S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/15/2018 - 00:04

హైదరాబాద్, జూన్ 14: ఐఐటి బాసరలో మోడల్ స్కూళ్ల విద్యార్థులు తమ సత్తా చాటారు. బాసరలోని 1500 ఐఐటి సీట్లలో 400 సీట్లు మోడల్ స్కూల్ విద్యార్థులే దక్కించుకున్నారు. గత ఏడాది మోడల్ స్కూల్ విద్యార్థులు 300 సీట్లను దక్కించుకోగా, ఈసారి మరో వంద అదనంగా దక్కించుకున్నారు. సీట్లు సాధించిన విద్యార్థులను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, డైరెక్టర్ సత్యనారాయణలు అభినందనలు తెలిపారు.

06/15/2018 - 00:03

హైదరాబాద్, జూన్ 14: సమాజంలో కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడపాలని చూసే నైజం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఉందని తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు తీవ్రంగా దుయ్యబాట్టరు. గురువారం వైసిపి పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి మోత్కుపల్లితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.

06/15/2018 - 00:03

నిజామాబాద్, జూన్ 14: కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలవడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వెలువడిన ఫలితాలే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్‌లో కొనసాగుతున్న ఏఐఎస్‌ఎఫ్ రాష్టస్థ్రాయి రాజకీయ శిక్షణ తరగతుల్లో గురువారం పాల్గొన్న సందర్భంగా ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

06/15/2018 - 00:02

హైదరాబాద్, జూన్ 14: వరంగల్‌లో నిర్వహించిన దళిత, గిరిజన సంహగర్జన సభకు సీపీఎం పార్టీ గైర్హారుజుపై ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేస్తున్న విమర్శలు అర్ధరహితమని సీపీఎం పార్టీ కార్యవర్గం పేర్కొంది. గురువారం పార్టీ కార్యాలయంలో పలు అంశాలపై కార్యవర్గం చర్చించింది. దళిత, గిరిజన హక్కుల కోసం జరుగుతున్న అన్ని పోరాటాల్లో తమ పార్టీ ముందు వరుసలో ఉంటుందని చెప్పారు.

06/15/2018 - 00:02

హైదరాబాద్, జూన్ 14: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో 120 లోక్‌సభ సీట్లను గెలుచుకునేందుకు పార్టీ కేంద్ర నాయకత్వం ఎన్నికల వ్యూహం రచిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధరరావు పేర్కొన్నారు.

06/15/2018 - 00:01

హైదరాబాద్, జూన్ 14: తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుస్తులతో పాటు వివిధ కేటగిరిల ఉద్యోగుల బదిలీల అంశంలో బలవంతపుబదిలీలకు యాజమాన్యం ప్రయత్నస్తోందని విద్యుత్ ఉద్యోగ యూనియన్లు గళం ఎత్తుతున్నాయి. దీంతో ఇటు యామాన్యం అటు ఉద్యోగుల మధ్య మాటలు తూటాళ్ళుగా పేలుతున్నాయి. ఎవరికి వారు తగ్గేదిలేదని హెచ్చరికలు చేసుకుంటున్నారు.

06/14/2018 - 06:02

హైదరాబాద్, జూన్ 13: ‘ప్రాజెక్టులు పూర్తయ్యే వర కు మంత్రిలా కాకుండా పెద్ద మేస్ర్తిలా పని చేస్తా’నని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీ రు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద కార్మికుల కొరత ఉం దని అధికారులు తన దృష్టికి తీసుకరాగా, చనాకా- కోరా ట నుంచి తానే కార్మికులను సమకూర్చి మేస్ర్తి లా వ్యవహరించానని మంత్రి గుర్తు చేసారు.

06/14/2018 - 06:01

హైదరాబాద్, జూన్,13 దక్షణ భారత దేశంలో అత్యాధునిక ఐ బ్యాంక్‌ను హైదరాబాద్ సరోజినీ దవాఖానాలోరాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు కోటి రూపాయల ఖర్చు ఐ బ్యాంక్ ఏర్పాటుకు సరోజినీ ఆసుపత్రి యాజమాన్యం ముందుకు రావడం చూస్తే సేవాభావం స్పష్టమవుతోందన్నారు. కొత్త ఎసీ పోస్టు, ఆపరేటీవ్ వార్డు, నేత్రాల సేకరణకు అంబులెన్స్‌ను ఆయన ప్రారంభించారు.

06/14/2018 - 06:00

హైదరాబాద్, జూన్ 13: నగరంలోని హుమయూన్ నగర్ ఎస్‌ఐ సిహెచ్.శ్రీకాంత్, అతనికి సహకరించిన కానిస్టేబుల్ రహీంపాషాలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కి చిక్కారు. ఎసిబి అదనపు డిజి కార్యాలయం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒక కేసులో నిందితుడిని వేధించకుండా ఉండేందుకు, బెయిల్ త్వరగా వచ్చేలా సహకరించేందుకు గాను ఎస్‌ఐ శ్రీకాంత్ రూ.లక్ష డిమాండ్ చేశారు.

06/14/2018 - 05:59

హైదరాబాద్, జూన్ 13: తెలంగాణలోని ఉపాధ్యాయ విద్యా కళాశాలల్లో బి.ఇడి కోర్సులో చేరేందుకు నిర్వహించిన ఎడ్‌సెట్ -2018 ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి బుధవారం నాడు విడుదల చేశారు. సెట్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం , కన్వీనర్ ప్రొఫెసర్ సి మధుమతి, ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 32, 330 మంది పరీక్షకు హాజరయ్యారు.

Pages