S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/14/2018 - 05:57

హైదరాబాద్, జూన్ 13: మేడ్చల్ జిల్లా రిజిష్ట్రార్ కార్యాలయంలో పని చేసే సీనియర్ అసిస్టెంట్ నేనావత్ కిషన్ ప్రసాద్‌ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎసిబి అధికారులు బుధవారం అరెస్టు చేశారు. రెండు చోట్ల ఇళ్ళు, రెండు చోట్ల ఇళ్లస్ధలాలు, ఒక చోట వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ రూ.4,38,000, నగదు రూ.1,47,000, రూ.12 లక్షల కారు, ఎల్‌ఐసి పాలసీలు ఉన్నట్లు గుర్తించారు.

06/14/2018 - 05:56

హైదరాబాద్, జూన్ 13 పర్యావరణ పరిరక్షించడంలో సింగరేణి ముందు వరుసలో ఉంటుందని అందుకు సింగరేణి థర్మల్ ప్లాంట్ వద్ద చేపట్టిన చర్యలు అందుకు తార్కానమని సింగరేణి సిఎండి శ్రీ్ధర్ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో తమ సంస్థ పర్యావరణ కోసం చేపడుతున్న అంశాలపై సుదీర్ఘంగా అధికారులతో చర్చలు జరిపారు.

06/14/2018 - 05:55

సిరిసిల్ల, జూన్ 13: కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా ముందుకు సాగుతూ త్వరలో 38 లక్షల ఎకరాలకు మూడు పంటల నీరందించబోతున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. బుధవారం సిరిసిల్ల మండలం సర్దాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు.

06/13/2018 - 04:33

హైదరాబాద్, జూన్ 12: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్స్యూరెన్స్ అంబుడ్స్‌మన్‌గా మాజీ ఐఆర్‌ఎస్ అధికారి ఐ సురేష్‌బాబు నియమితులయ్యారు. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంబుడ్స్‌మెన్ కార్యాలయం పనిచేస్తుంది. హైదరాబాద్ కేంద్రం ఎపి, తెలంగాణ రాష్ట్రాలకు, యానాం ప్రాంతాలను కూడా పర్యవేక్షిస్తుంది.

06/13/2018 - 04:33

హైదరాబాద్, జూన్ 12: రాష్ట్రంలో పేరొందిన సరోజనీ దేవి కంటి వైద్యశాలలో మరింత మెరుగైన సేవలు అందనున్నాయి. రూ.కోటి విలువైన అత్యాధునిక పరికరాలతో కూడిన కొత్త ఐ బ్యాంకును ప్రభుత్వం ఇక్కడ సిద్ధం అయింది. ఏసీ పోస్టు ఆపరేటివ్ వార్డుతో పాటు నేత్రాల సేకరణ కోసం ఒక అంబులెన్స్‌ను రెడీ చేశారు.

06/13/2018 - 04:33

కరీంనగర్, జూన్ 12: విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యనందించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నదని తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో రూ. 2.50 కోట్లతో నిర్మించిన జూనియర్ కళాశాల నూతన భవనాన్ని కడియం శ్రీహరి మంగళవారం ప్రారంభించారు.

06/13/2018 - 04:32

హైదరాబాద్, జూన్ 12: క్రీడా కోటాలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని సీపీఎం పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. క్రీడా కోటాలో సైతం అవినీతి, అక్రమాలకు పాల్పడటం విడ్డూరంగా ఉందని అన్నారు. స్వర్ధంతో నిజమైన క్రీడాకారులకు కాకుండా ఇతరులకు సీట్లను అంటగట్టే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు.

06/13/2018 - 04:32

హైదరాబాద్, జూన్ 12: తెలంగాణలో ముస్లింలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారని పీసీసీ ఛీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.

06/13/2018 - 04:31

హుజూర్‌నగర్, జూన్ 12: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే నాలుగు నెలల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌లు అమలు చేస్తానని హామీ ఇచ్చి నాలుగు సంవత్సరాలు దాటినా ఇవ్వకుండా మోసగించారని స్థానిక ఎమ్మెల్యే, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్‌నగర్‌లోని షాదీఖానాలో పత్రికల వారితో మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ముస్లింలను ఓట్లు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదని అన్నారు.

06/13/2018 - 04:28

మహబూబ్‌నగర్, జూన్ 12: పాలమూరు ఎత్తిపోతల పథకంపై కేసులు వేసి ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుకుని అడ్డంకులు సృష్టించిన వారే తిరిగి ధర్నాలకు దిగడం సిగ్గుచేటని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట, అడ్డాకుల గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నాయకులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

Pages