S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/12/2018 - 02:25

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీల ఫీజు దోపిడిని అరికట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం బీసీ భవన్‌లో జరిగిన బీసీ విద్యార్ధుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడారు.

06/12/2018 - 02:22

ఆదిలాబాద్, జూన్11: ఎగువ మహారాష్టల్రో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. మహారాష్టల్రోని బాబ్లీ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పోటెత్తడంతో సోమవారం నాలుగు గేట్లు ఎత్తివేసి దిగువ గోదావరిలోకి వదలడంతో బాసర వద్ద గోదావరి జలకళ ఉట్టిపడింది.

06/12/2018 - 02:20

నిజామాబాద్, జూన్ 11: మహారాష్టల్రో కురుస్తున్న భారీ వర్షాల పుణ్యమా అని నిజామాబాద్ జిల్లా సరిహద్దున గల వివాదాస్పద బాబ్లీ బ్యారేజీ పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకుంది. దీంతో నిర్ణీత సమయానికి ముందే బాబ్లీ గేట్లను పైకి లేపి దిగువ గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం బాబ్లీ బ్యారేజీకి చెందిన నాలుగు గేట్ల ద్వారా 98వేల క్యూసెక్కుల నీటిని వదిలారు.

06/12/2018 - 02:15

హైదరాబాద్, జూన్ 11: పర్యాటక రంగంలో దేశంలోనే తెలంగాణను నెంబర్-1గా చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పన్యాల భూపతి రెడ్డి తెలిపారు. పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన పన్యాల భూపతి రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సోమవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ థాయ్‌ల్యాండ్, సింగపూర్, మలేషియా వంటి దేశాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని అన్నారు.

06/11/2018 - 23:57

కరీంనగర్, జూన్ 11: పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కొత్త పంచాయతీలు సరే.. సిబ్బంది పరిస్థితేంటనే ప్రశ్న ప్రస్తుతం పల్లె జనాల మదిలో మెదులుతోంది. పాత పంచాయతీల పరిధిలోనే అరకొర సిబ్బందితో ఎలాగోలా నెట్టుకొస్తుండగా, ఇప్పుడు మరికొన్ని కొత్త పంచాయతీల ఏర్పాటుతో వాటి నిర్వహణ ఎలా సాధ్యమనే అనుమానం అందరిలో నెలకొంది.

06/11/2018 - 23:55

నల్లగొండ, జూన్ 11: నకిలీ విత్తనాల బెడద రైతాంగాన్ని కలవరపరుస్తోంది. అసలేదో నకిలీ ఏదో తెలియని అయోమయ స్థితిలో రైతన్నలు మండలాల్లో, గ్రామాల్లో పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తున్న తీరు దయనీయంగా ఉంది. ఇప్పటికే పలు మండలాల్లో వెలుగు చూసిన నకిలీ విత్తనాల విక్రయ ఘటనలు, పట్టుబడిన నకిలీ విత్తనాలు సంగతి విదితమే.

06/11/2018 - 23:53

ఖమ్మం, జూన్ 11: ప్రతినిత్యం విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉన్నత శిఖరాలకు చేరాలని, అందుకు టీఆర్‌ఎస్ పార్టీ ప్రతి ఒక్కరికి వేదికగా నిలుస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడి యం శ్రీహరి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట్రంలోనే తొలిసారిగా నియోజకవర్గ నాయకులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు.

06/11/2018 - 23:52

నారాయణపేట టౌన్, జూన్ 11: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని నరేంద్రమోదీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ జాతీయ నాయకులు సూదిని జైపాల్‌రెడ్డి విమర్శించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో జరిగిన కాంగ్రెస్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

06/11/2018 - 03:18

కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను ఆదివారం ఆయన ఇంట్లో కేంద్ర మంత్రి శ్రీరాం కృపాల్ యాదవ్ కలిశారు. ఇటీవల దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ మృతి చెందిన విషయం తె లిసిందే.

06/11/2018 - 03:14

హైదరాబాద్, జూన్ 10: ఈద్ నెలవంకలా ప్రజల జీవితాలు అందంగా సాగాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎంపీలు మల్లారెడ్డి, వినోద్‌లు పాల్గొన్నారు.

Pages