షాపుల ద్వారా తెరాస ప్రభుత్వం అందిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం మద్యం బెల్ట్‌షాపులను ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు.

03/16/2020 - 06:22

హైదరాబాద్, మార్చి 15: కేంద్ర ప్రభుత్వ జన శిక్షణా సంస్థ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌గా ఆర్.ప్రకాష్‌గౌడ్ నియమితులయ్యారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక శాఖ గౌడ్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు ఐఎన్‌టీయూసీ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. గత 47 సంవత్సరాలుగా ప్రజలు, కార్మిక సమస్యలపై పోరాడుతున్న గౌడ్ ప్రస్తుతం ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు.

03/16/2020 - 06:21

హైదరాబాద్, మార్చి 15: తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తెలిపారు. సమాచార, పౌరసబంధాల పద్దులపై శాసనసభలో ఆదివారం మాట్లాడుతూ, జర్నలిస్టుల పక్షపాతిగా సీఎం పనిచేస్తున్నారని కితాబిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషించారన్నారు.

03/16/2020 - 06:20

హైదరాబాద్, మార్చి 15: వివిధ పద్దులకు శాసనసభ ఆదివారం ఆమోదం తెలిపింది.

03/16/2020 - 06:19

హైదరాబాద్, మార్చి 15: రాష్ట్ర ప్రభుత్వ కేంద్రీకృత వ్యవహారం శైలి కారణంగా శాస్తవ్రేత్తలు, డాక్టర్లు, నిపుణులతో నిరంతరం పర్యవేక్షించాల్సిన కరోనా అంశంపై వ్యవహరిస్తున్న తీరుపట్ల తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తమ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

03/16/2020 - 06:18

హైదరాబాద్, మార్చి 15:రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లోని పద్దులకు కేటాయించిన నిధులను త్వరితగతిగా విడుదల చేసి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికార పార్టీ తెరాస ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి సూచించారు. ఆదివారం శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ పద్దులపై తెరాస సభ్యులు మాట్లాడారు.

Pages