S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/11/2018 - 03:12

హైదరాబాద్, జూన్ 10: ఏకపక్ష పాలన వ్యవస్థ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం గనరంలో ఇక్కడ భారత కమ్యూనిస్టు ఉద్యమ అగ్ర నాయకులు చండ్ర రాజేశ్వరరావు 104వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ముఖ్య అతిధిగా రాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళర్పించా రు.

06/11/2018 - 03:10

హైదరాబాద్, జూన్ 10: తెలంగాణ కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలతో ఆయన నాయకత్వం దేశానికి అవసరమని 29 రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

06/11/2018 - 02:58

హైదరాబాద్, జూన్ 10: తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకునేందుకు తెలంగాణ బ్రాహ్మణ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటైంది. హైదరాబాద్ (కర్మన్‌ఘాట్) లోని లక్ష్మీ కనె్వన్షన్ హాల్‌లో ఆదివారం సాయంత్రం మూడు గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి ఎనిమిది గంటల వరకు కొనసాగింది.

06/11/2018 - 02:56

హైదరాబాద్, జూన్ 10: త్వరలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34శాతం నుంచి 54 శాతానికి పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ముఖ్యమంత్రిని కోరింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆదివారం ముఖ్యమంత్రి కేసీ ఆర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన 12,757 గ్రామపంచాయతిల్లో నిర్వహించిన బీసీ ఓటర్ల జనాబా లెక్కల్లో బీసీ జనాబా 54.6శాతం ఉందని తేలిందని అన్నారు.

06/11/2018 - 02:55

హైదరాబాద్, జూన్ 10: టీఎస్‌ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆ సంస్థ గుర్తింపు కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు, మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఆర్టీసీ కార్మికుల సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న అనంతరం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ రం గ సంస్థలను బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నార ని అన్నారు.

06/11/2018 - 02:54

హైదరాబాద్, జూన్ 10: ప్రభుత్వంతో గుర్తింపు కార్మిక సంఘం కుమ్మక్కై తక్కువ ఐఆర్‌కు అంగీకరించి కార్మికుల ఆశలను వమ్ము చేసిందని ఆర్టీసీ ఎన్‌ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు విమర్శించారు. ఇందుకు నిరసనగా సోమవారం అన్ని డిపోల వద్ద నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు. వేతన సవరణపై నిర్ణయం రాకుండానే సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని తెలిపారు.

06/10/2018 - 05:41

హైదరాబాద్, జూన్ 9: ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర జరిగింది నిజమేనా? అనే అనుమానాన్ని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంత రావు వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత పెరిగినందున సానుభూతి కోసమే ఇటువంటి ఎత్తుగడ వేశారేమోనన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో అన్నారు.

06/10/2018 - 05:40

హైదరాబాద్,జూన్ 9: ఇంజనీరింగ్ తొలి దశలో సీట్లు పొందిన వారు వెంటనే తమ అలాట్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకుని సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ పేర్కొన్నారు.

06/10/2018 - 05:40

హైదరాబాద్, జూన్ 9: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగో విడత హరితహారం జూలై రెండవ వారంలో ప్రారంభించన్నారు. 2015 జూలై 3న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మొదటిసారిగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆనాటి నుంచి ప్రతి ఏడు ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా ప్రభుత్వం నిర్వహిస్తోంది.

06/10/2018 - 05:39

హైదరాబాద్, జూన్ 9: దేశంలోనే తెలంగాణ పోలీసు, ముఖ్యంగా హైదరాబాద్ నగర పోలీస్ పనితీరు భేష్ అని భారత ప్రభుత్వ భద్రతా విభా గం ఉప జాతీయ సలహాదారు రాజేంద్ర ఖన్నా కితాబిచ్చారు.

Pages