S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/12/2018 - 02:55

హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న అప్రజాస్వామిక పాలన తనకు కన్నీరు పెట్టిస్తోందని పార్లమెంట్ మాజీ స్పీకర్ మీరా కుమార్ అన్నారు. సోమవారం నగరంలో ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, బహిష్కృత ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌లతో కలిసి ఆమె మాట్లాడారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఏర్పడ్డ రాష్ట్రంలో నియంత పాలన సాగతుండటం బాధకరమన్నారు.

06/12/2018 - 02:38

హైదరాబాద్, జూన్ 11: ‘్భ రికార్డుల ప్రక్షాళన జాగ్రత్తంగా చేయాలని హెచ్చరించాం. కొంత సాంకేతిక సమస్యలకు తోడు కొందరు ఉద్యోగుల తప్పిదాల వల్ల చాలా చోట్ల పాసు పుస్తకాలు తప్పుల తడకగా ఉన్నట్టు ప్రభుత్వానికి సమాచారం అందింది. రికార్డులు తప్పుల తడకగా ఉంటే ‘్ధరణి’ వెబ్‌సైట్ ప్రారంభించడం సాధ్యం కాదు’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నంత పని అయింది.

06/12/2018 - 02:36

హైదరాబాద్, జూన్ 11: ఎదిగిన, చేతికి అందిన పిల్లలు పట్టించుకోకపోవడం, విదేశాల్లో స్థిరపడి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం వంటి ఎన్నో హృదయవిదారకరమైన సంఘటనలు చూస్తున్నాం. పిల్లల నిర్లక్ష్యం కారణంగా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న వృద్ధ తల్లిదండ్రులకు బాసటగా ఉండాలని, ‘చేయూత’నివ్వాలని ‘ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్’ నడుం బిగించింది.

06/12/2018 - 02:28

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణ వ్యాప్తంగా 2018 జూన్ చివరి వరకు పదికోట్ల పనిదినాలను కల్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. సచివాలయం నుండి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడారు. గత ఏడాది జూన్ చివరివరకు 8.68 కోట్ల పనిదినాలను కల్పించామని గుర్తుచేశారు.

06/12/2018 - 02:28

హైదరాబాద్, జూన్ 11: వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి లక్ష్మారడ్డె అధికారులను ఆదేశించారు. సోమవారం ఆరోగ్యశ్రీ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో మంత్రి సంబందిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మొదటి సారి నిర్వహిస్తున్న బదిలీల్లో ఒత్తిడి ఉండే అవకాశం ఉన్నందున పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.

06/12/2018 - 02:27

హైదరాబాద్, జూన్ 11: హైదరాబాద్‌లోని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్‌ఐఎన్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్) లో కొత్తగా మూడు పీజీ కోర్సులు ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థలో ఎంఎస్‌సీ (అప్లైడ్ న్యూట్రిషన్) కోర్సు నడుస్తోంది.

06/12/2018 - 02:27

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణ డెమోక్రాటిక్ ఫోరం కో కన్వీనర్ దుర్గాప్రసాద్‌ను కోర్టులో హాజరుపర్చాలని పౌరహక్కుల సంఘం నాయకుడు వరవరరావు, పలువురు ప్రజా సంఘం నేతలు డిమాండ్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న దుర్గాప్రసాద్‌ను ఇంతవరకు కోర్టులో హాజరు పర్చలేదని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి దృష్టికి తెచ్చారు.

06/12/2018 - 02:26

హైదరాబాద్, జూన్ 11: దళితుల పట్ల చిత్తశుద్ది ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కటేనని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన కేసీఆర్, చంద్రబాబులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వరంగల్‌లో జరిగిన సభ పార్టీల గర్జన సభగా మారిందని, సిద్దాంతాలు మరించి భావసారూప్యం లేని పార్టీలతో అపవిత్ర కలయికలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

06/12/2018 - 02:26

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న రైతు జీవిత బీమా నమోదు కార్యక్రమాన్ని జూలై 10 నాటికి పూర్తి చేయాలని అధికారులకు వ్యవసాయ ముఖ్య కార్యదర్శి పార్ధసారధి ఆదేశించారు. సోమవారం సచివాలయం నుంచి జిల్లా వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రైతుబంధు, రైతు జీవిత బీమా కార్యక్రమాలపై సమీక్షించారు.

06/12/2018 - 02:25

హైదరాబాద్, జూన్ 11: పోలవరం ప్రాజెక్టు పనులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే 39 శాతం పూర్తయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ క్రెడిట్‌ను కూడా తన ఖాతాలోనే వేసుకున్నారని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు.

Pages