S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/13/2018 - 04:24

హైదరాబాద్, జూన్ 12: నకిలీ ఉత్పత్తులు ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాలేదని, యావత్ ప్రపంచాన్ని ఈ సమస్య పట్టిపీడిస్తోందని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం నగరంలో ఇక్కడ ఫిక్కి ఆధ్వర్యంలో ‘నకిలీలు మరియు స్మగ్లింగ్‌పై పోరాటం - ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు అత్యవసరం’ అనే అంశంపై సెమినార్ జరిగింది.

06/13/2018 - 04:22

హైదరాబాద్, జూన్ 12: రష్యాలో ఉన్న ప్రముఖ వైద్య విద్యాసంస్థల్లో అడ్మిషన్లకు ఉన్న అవకాశాలపై హోటల్ మేరిగోల్డ్‌లో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంస్థల్లో చేరేందుకు ఉన్న నియమనిబంధనలు, ఫీజులు, అడ్మిషన్ల విధానం, వాతావరణ పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు.

06/13/2018 - 04:21

హైదరాబాద్, జూన్ 12: ‘మరణం నను వరించి వస్తే... ఏమంటాను నేనేమంటాను’ అన్న సినారె తన మరణాన్ని కూడా ఆవాహనం చేసి ఆహ్వానించిన మహాకవి అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు జూలూరి గౌరీశంకర్ అన్నారు. మంగళవారం నగరంలో ఇక్కడ సి.నారాయణ రెడ్డి ప్రథమ వర్ధంతి సభ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన గౌరీశంకర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

06/13/2018 - 04:19

హైదరాబాద్, జూన్ 12: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు మైసూర్‌లోని ‘సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ (సీఎఫ్‌టీఆర్‌ఐ) ముందుకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం నుండి సేద్యం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఉన్నతస్థాయి బృందం మంగళవారం మైసూరు వెళ్లింది.

06/13/2018 - 04:17

హైదరాబాద్, జూన్ 12: ‘బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ’ ఎన్నికలు ‘టగ్ ఆఫ్ వార్’ గా నడుస్తున్నాయి. ఈ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగానే ఉంటున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తెరవెనుక నుండి తన పెత్తనం ఉండేలా ప్రయత్నిస్తోందని తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దూరపు బంధువు అయిన కరీంనగర్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది గండ్ర మోహన్‌రావు ఈ ఎన్నికల్లో కీలక భూమిక పోషిస్తున్నారు.

06/13/2018 - 04:16

హైదరాబాద్, జూన్ 12: రెండేళ్ల డిప్లొమో ఇన్ ఎడ్యుకేషన్ కోర్సులో చేరేందుకు ఈ నెల 18వ తేదీ నుండి రెండు రోజుల పాటు డీసెట్ అభ్యర్ధుల సర్ట్ఫికెట్ల పరిశీలన చేపడుతున్నట్టు కన్వీనర్ సి హెచ్ రమణకుమార్ తెలిపారు. వెబ్ ఆధారిత ఆప్షన్లను ఈ నెల 20 నుండి 22 వ తేదీ వరకూ ఇవ్వాలని, సీట్ల కేటాయింపు 25, 26 తేదీల్లో జరుగుతుందని చెప్పారు.

06/13/2018 - 04:15

హైదరాబాద్, జూన్ 12: రబీలో ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి నిధుల సమస్యలేదని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. నిధుల కొరతతో ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపులు జరగడం లేదని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. ఉద్దేశపూర్వకంగా కొంతమంది ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

06/13/2018 - 05:04

హైదరాబాద్: రానున్న రోజుల్లో ఉస్మానియా యూనివర్శిటీ యుజి పరీక్షల మూల్యాంకనం ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని యూనివర్శిటీ యోచిస్తోంది. డిగ్రీ స్థాయిలో దాదాపు వెయ్యి సబ్జెక్టులను 16 లక్షల మంది రాస్తున్నారు. వాటన్నింటి కోడింగ్, డీ కోడింగ్, మూల్యాంకనం, ట్యాబులేషన్, ఫలితాల ప్రకటన పెనుభారంగా మారింది.

06/13/2018 - 04:14

హైదరాబాద్, జూన్ 12: టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని, మతోన్మాద మజ్లిస్ పార్టీ నుండి రాష్ట్రాన్ని విముక్తి చేయాలంటే బీజేపీకి రాష్ట్ర ప్రజలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. లౌకికతత్వం గురించి మాట్లాడే మజ్లిస్, టీఆర్‌ఎస్ పార్టీతో ఎలా పొత్తుపెట్టుకుంటుందని ఆయన నిలదీశారు.

06/12/2018 - 23:46

నిజామాబాద్, జూన్ 12: విద్యారంగ అభివృద్ధి పరంగా నిజామాబాద్ జిల్లా మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే తెలంగాణ యూనివర్శిటీ, ప్రభుత్వ వైద్య కళాశాల వంటి ఉన్నత విద్యా కుసుమాలతో విలసిల్లుతున్న ఇందూరుకు తాజాగా కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ అధికారికంగా ఉత్తర్వులు వెలువరించింది.

Pages